Home / Photos
IND vs WI: కరేబియన్ పై టీమిండియా అలవోక విజయం..!!
By Kannaiah
వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 121 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 63/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 35.2 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్(108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు.
1/10
Photo Credit: PTI
Share
వెస్టిండీస్‌తో రెండవ టెస్టు మ్యాచ్ గెలిచిన అనంతరం కెప్టెన్ గిల్‌తో కేఎల్ రాహుల్ సంబరాలు
2/10
Photo Credit: PTI
Share
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత... మధ్యలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కుడివైపున కేఎల్ రాహుల్, ఎడమవైపున యశస్వి జైస్వాల్ ముగ్గురూ కలిసి సంబరాలు చేసుకుంటున్నారు
3/10
Photo Credit: PTI
Share
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టెస్ట్ సిరీస్ గెలిచాక, టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్.. వెస్టిండీస్ ప్లేయర్ జొమెల్ వారికన్తో కరచాలనం (చేతులు కలుపుతూ) చేస్తున్నాడు
4/10
Photo Credit: PTI
Share
అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత, టీమిండియా ఆటగాళ్లంతా కలిసి ట్రోఫీతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు
5/10
Photo Credit: PTI
Share
అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత, ప్లేయర్స్ అందరూ కలిసి ట్రోఫీని గాల్లోకి ఎత్తి తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
6/10
Photo Credit: PTI
Share
ఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్యాచ్‌ను వెస్టిండీస్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ అందుకున్నాడు
7/10
Photo Credit: PTI
Share
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు.. శుభ్‌మన్ గిల్ మరియు కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు.
8/10
Photo Credit: PTI
Share
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ షాట్ ఆడుతున్న దృశ్యం.
9/10
Photo Credit: PTI
Share
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను క్యాచ్ ద్వారా అవుట్ చేసిన తర్వాత.. వెస్టిండీస్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ తన టీమ్మేట్స్తో కలిసి సంబరాలు చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications