పుస్తకాలకు సినారె ఆర్థిక సహాయం
వర్ధమాన తెలుగు రచయిత్రులకు ప్రముఖ కవి, రాజ్యసభ సభ్యుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందుకుగాను ఆయన తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి పేర ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఇరవై సంవత్సరాల క్రితం సినారె సతీమణి మరణించారు. ఆయన యేటేటా ఆమె పేర ఒక తెలుగు రచయిత్రిని ఎంపిక చేసి సన్మానిస్తున్నారు.
ప్రస్తుత ట్రస్టు ద్వారా నలుగురు వర్ధమాన రచయిత్రుల రచనల అచ్చుకు ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్రతి సంవత్సరం రెండు కవితా సంపుటులకు, రెండు కథా సంపుటులకు ఈ సహాయం అందజేస్తారు. ముగ్గురు అగ్రశ్రేణి రచయిత్రులు ఈ రచనలను ఎంపిక చేస్తారు. పుస్తక రూపంలో రాని రచనలకు మాత్రమే ఈ సహాయం అందిస్తారు. మొదటగా ఈ నెల 29వ తేదీన సి. నారాయణ రెడ్డి జన్మదినం నాడు ఈ సహాయం అందిస్తారు.
సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టుకు గోవిందరాజు రామకృష్ణారావు అధ్యక్షులుగా, సినారె కూతురు సి. గంగ మేనేజింగ్ ట్రస్టీగా వుంటారు. మిగతా నలుగురు కూతుర్లు ట్రస్టు సభ్యులుగా వుంటారు. ట్రస్టు కోంస పది లక్షల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై యేటా వచ్చే లక్ష రూపాయల వడ్డీ నుండి 60 వేల రూపాయలను నలుగురు వర్ధమాన రచయిత్రులకు ఆర్థిక సహాయం అందజేస్తారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!