'గడీల పాలన -తాకట్టులో తెలంగాణ': ఎన్నారై కాంగ్రెస్ పుస్తకావిష్కరణ..

Subscribe to Oneindia Telugu

లండన్: శుక్రవారం లండన్‌లో తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో టీపీసీసీ తయారుచేసిన పీపుల్స్ ఛార్జ్ షీట్ - పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు.

తెరాస 3 ఏండ్ల రాచరిక పాలనలో ప్రజల అవస్థలు,తప్పిన ఎన్నికల వాగ్ధానాలు, నిరంకుశ ,అప్రజాస్వామిక ,ప్రజా వ్యతిరేక విధానాలపై, వివిధ రంగాల్లో అడ్డగోలు వ్యవహారాలపై తయారుచేసిన 'గడీల పాలన -తాకట్టులో తెలంగాణ' పుస్తక ఆవిష్కరణ చేసారు .

tpcc book against trs ruling in telangana

దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ అమరుల బలిదానాల సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణ రాచరిక పాలనను తలపిస్తుందని ,ఒంటెద్దు పోకడలు ఎన్ని రోజులు అని ప్రశ్నించారు. ఓట్లు సీట్లు ఆలోచన లేకుండా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రికి సూచించారు .

కార్యక్రమంలో అడ్వైజరీ మెంబర్లు డోకుర్ పవన్ కుమార్ ,ఓరుగంటి కమలాకర్ రావు, యూకే కన్వీనర్ గంప వేణుగోపాల్ తదితరులు ప్రసంగించి ప్రభుత్వ పని తీరు పై ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు రంగుల సుధాకర్ గౌడ్ ,రామ్మోహన్ రెడ్డి ,రాకేష్ బిక్కుమండ్ల ,అచ్యుత రెడ్డి సభ్యులు ,సత్య ప్రకాష్ , రాజేశ్వేర్ రెడ్డి , దేవులపల్లి శ్రీనివాస్ ,మధు గట్ట ,తదితరుల ఆధ్వర్యం లో సుమారు 100 మంది పుస్తకావిష్కరణ కి మద్దతు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telagnanapradesh congress nri members released a book against TRS party ruling and their failures.
Please Wait while comments are loading...