వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్ఫ్ బాధితుడికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ చేయూత..

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అతన్ని ఇంటికి తరలించేందుకు ఎంపీ కవిత సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

|
Google Oneindia TeluguNews

బహరేన్: బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో పక్షవాతంతో బాధపడుతున్న బాధితునికి ఆర్థిక సహాయం అందించి ఇండియాకు పంపియడం జరిగింది.

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన "సాయన్న పథన్ని" 48 పాస్పోర్ట్ నెంబర్ K4698324, ఎన్నో ఆశలతో పొట్ట చేతిన పట్టుకుని గత ఆరు నెలల క్రితం బహరేన్ కు వచ్చాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ గత రెండు వారాల క్రితం డ్యూటీలో కళ్లు తిరిగి పడిపోయాడు. ఆ సమయంలో స్పర్శ కూడా కోల్పోవడంతో కంపెనీ యాజమాన్యం సల్మానియా ఆస్పత్రికి తరలించారు.

trs nri cell helped to a gulf victim to send india

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బహరేన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బృందం వెంటనే ఆసుపత్రికి వెళ్లి అతన్ని బాధితున్ని పరామర్శించి, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పక్షవాతం రావడం వల్ల ఎడమ కాలు చేయి పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారు.

తన పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదనతో ఉన్న సాయన్న.. తనను స్వగ్రామానికి పంపించాల్సిందిగా ఎన్నారై టీఆర్ఎస్ బృందాన్ని వేడుకున్నాడు. దీంతో కంపెనీ అధికారులతో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ లు అధికారులతో మాట్లాడారు.

వెంటనే స్పందించి అతనితో పాటు మరో వ్యక్తి కి టికెట్ ఇచ్చి ఇండియాకు పంపించారు. అనంతరం ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో అతని మందుల ఖర్చులకు 10.000/- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

trs nri cell helped to a gulf victim to send india

కాగా, తేదీ18.07.17 మధ్యాహ్నం గల్ఫ్ ఎయిర్ GF276 ద్వారా బాధితుడు బహరేన్ నుండి 02:25గం లకు బయలు దేరి రాత్రి 09:05గం లకు శంషాబాద్‌ చేరగా, ఎయిర్‌పోర్ట్‌ నుండి స్వగ్రామానికి తరలించడానికి టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత కల్వకుంట్ల గారి ఆధ్వర్యంలో జాగృతి రాష్ట ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి మరియు బాబురావు ఇందుకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.

సాయన్న తొందరగా కోలుకోవాలని ఆ భగవంతునీ కోరుతూ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, రవి, సెక్రెటరీలు ప్రశాంత్, రవిపటేల్, సుమన్, జాయంట్ సెక్రెటరీలు రాజేంధార్, గంగాధర్, సంజీవ్, విజయ్, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, దేవన్న, రాజేష్, రాజు, నర్సయ్య, తదితరులు సభ్యులు పాల్గొన్నారు.

English summary
TRS NRI Cell was helped to a Gulf victim Sayanna to send him to India. Sayanna was suffering from Paralysis
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X