వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్: గల్ఫ్ బాధితునికి ఆర్ధిక సహాయం

మూడు సంవత్సరాల క్రితం బ్రతుకు దెరువు కోసం బహ్రెయిన్వచ్చిన గూగులవత్ రాజేందర్ (29) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయారు. ఆయన స్వగ్రామం జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి మండల పరిధిలో ఉన

|
Google Oneindia TeluguNews

బహ్రెయిన్: మూడు సంవత్సరాల క్రితం బ్రతుకు దెరువు కోసం బహ్రెయిన్
వచ్చిన గూగులవత్ రాజేందర్ (29) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయారు. ఆయన స్వగ్రామం జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి మండల పరిధిలో ఉన్న గంగారావుపేట్. రాజేందర్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినవాడు.

బహ్రెయిన్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్‌గా పనిచేస్తున్న గూగులవత్
రాజేందర్ గత సెప్టెంబర్ 8న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మధ్యాహ్నాం 3.40గం. సమయంలో
గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీ కొట్టింది. దీంతో ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో గత శుక్రవారం రోజున అతని బంధువు ఎన్నారై టీఆర్ఎస్ విభాగాన్ని
ను కలిశారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బృందం వెంటనే రాజేందర్ చికిత్స పొందుతున్న కింగ్ హమ్మెద్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించడం జరిగింది.

గత రెండు రోజుల క్రితం గూగులవత్ రాజేందర్ టెలిఫోన్ ద్వారా టీఆర్ఎస్ ఎన్నారైతో మాట్లాడి తన గోడ వెల్లబోసుకున్నాడు. 'మా కంపెనీ గత రెండు నెలల నుండి జీతం ఇవ్వడం లేదు. ప్రతి రెండు రెండు వారాలకు హాస్పిటల్ కు వెళ్లాల్సిందే,అప్పుడప్పుడు విపరీతమైన నొప్పి తో చాల అవస్థలు పడుతున్నాను తాను సహాయం లేనిదే నడవలేక పోతున్నాను పేదరికంతో వలస వచ్చి క్రమ శిక్షణతో పని చేస్తూ ప్రతి నెల డబ్బులు పంపుతూ తన భార్య పిల్లలను
సంతోషాన్ని నింపే సమయంలో విధి రూపంలో మా కుటుంబాన్ని దుఃఖ సాగరం లో ముంచేసింది

TRS NRI Cell of bahrain helped to a accident victim

'ఇప్పుడు హాస్పిటల్ కు వెళ్లాలంటే చేతిలో చిల్లి గవ్వ లేదు. తన భార్య పిల్లలతో
మాట్లాడాలంటే చేతిలో చిల్లి గవ్వ లేదని తన గోడును విన్నవించుకున్నాడు
.ఎన్నారై టి ర్ ఎస్ ఆధ్వర్యంలో గూగులవత్ రాజేందర్ క్యాంపుకు వెళ్లి అతని ఆరోగ్యం
గురించి తెలుసుకొని అతని ఖర్చులకు గూగులవత్ రాజేందర్ కి పన్నెండువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఎవరికి ఏ ఆపద వచ్చిన తెలంగాణ బిడ్డలకు తమ వంతు సహాయం
అందజేస్తామని ఎన్నారై టి ఆర్ ఎస్ బహరేన్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు
హామీ ఇచ్చారు, వారి వెంట ముఖ్య నాయకులుజనరల్ సెక్రటరీ బద్రి ,డాక్టర్.రవి , సెక్రటరీ దేశెట్టి
రవి పటేల్ , సుమన్ అన్నారం ,మగ్గిడి రాజేందర్ పాల్గొన్నారు .

English summary
Trs Nri cell was helped financially for guguloth Rajender in bahrain. Rajender met with an accident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X