Home / Photos
ఈ రోజు ఈ రాశుల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఈ రోజు మీ రాశి ఫలాలు: 2 మార్చి శనివారం 2024
1/12
Photo Credit: Horoscope Today
Share
సింహరాశి వారికి ఈ రోజు వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ముఖ్యమైన పనులలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి
2/12
Share
మేషరాశి వారికి ఈ రోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి
3/12
Share
వృషభరాశి వారికి ఈ రోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఇంటా బయట కొందరి ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి
4/12
Share
మిధునరాశి వారికి ఈ రోజు బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీ సంబంధ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు కలగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
5/12
Share
కర్కాటకరాశి వారికి ఈ రోజు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి
6/12
Share
కన్యారాశి వారికి ఈ రోజు దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి
7/12
Share
తులారాశి వారికి ఈ రోజు వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి
8/12
Share
వృశ్చికరాశి వారికి ఈ రోజు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గోచార రిత్య అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి
9/12
Share
ధనుస్సురాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది


Click it and Unblock the Notifications