వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకె పార్లమెంట్‌‌లో బిఎస్ఐసిసి: తెలంగాణ విశిష్టతపై బూర(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటీష్ సౌత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కామర్స్(బిఎస్ఐసిసి), తెలంగాణా ఎన్నారై ఫోరం (టిఈఎన్ఎఫ్-యూకే శాఖ సంయుక్తంగా లండన్‌లోని బ్రిటీష్ పార్లమెంట్‌లో బ్రిటిష్ సౌత్ ఇండియన్ బిజినెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల ప్రతినితులు, స్థానిక బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి భువనగిరి ఎంపి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, తెలంగాణ టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎండి డాక్టర్ క్రిస్టీనా, తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్, వ్యవస్థాపక సబ్యుడు, ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నగరాజు పాల్గొన్నారు.

బ్రిటన్ ఎంపి, బిఎస్ఐసిసి పాట్రన్ వీరేంద్ర శర్మ ముందుగా స్వాగతోపన్యాసం చేశారు. భారత- యూకే దేశాల మధ్య ఉన్న మంచి వ్యాపార అనుకూల విధానాల గురించి వివరించారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని హాజరైన అన్ని రాష్ట్రాల ప్రతినిధులను కోరారు. ముఖ్యంగా తెలంగాణ ప్రతినిధులను ప్రశంశిస్తూ.. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు తీసుకెళ్తున్న తీరును అభినందించారు.

భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విశిష్టత, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, గణాంకాలతో సహా వివరించారు. ఐటి, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్, నీళ్ళు, ప్రతి రంగంలో గత సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్ననిర్ణయాల గురించి వెల్లడించారు.

ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సరికొత్త నూతన పారిశ్రామిక విధానం టిఎస్ ఐపాస్ విధి విధానాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న అవినీతి లేని పెట్టుబడులకి అనుకూల నిర్ణయాలన్ని సభకు వివరించారు. రోజు రోజుకు అభివృద్ధిలో హైదరాబాద్ తీసుకెళ్తున్నతీరు గురించి ప్రత్యేకంగా వివరించారు. నవంబర్ 5న హైదరాబాద్‌లో ప్రారంభమైన భారతదేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ టి హబ్ గురించి ప్రత్యేకంగా వివరించారు.

నేడు భారతదేశంలో అన్ని రంగాల్లో పెట్టుబడులకి కేవలం తెలంగాణ ఒక్కటే అనువైన రాష్ట్రమని, కాబట్టి తెలంగాణకి పెట్టుబడులతో వచ్చి కలిసి ఇద్దరం ఎదుగుదామని పిలుపున్నిచ్చారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు తెలంగాణ ఎన్నారై ఫోరం సంస్థను అభినందించారు.

తెలంగాణ టూరిజం సెక్రటరీ బుర్ర వెంకటేశంచక్కని ప్రజెంటేషన్‌తో పర్యాటకంగా తెలంగాణ రాష్ట్ర విశిష్టతను వివరించారు. రాష్ట్రంలో చూడవలసిన ప్రదేశాలని, చారిత్రాక కట్టడాల గురించి, హైదరాబాద్ బిర్యానీతో సహా రాష్ట్రంలో ప్రత్యేకంగా లభించే ఆహార పదార్థాల గురించి వివరించారు.

బిఎస్ఐసిసి మీట్

బిఎస్ఐసిసి మీట్

బ్రిటీష్ సౌత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కామర్స్(బిఎస్ఐసిసి), తెలంగాణా ఎన్నారై ఫోరం (టిఈఎన్ఎఫ్-యూకే శాఖ సంయుక్తంగా లండన్‌లోని బ్రిటీష్ పార్లమెంట్‌లో బ్రిటిష్ సౌత్ ఇండియన్ బిజినెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

బిఎస్ఐసిసి మీట్

బిఎస్ఐసిసి మీట్

ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల ప్రతినితులు, స్థానిక బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

బిఎస్ఐసిసి మీట్

బిఎస్ఐసిసి మీట్

తెలంగాణ రాష్ట్రం నుంచి భువనగిరి ఎంపి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, తెలంగాణ టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎండి డాక్టర్ క్రిస్టీనా, తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్, వ్యవస్థాపక సబ్యుడు, ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నగరాజు పాల్గొన్నారు.

బిఎస్ఐసిసి మీట్

బిఎస్ఐసిసి మీట్

బ్రిటన్ ఎంపి, బిఎస్ఐసిసి పాట్రన్ వీరేంద్ర శర్మ ముందుగా స్వాగతోపన్యాసం చేశారు. భారత- యూకే దేశాల మధ్య ఉన్న మంచి వ్యాపార అనుకూల విధానాల గురించి వివరించారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని హాజరైన అన్ని రాష్ట్రాల ప్రతినిధులను కోరారు.

బిఎస్ఐసిసి మీట్

బిఎస్ఐసిసి మీట్

ముఖ్యంగా తెలంగాణ ప్రతినిధులను ప్రశంశిస్తూ.. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు తీసుకెళ్తున్న తీరును అభినందించారు.

బిఎస్ఐసిసి మీట్

బిఎస్ఐసిసి మీట్

భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విశిష్టత, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, గణాంకాలతో సహా వివరించారు.

బిఎస్ఐసిసి మీట్

బిఎస్ఐసిసి మీట్

ఐటి, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్, నీళ్ళు, ప్రతి రంగంలో గత సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్ననిర్ణయాల గురించి వెల్లడించారు.

హైదరాబాద్‌లో ప్రాముఖ్యమైన ముత్యాలు, బట్టలు, రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక సంస్కృతి, వివిధ రకాల పండగలు వాటి విశిష్టతను వివరించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన రాష్ట్రమని ఆయన ఆహ్వానించారు.

ఈ కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ ఎన్నారై ఫోరం తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు గొప్పదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. యూకే- యూరోప్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ అంబాసిడార్‌గా తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఉంటుందని తెలిపారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ... బిఎస్ఐసిసి యాజమాన్యానికి, ఎంపి నర్సయ్య గౌడ్, బుర్ర వెంకటేశంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఐసిసి కో-ఆర్డినేటర్ సుజిత్ నాయర్, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడ్‌రేషన్ ప్రతినిధి
విజయ్ చౌదరి, స్టీరింగ్ కమిటీ సబ్యుడు గణేశ్, ఉపాధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, సభ్యులు రత్నాకర్, నవీన్ రెడ్డి పాల్గొన్నారు.

English summary
BSICC in association with Telangana Nri Forum(TeNF) organised "British South Indian Business Meet" at UK - Parliament, London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X