వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్ పగులగొట్టాడని భర్తను కూడా వదలని భార్య.. ఏం చేసిందో తెలుసా ..?

|
Google Oneindia TeluguNews

పుజైరహా : భార్య భర్తలు అన్నాక గొడవలు సహజం. అలానే ఓ భర్త తన చేతిలో ఉన్న వస్తువు విసిరేశాడు. అంతే ఆ భార్య సర్దుకుపోవాలి. బతిమాలితే ఊరుకోవాలి. కానీ ఆమె తన భర్తనే కోర్టుకు ఈడ్చింది. విలువైన వస్తువును ధ్వంసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఆలుమగల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఈ ఘటన ఫుజైరహాలో జరిగింది.

చిన్నగా మొదలై ..
ఫుజైరహాలో భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే వారి మధ్య కుటుంబసభ్యుల విషయమై గొడవ జరిగింది. చిన్నగా మొదలైన తగాదా చినికి చినికి గాలివానలా మారింది. దీంతో కోపం ఆపుకోలేని భర్త తన భార్య ఫోన్‌ను నెలకోసి కొట్టాడు. దీంతో ఆ ఫోన్ ధ్వంసమైంది. తన ఫోన్ ధ్వంసం చేశాడని భర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. దీంతో ఆ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.

wife complaint her husband about mobile destroy issue

భర్త అరెస్ట్ ..
విచారణ సందర్భంగా పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు. చిన్న విషయానికే తనను పోలీసులు అరెస్ట్ చేయడంతో భర్త మదనపడ్డాడు. కోర్టుకు జరిగిన విషయాన్ని వివరించాడు. ఫోన్ పగులగొట్టింది తానేనని అంగీకరించాడు. అయితే పండుగ సందర్భంగా భార్యకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చానని తెలిపాడు. అదీ కూడా నగదు కాకుండా ఈఎంఐ పద్దతిని కొనుగోలు చేశానని .. ఇంకా వాయిదా కడుతున్నానని వివరించారు. తాను కేవలం మొబైల్ మాత్రమే పగులగొట్టానని .. తన భార్యపై చేయిచేసుకోలేదన్నారు. హింసించలేదని కోర్టుకు విన్నవించారు. చిన్న విషయానికే తనను కోర్టుకులాగడం బాధ కలిగించిందన్నారు. ఈ కేసులో భార్య, భర్త వాదనలు విన్న కోర్టు .. విచారణనను వచ్చే వారానికి వాయిదా వేసింది.

English summary
In Fujairah the wife husbands are mutually exclusive. However, there was an uproar among their family members. The quarrel that started small became a raging wind. An angry husband hit his wife's phone. The phone was destroyed. His wife complained to the police on the fear that her phone had been destroyed. The police also registered a case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X