వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిబియాలో తెలుగు లెక్చరర్ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugu lecturer killed in Libya
హైదరాబాద్: ఉద్యోగం కోసం లిబియాకు వెళ్లిన ఓ లెక్చరర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో హైదరాబాదులోని గాంధీనగర్‌లో గల అతని కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు. గాంధీనగర్ ఓల్డ్ బాలాజీ థియేటర్ వద్దనున్న పురుషోత్తం అపార్ట్‌మెంట్‌లో నివసించే ఎండీ నజీముద్దీన్ నాలుగేళ్ల క్రితం లిబియా దేశంలోని అజితాబియా క్యాంపస్‌లోని బెంగాజీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేయడానికి వెళ్లారు.

ఆయన స్వస్థలం అనంతపూర్ జిల్లా. ఆయనకు భార్య రషీదా నస్రీన్, ఓ కుమార్తె ఉంది. లిబియా దేశానికి వెళ్లకముందు ఆయన గోల్కొండ చౌరస్తాలో నైస్ స్టడీ సర్కిల్‌ పేరిట పోటీపరీక్షల శిక్షణా సంస్థను నిర్వహించేవారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల వరకు భార్యతో ఫోన్‌లో మాట్లాడిన నజీముద్దీన్ రేపు మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశారు.

అయితే రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన నివసించే అపార్ట్‌మెంట్ కాలనీలోనే నివసించే 16 ఏళ్ల బాలుడు అతని ఇంట్లోకి చొరబడి చాకుతో నజీముద్దీన్‌ను పొడిచి చంపేశాడు. ఇంట్లోని నగలు, నగదు తీసుకొని పరారయ్యాడు.

నజీముద్దీన్‌ను ఆస్పత్రికి తరలించేసరికే అతను చనిపోయినట్టు ఆయనతోపాటు అక్కడే లెక్చరర్‌గా పనిచేస్తున్న జహీర్‌ఖాన్ అనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి రాత్రి 12.30 గంటలకు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన భార్య కోమాలోకి వెళ్లిపోయింది.

English summary

 An NRI lecturer killed in Libya. His family is living in Hyderabad. The deceased MD Nazimuddin is from Ananthapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X