హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండే: ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్
హుజురాబాద్ బై పోల్‌లో టీఆర్ఎస్ విజయం తథ్యం అని గులాబీ నేతలు అంటున్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ కూడా అలానే ధీమాతో ఉంది. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ నేతలు కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తున్నారు.
ఆయా పథకాలను ప్రపంచం ఆకర్షిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం వారి రాజకీయ లబ్దికోసం చూస్తున్నాయని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం అన్నారు. ఆయన ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి గారు, లండన్ కార్యవర్గ సభ్యుల కలిసి హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ నాయకత్వం ఉంటేనే రైతుబంధు, దళితబంధు లాంటి కార్యక్రమాలు మరెన్నో వస్తాయని చెప్పారు. ప్రతిపక్షాలకు అవకాశమిస్తే అన్ని బంద్ అవుతాయని ప్రజలకు వివరించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కేసీఆర్ సొంత తమ్ముడిలా భావించి రాజకీయంగా ప్రోత్సహించారని వివరించారు. ఎన్నో అవకాశాలు కల్పించారని చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, స్వప్రయోజనాలకోసం బీజేపీలో చేరారని విమర్శించారు.
పార్టీని నాశనం చేయాలని కోరుకుంటున్నారని.. వీటన్నింటిని ప్రజలు గమిస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్తారని అనిల్ కూర్మాచలం తెలిపారు. ఈటల రాజేందర్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కరోనా రెండో దశలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయినప్పుడు బీజేపీని వ్యతిరేకించిన ఈటల రాజేందర్ అదే పార్టీలో ఎందుకు చేరారో ప్రజలందరు ఆలోచించాలని అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేసారు.

ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ప్రత్యేక కార్యాచరణతో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి క్షేత్రస్థాయిలో కృషిచేస్తుందని తెలిపారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి గారు, కార్యదర్శులు సత్యమూర్తి చిలుముల, సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, రాజ్ కుమార్ శానబోయిన, విక్రమ్ కుమార్, తిరుమందాస్ నరేష్, రఘువరన్ హుజురాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి రియాజ్, హుజురాబాద్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందే సాయిచరణ్, హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ సెక్రటరీ మధుకర్ రెడ్డి, హుజురాబాద్ సోషల్ మీడియా ఇంచార్జ్ గాలి రాకేష్, టీఆర్ఎస్ నాయకులు ఫయాజ్, బాబా లవన్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications