Home / Photos
అమరావతి నగరం కాదు… శక్తి! ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం
అశేష జన వాహిని మధ్యలో, అతిరథ మహారధులు సమక్షంలో అమరావతి పునః ప్రారంభం అయింది. కనుల పండుగగా జరిగిన ప్రజా రాజధాని పనుల పునః ప్రారంభ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య-ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర - రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
1/16
Share
అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోదీ, “అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి” అని వ్యాఖ్యానిస్తూ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. ఈ పుణ్యభూమి అభివృద్ధి చెందటం స్వర్ణాంధ్రకు శుభ సంకేతమని పేర్కొన్నారు.
2/16
Share
చంద్రబాబు వంటి స్పష్టత గల నాయకుడు దేశంలో మరోకరు లేరు’’ అని ప్రధాని కొనియాడారు. ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు చేసిన కృషిని గుర్తు చేశారు.
3/16
Share
కళ్యాణ్‌ను ఉద్దేశించి ‘‘ఇది మనమే చేయాలి, మనల్ని ఎవ్వరూ ఆపలేరు’’ అంటూ అభివృద్ధి పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.
4/16
Share
రూ.60 వేల కోట్ల విలువైన రోడ్లు, రైల్వేలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశామన్నారు. అమరావతిని ఐటీ, విద్య, వైద్య, పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
5/16
Share
రైల్వే కనెక్టివిటీ, బ్రిడ్జిలు, వందేభారత్ రైళ్లు, స్టేషన్ల అభివృద్ధి ద్వారా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని వివరించారు.
6/16
Share
విశాఖపట్నంలో జరగబోయే అంతర్జాతీయ యోగా డేలో పాల్గొంటానని చెప్పారు. మూడు సంవత్సరాల్లో అమరావతిని పూర్తిచేస్తామని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ తర్వాత రాష్ట్ర జీడీపీ కొత్త శిఖరాలను తాకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
7/16
Share
ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని కేవలం రాజధాని కాదు, ఐదు కోట్ల ప్రజల ఆశలకూ, ఆత్మవిశ్వాసానికీ ప్రతీకగా పేర్కొన్నారు.
8/16
Share
‘‘అమరావతి ప్రజల కలల నగరం. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు పూళ్లాగా సమర్పించారంటే ఇది ప్రపంచ చరిత్రలోనే అద్భుతం’’ అన్నారు. గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణం ఎలా మూలుగిందో అందరూ చూశామన్నారు.
9/16
Share
ప్రధాని మోదీ పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరై, శంకుస్థాపన చేయడాన్ని సీఎం చారిత్రకంగా అభివర్ణించారు. ‘‘మోదీ నేతృత్వం విశ్వవ్యాప్తంగా గౌరవాన్ని పొందుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను పదో స్థానంలో నుంచి ఐదో స్థానం వరకూ తీసుకువచ్చారు. కులగణనపై తీసుకున్న నిర్ణయం గొప్పదిగా అభినందించదగినది’’ అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications