Home / Photos
Vaibhav : ఐపీఎల్లో మరో విధ్వంసకర ఇన్నింగ్స్.. గుజరాత్ టైటాన్స్‌కు చుక్కలు చూపించి వైభవ్ సూర్యవంశీ!
వరుసగా ఐదు ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. స్వంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో మూడో గెలుపును నమోదు చేసింది. ఈ విజయంలో ప్రధాన పాత్రధారి ఎవరో తెలుసా? కేవలం 35 బంతుల్లోనే సునామీ ఇన్నింగ్స్ ఆడిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ! అతని మెరుపు సెంచరీతో రాజస్థాన్ భారీ లక్ష్యాన్ని సైతం చిత్తు చేసింది.
1/10
Photo Credit: PTI
Share
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించి రాజస్థాన్‌కు గట్టి సవాల్ విసిరింది.
2/10
Photo Credit: PTI
Share
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆరంభం నుంచే ఎదురులేకుండా పోయింది.
3/10
Photo Credit: PTI
Share
ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ గుజరాత్ బౌలర్లపై కనీసం కనికరం చూపలేదు. ముఖ్యంగా యువ వైభవ్ అయితే బౌలర్లకు చుక్కలు చూపించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీలు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.
4/10
Photo Credit: PTI
Share
సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే సిక్సర్‌తో ఖాతా తెరిచిన వైభవ్.. ఆ తర్వాత ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఏకంగా 26 పరుగులు (6,6,4,0,6,4) పిండుకున్నాడు. కరీం జనత్ వేసిన 10వ ఓవర్లో ఏకంగా ఆరు బంతుల్లో 30 పరుగులు (6,4,6,4,4,6) బాది ఊచకోత కోశాడు.
5/10
Photo Credit: PTI
Share
వైభవ్ జోరుకు బంతి ఎక్కడ పడుతుందో కూడా బౌలర్లకు అర్థం కాలేదు. కేవలం 17 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న అతను... అదే జోరు కొనసాగించి కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు.
6/10
Photo Credit: PTI
Share
ఐపీఎల్ చరిత్రలో భారత ఆటగాడిగా ఇది అత్యంత వేగవంతమైన శతకం కాగా, ఓవరాల్‌గా రెండో వేగవంతమైన సెంచరీగా నిలిచింది.
7/10
Photo Credit: PTI
Share
మరోవైపు యశస్వి జైస్వాల్ (70*: 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా 31 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని వైభవ్‌కు అండగా నిలిచాడు.
8/10
Photo Credit: PTI
Share
వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 166 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి రాజస్థాన్ విజయాన్ని దాదాపు ఖాయం చేశారు.
9/10
Photo Credit: PTI
Share
101 పరుగుల వద్ద వైభవ్ అవుటైనా (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు)... అప్పటికే రాజస్థాన్ విజయం అంచుల అంచులకు చేరుకుంది. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రాణా తక్కువ పరుగులకే అవుటైనా.. క్రీజులో పాతుకుపోయిన యశస్వి జైస్వాల్ రియాన్ పరాగ్‌తో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టును 15.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications