వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రైవ్యాలీ తెలుగువాళ్లను ముంచింది

By Pratap
|
Google Oneindia TeluguNews

Tri valley University ditched the students
వాషింగ్టన్: అమెరికాలోని ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం విద్యార్థులను ముంచిన విషయన నిజమేనని తేలింది. ఈ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులే చేరారు. నాలుగేళ్ల క్రితం ఈ విశ్వవిద్యాలయం బాగోతం బయటపడింది. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. వందలాది విద్యార్థులను మోసం చేసిన వర్సిటీ వ్యవస్థాపకురాలు సుసాన్ గ్జియో పింగ్ సును శాన్‌ఫ్రాన్సిస్కోలోని జిల్లా కోర్టు దోషిగా తేల్చింది.

కుట్ర, వీసా మోసం, నకిలీ ద్రువపత్రాలు సమర్పించడం, ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం సహా 31 అభియోగాల కింద ఆమెను దోషిగా తేల్చింది. జూన్ 20న ఆమెకు శిక్షను ఖరారు చేయనుంది. ఈ కేసును మూడు వారాలపాటు విచారించిన శాన్ ఫ్రాన్సిస్కోలోని అమెరికా జిల్లా కోర్టు జడ్జి జాన్ ఎస్ టైగర్ సును దోషిగా తేల్చారు. యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి వసూళ్లు, అక్రమంగా నగదు బదిలీలు, వీసా మోసాల ద్వారా ఆమె 5.9 మిలియన్ అమెరికా డాలర్లు (దాదాపు రూ.35 కోట్లు) సంపాదించిందని కోర్టు తేల్చింది.

ఇందులో 90 శాతాన్ని కేవలం భారత్ నుంచి వచ్చిన విద్యార్థుల నుంచే పిండుకుందని స్పష్టం చేసింది. ఆ డబ్బుతో ఆమె మనీ లాండరింగ్‌కు పాల్పడిందని వివరించింది. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బును యూనివర్సిటీ కార్యకలాపాలకు ఖర్చు చేయకుండా రియల్ ఎస్టేట్‌లో పెట్టిందని ఆరోపించింది. ఆ డబ్బుతో ఆమె మెర్సిడెజ్ బెంజ్ కారు కొనుక్కుందని, ఒక రాజసౌథం సహా రెండు భవంతులు కొనుక్కుందని తెలిపింది.

ట్రైవ్యాలీ అక్రమాలు 2010 మేలో వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఆ ఏడాది నవంబర్లో సుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా, విద్యార్థులనే కాదు - యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఆమె అమెరికా ప్రభుత్వాన్నే మోసం చేసిందని గుర్తు చేశారు.

English summary
Tri valley university in USA has cheated hundreds of Telugu students. The case has been finalised in the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X