Home / Photos
నేడు ఈ రాశుల వారికి అరుదైన అవకాశములు.. అదృష్ణం మాములుగా లేదు.
ఈ రోజు మీ రాశి ఫలాలు 24 సెప్టెంబర్ మంగళవారం 2024, ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.
1/12
Share
వృషభరాశి వారికి ఈ రోజు వివాదాలకు సంబందించి విలువైన విషయాలు సేకరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు కొంత పురోగమిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.
2/12
Share
మిధునరాశి వారికి ఈ రోజు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమున కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపార ప్రారంభమునకు అవాంతరాలు తప్పవు. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి.
3/12
Share
కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రణాళికలు రూపొందించుకుని క్రమపద్ధతిలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.
4/12
Share
సింహరాశి వారికి ఈ రోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశిష్ఠ గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి.
5/12
Share
కన్యారాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. నూతన వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.
6/12
Share
తులారాశి వారికి ఈ రోజు బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.
7/12
Share
ధనుస్సురాశి వారికి ఈ రోజు నిరుద్యోగులకు అరుదైన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన యోగమున్నది.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది.
8/12
Share
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్య వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
9/12
Share
మకరరాశి వారికి ఈ రోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు సర్దుమణుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.



Click it and Unblock the Notifications