విశాఖలో గూగుల్ డేటా సెంటర్... మంత్రి లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్..!!
విశాఖకు మరో మణిహారం రాబోతోంది.సాగరతీరంలో ప్రతిష్టాత్మక సెర్చ్ ఇంజిన్ దిగ్గజ సంస్థ గూగుల్ తన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్‌తో పాటు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్లో పాల్గొన్నారు.
విశాఖపట్నంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజ సంస్థ గూగుల్ తన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
ఈ మేరకు ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్‌తో పాటు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్లు హాజరయ్యారు
రూ.87520 కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న గూగుల్.
వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని గూగుల్ నిర్ణయించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ను విశాఖకు తీసుకురావటంలో ప్రధాన పాత్ర పోషించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు.
వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.
డేటా సెంటర్లు దేశానికి కొత్త రిఫైనరీల లాంటివని ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ అన్నారు.కేంద్ర సహకారంతోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ సాకారం అయ్యిందని తెలిపారు.రియల్ టైమ్ గవర్నెన్సులాంటి వ్యవస్థలతో ప్రజలకు మెరుగైన సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని ఈ సదర్భంగా మంత్రి గుర్తుచేశారు.గూగుల్ లాంటి సంస్థలు దీనికి మరింత సహకారం అందించాలని కోరుతున్నట్లు ఆయన విజ్ఞప్తి చేశారు.
గూగుల్ సంస్థతో ఒప్పందం సందర్భంగా వేదికపై సెల్ఫీ దిగారు కేంద్రమంత్రులు అశ్వనీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు మంత్రి నారాలోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ఏపీ నుంచి కేంద్రమంత్రులు, పలువురు ఎంపీలు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications