వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలిఫోర్నియాలో ఆర్య, వైశ్య స్వయంవరం - 4

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆర్య వైశ్య స్వయంవరం-4 జరగనుంది. నవంబర్ 6వ తేదీన మయూరి ఇండియన్ క్యూజిన్ వేదికగా ఉదయం 11గం.ల నుంచి సాయంత్రం 4గం.ల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

ఆర్య, వైశ్య కమ్యూనిటీలకు చెందిన యువతీ యువకులు ఈ స్వయంవరంలో పాల్గొనవచ్చును. డాక్టర్స్, ఇంజినీర్స్, ఎంబీఏ, పీహెచ్.డీ, సీఏ పూర్తి చేసినవారు, బిజినెస్, విఐపి కుటుంబాలకు చెందిన యువతీ యువకులు ఈ స్వయంవరంలో పాల్గొనవచ్చునని నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కాగా, ఈ వివాహా వేదికకు సంబంధించిన మ్యాట్రిమోనల్ కార్యాలయం బెంగుళూరులో ఉంది.

ఇకపోతే పైన పేర్కొన్న నిబంధనలకు లోబడి ఆర్య వైశ్య స్వయంవర-4లో పాల్గొనాలనుకునే వారు తమ ఈమెయిల్ ద్వారా [email protected] ఫోటోగ్రాఫ్ తో సహా తమ పూర్తి వివరాలను పంపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక రిజిస్ట్రేషన్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా కార్యక్రమంలో పాల్గొనవారికి వంద డాలర్ల నుంచి రూ. 6600 వరకు వసూలు చేయనున్నారు.

The Grand International Arya vysya swaryamvara 4 in USA

కాగా, అమ్మాయి లేదా అబ్బాయి తరుపునుంచి కేవలం మరో ఇద్దరికి మాత్రమే కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశముంటుంది. కార్యక్రమానికి హాజరయ్యే వారికోసం టీ మరియు లంచ్ ను ఏర్పాటు చేస్తారు. కార్యక్రమంలో పాల్గొన్న, మెయిల్ ద్వారా రిజిస్టర్ అయిన అందరి వివరాలను ఓ బుక్ లెట్ లేదా సీడీ రూపంలో భద్రపరిచి సభ్యులందరికి పంపిణీ చేస్తారు.

కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేనివారికి 20డాలర్ల నుంచి రూ.1300 చార్జ్ చేయనున్నారు. పరోక్షంగా పాల్గొనవారికి కూడా ఆర్య వైశ్య స్వయంవరం తరుపున రూపొందించే సీడీ లేదా బుక్ లెట్ ను కొరియర్ ద్వారా అందజేస్తారు.

English summary
Kalasivundham is exclusive premium elite matrimonial service for the stars of the Arya vysya community. We will provide the finest profiles from royal and VIP families that suit your status. Kalisivundhamgmail.com is the mail to enter the details and get registration
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X