Home / Photos
భారత్ వీడుతున్న పాక్ పౌరులు.. అటారీ-వాఘా సరిహద్దు వద్ద బంధువుల కన్నీటి వీడ్కోలు..
అమృత్సర్ సమీపంలోని అటారీ-వాఘా సరిహద్దులోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం, ఏప్రిల్ 25, 2025న ఓ విషాదకర దృశ్యం ఆవిష్కృతమైంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి నేపథ్యంలో, భద్రతను కట్టుదిట్టం చేసిన భారత ప్రభుత్వం, ఇండియాలో ఉన్న పాకిస్తానీ పౌరులందరూ 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అంతేకాకుండా, అటారీ సరిహద్దును తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని రకాల రాకపోకల కోసం మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
1/14
Photo Credit: PTI
Share
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి నేపథ్యంలో, భద్రతను కట్టుదిట్టం చేసిన భారత ప్రభుత్వం, ఇండియాలో ఉన్న పాకిస్తానీ పౌరులందరూ 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అంతేకాకుండా, అటారీ సరిహద్దును తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని రకాల రాకపోకల కోసం మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
2/14
Photo Credit: PTI
Share
జకియా ఫిర్దౌస్ అనే భారతీయ మహిళ తన పాకిస్తానీ భర్త సాహిబ్జాదా మునాది అహ్మద్‌ను సరిహద్దు వద్ద కన్నీటితో సాగనంపుతున్న దృశ్యం అక్కడి వాతావరణానికి అద్దం పట్టింది. భార్యాభర్తలు ఒకరికొకరు దూరమవుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
3/14
Photo Credit: PTI
Share
అదేవిధంగా, పాకిస్తానీ బంధువులను సాగనంపడానికి వచ్చిన భారతీయ పౌరులు కన్నీటితో వీడ్కోలు పలికారు. బంధువులు ఒకరినొకరు హత్తుకొని రోదిస్తూ కనిపించారు. జెహనాబ్ అనే పాకిస్తానీ యువతి తన బంధువును గట్టిగా హత్తుకొని విడిపోవడం అందరినీ కదిలించింది.
4/14
Photo Credit: PTI
Share
పరిస్థితి కేవలం వెనక్కి వెళ్తున్న పాకిస్తానీలకు మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్తాన్ వీసా ఉన్నప్పటికీ, సరిహద్దు మూసివేత కారణంగా తమ దేశం నుంచి పాకిస్తాన్‌కు వెళ్లడానికి వచ్చిన భారతీయ మహిళలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వెళ్లేందుకు అనుమతి లభించకపోవడంతో వారు అక్కడే భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.
5/14
Photo Credit: PTI
Share
పాకిస్తాన్ వీసా ఉన్నప్పటికీ, సరిహద్దు మూసివేత కారణంగా తమ దేశం నుంచి పాకిస్తాన్‌కు వెళ్లడానికి వచ్చిన భారతీయ మహిళలు తీవ్ర నిరాశకు లోనయ్యారు
6/14
Photo Credit: PTI
Share
అటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు వందలాది మంది పాకిస్తానీ పౌరులు చేరుకున్నారు. వారిని సాగనంపడానికి వచ్చిన భారతీయ బంధువులు, మిత్రులతో సరిహద్దు ప్రాంతం నిండిపోయింది.
7/14
Photo Credit: PTI
Share
తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు వందలాది మంది పాకిస్తానీ పౌరులు చేరుకున్నారు.
8/14
Photo Credit: PTI
Share
తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు వందలాది మంది పాకిస్తానీ పౌరులు చేరుకున్నారు.
9/14
Photo Credit: PTI
Share
తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు వందలాది మంది పాకిస్తానీ పౌరులు చేరుకున్నారు. వారిని సాగనంపడానికి వచ్చిన భారతీయ బంధువులు, మిత్రులతో సరిహద్దు ప్రాంతం నిండిపోయింది.


Click it and Unblock the Notifications