• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) డల్లాస్ నగరంలోని, ఫుడిస్తాన్ రెస్టారెంట్‌లో మార్చి 13 వ తేదీ ఆదివారం రోజున మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది.

ఘనంగా మహిళా దినోత్సవం

ఘనంగా మహిళా దినోత్సవం

అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి ఆధ్వర్యంలో వనితా వేదిక నాయకులు కళ్యాణి తాడిమేటి, కార్యనిర్వాహక బృంద సభ్యులు, లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, శరత్ రెడ్డి ఎర్రం , సురేష్ పఠనేని , నీరజ కుప్పచ్చి, స్రవంతి యర్రమనేని, మాధవి లోకిరెడ్డి, శ్రీనివాసులు బసాబత్తిన , రఘునాథ రెడ్డి కుమ్మెత , శ్రీనివాస పాతపాటి , సరిత ఈదర, తదితరులు, పాలక మండల బృందం అధిపతి, వెంకట్ ములుకుట్ల, ఉపాధిపతి, అనంత్ మల్లవరపు, సభ్యులు గీతా దమ్మన తదితరుల సహకారంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోవిడ్ అనంతరం జరిగిన మొదటి మహిళా కార్యక్రమము కావడంతో 200మందికిపైగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు


ఆడవారి గొప్పతనాన్ని ఉద్దేశించిన పాటలు గాయకులు ఫ్రభాకర్ కోట, ఆకాష్ కోటా చక్కగా పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో, తెలుగు పాఠ్యపుస్తకాలు రచించి తెలుగు భాషకి ఎన్నో సేవలు అందించిన రచయిత బలభద్రపాత్రుని రమణి, 2020 సంవత్సరంలో మహమ్మారి సమయంలో టాంటెక్స్ ద్వారా సమాజానికి చేసిన సేవలకుగాను వైద్యులైన డా.పారో ఖౌష్, డా. సుజాత క్రిష్నన్, డా.సుప్రియ వంటి మహిళా నాయకులను సత్కరించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన కాలిన్ కౌంటీ కమీషనర్ సుసాన్ ఫ్లెచర్, సోషియాలజీ ప్రొఫెసర్ నందిని వెలగపూడి, ప్రతినిధి సభ అభ్యర్థి, క్రోండా ఠిమెస్చ్, NATA అధ్యక్షుడు డా. శ్రీధర్ కోర్సపాటి, డా.ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు మహిళలను ఉద్దేశించి ప్రసంగించి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపా రు.

సరదాగా సాగిన కార్యక్రమం

సరదాగా సాగిన కార్యక్రమం

కార్యక్రమం ఆసాంతం సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, ఫ్యాషన్ షో, చలాకీ ప్రశ్నలతో, ఆట పాటలతో సరదాగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు చక్కటి బహుమతులు రాఫెల్ టికెట్ ద్వారా ఇవ్వడం జరిగింది.

ఏప్రిల్ 16న ఉగాది వేడుకలు

ఏప్రిల్ 16న ఉగాది వేడుకలు

మహిళా దినోత్సవ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ఫుడి స్తాన్‌కు, అన్ని టాంటెక్స్ ఈవెంట్‌లకు మద్దతు ఇచ్చినందుకు స్పాన్సర్‌లందరికీ అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్ 16న జరగబోయే ఉగాది వేడుకల గురించి ప్రేక్షకులకు తెలియజేశారు.

టాంటెక్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

టాంటెక్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు


చాలాకాలం తర్వాత ముఖాముఖీ ఈవెంట్ కావడంతో ఆహుతులు అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ కలియ తిరుగుతూ కనిపించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా, డల్లాస్‌లోని స్థానిక మహిళా ఆశ్రయం అయిన జెనెసిస్ మహిళల ఆశ్రయం కొరకు దుస్తుల డ్రైవ్ నిర్వహించి, దుస్తులను అందించారు.

English summary
Women's day celebrations held by TANTEX in Dallas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X