• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అయోధ్య రామాలయం-ఆర్టికల్ 370 రద్దు : సుదీర్ఘ సమస్యలకు పరిష్కారం : ఛాయ్ వాలా నేడు ప్రధానిగా.!!

By Chaitanya
|

భారత్ కు అత్యంత బలమైన..సమర్ధవంతమైన ప్రధాని అనగానే ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో చెప్పే పేరు నరేంద్ర మోదీ. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా మంచి ఫాలోయింగ్ ప్రధానిగా మెదీ చరిత్ర క్రియేట్ చేసారు. మోదీ ఈ రోజు తన జన్మదినం జరుపుకుంటున్నారు. దేశంలో దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించిన ప్రధానిగా మోదీ ఖ్యాతి గడించారు. 17 ఏళ్ల వయసులోనే సన్యాసం తీసుకోవాలని భావించినా నిబంధనలు అంగీకరించకపోవటంతో...తిరిగి స్వగ్రామం చేరుకున్న ఆయన ఆర్ఎస్ఎస్ లో చేరారు.

సన్యాసం తీసుకోవాలని భావించినా..

సన్యాసం తీసుకోవాలని భావించినా..

అహ్మదాబాద్ లో తన మేనమామ నడుపుతున్న క్యాంటీన్ లో పని చేస్తూ ఆరెస్సెస్ లో పని చేసారు. 1975లో ఎమెర్జెన్సీ సమయంలో దేశంలోని ఆనాటి కీలకమైన జాతీయ నాయకులను సంఘ్ ప్రతినిధిగా కలవడంతో పాటుగా నాయకులకు రహస్యంగా దాచి పెట్టిన కార్యక్రమంలో కీలకమైన పాత్ర పోషించారు. ఎమెర్జెన్సీ సమయంలోనే గుజరాత్ రాష్ట్ర సంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీ భాద్యుడిగా భాద్యతలు చేపట్టి విద్యార్థులను విజయవంతంగా నడిపించారు. గుజరాత్ రాష్ట్ర సంఘ్ సహా ప్రముఖ్ గా భాద్యతలు చేపట్టి 1986 వరకు ఆ బాధ్యతల్లో కోనసాగారు.

బీజేపీలో ప్రవేశించి..అంచెలంచెలుగా ఎదిగి

బీజేపీలో ప్రవేశించి..అంచెలంచెలుగా ఎదిగి

1986లో బీజేపీలో ప్రవేశించారు. అహ్మదాబాద్ పురపాలక సంఘం ఎన్నికల భాద్యతలు తీసుకొని పురపాలక ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించి బీజేపీ అగ్రనాయకత్వం దృష్టిలో పడ్డాడు, అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీ ప్రోత్సాహం కూడా తోడై కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ భాద్యుడిగా, 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్‌చార్జీగా పనిచేశారు.

గుజరాత్ బాధ్యతలతో జాతీయ నేతలకు దగ్గరగా

గుజరాత్ బాధ్యతలతో జాతీయ నేతలకు దగ్గరగా

1993లో బీజేపీ ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టార. 1995 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించారు. 2000వ సమయంలో గుజరాత్‌లోని కుచ్ ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబరులో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది.

గుజరాత్ లో మోదీ మార్క్ పాలన

గుజరాత్ లో మోదీ మార్క్ పాలన

అప్పటి నుంచి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు 2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలలో విజయం చేకూర్చి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. 2007 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి.

గుజరాత్ పాలనా సమర్ధతే కొలమానంగా

గుజరాత్ పాలనా సమర్ధతే కొలమానంగా

వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకుగాను 117 స్థానాలు పొందటం విశేషం. ఆయన స్వయంగా మణినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్ పై 87,161 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. 2012 ఎన్నికలు: 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదుచేసింది. నరేంద్రమోదీ స్వయంగా మణినగర్ నుంచి 86వేలకు పైగా ఓట్ల మెజారిటితో గెలిచారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది.

ప్రధానమంత్రి అభ్యర్థిగా..వేగంగా మార్పులు

ప్రధానమంత్రి అభ్యర్థిగా..వేగంగా మార్పులు

2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల వనాలు బలంగా వీచాయి. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మోదీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. మోదీ స్వయంగా వడోడర నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు.

ప్రధాని అయ్యాక మరింత పెరిగిన ప్రజాదరణ

ప్రధాని అయ్యాక మరింత పెరిగిన ప్రజాదరణ

సబక్ సాత్..సబ్ కా వికాస్ పేరుతో పాలన సాగించారు. పాక్ ఆక్రమిత కార్మిర్ లో ఉగ్రవాద శిబిరాల పైన సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రజల్లో నమ్మకం పెంచారు. అమెరికాలో మోదీ పర్యటనకు ప్రవాస భారతీయులు ఇచ్చిన అపూర్వ స్వాగతం చరిత్రలో నిలిచిపోతుంది. ఇక, రెండో సారి ఎన్నికల్లో 2019 లో తొలి సారి కంటే ఎక్కువ లోక్ సభ సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చారు. ఆ వెంటనే అప్పటి వరకు దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపారు. సుప్రీం కోర్టు అయోధ్య వివాదం పైన తీర్పు ఇవ్వటంతో అక్కడ రామ మందిరానికి మోదీ శంకుస్థాపన చేసారు.

సుదీర్ఘ సమస్యల పరిష్కార ప్రధానిగా..

సుదీర్ఘ సమస్యల పరిష్కార ప్రధానిగా..

ఆ మరుసటి ఏడాది చిరకాలంగా వివాదంగా ఉన్న జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేసారు. ఇక, కరోనా వేళ సమర్ధవంతంగా వ్యవహరించి..స్వదేశీ టీకాలను అందుబాటులోకి తేవటంతో పాటుగా పొరుగు దేశాలకు సాయం అందించారు. కేంద్ర రాజకీయాల్లో సాటి లేని నేతగా నిలిచారు. ఇప్పిటికీ.. జాతీయ రాజకీయాల్లో మోదీకి పోటీ ఎవరు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. పలు సందర్భాల్లో మోదీ తాను ఛాయ్ వాలా అని చెప్పుకొన్నారు. రాజకీయంగా వ్యూహాలు అమలు చేయటంలో.. నిర్ణయాలు తీసుకోవటం లో మోదీకి సాటి లేరు. దీంతో..దేశ వ్యాప్తంగా మోదీ మేనియా ఏడేళ్ల పాలన పూర్తయినా ఇంకా కంటిన్యూ అవుతునే ఉంది.

English summary
September 17th is PM Modis Birthday. AS PM, Modi had implemented many historical decisions from abrogation of Article 370 to Ayodhyas Ram temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X