వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జానపద గేయాలు- పరిణామం

By Staff
|
Google Oneindia TeluguNews

సృష్టిలో ఏ ఒక్కటి- ఒక్క సారిగా నేడు మనం చూస్తున్న ధంగా ఊడి పడలేదు. క్రమ క్రమంగా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయి. పరిణామం గడియారంలో సెకండ్ల ముల్లు లాగా జరుగుతున్నట్లు చకచకా కనిపించే మార్పు కాదు. అతి మెల్లగా కాల క్రమేణా జరిగే గంటల ముల్లులాగా కనిపించకుండానే పురోగమనం వైపు జరిగి పోయేది.

ఇప్పుడున్న మానవుడి వెనక్కి దృష్టి సారిస్తే జీవకోటి పరిణామమంతా కనిపిస్తుంది. ఇప్పటి మానవ జీత ధానాన్ని తవ్వుకుంటూ పోతే, గత జీత అవశేషాలన్నీ బయట పడతాయి. ఇప్పటి సాహిత్యాన్ని వెనక్కి చదితే ప్రాథుక సాహిత్యం లేక ప్రాచీన సాహిత్యం తెలుస్తుంది.

జానపద సాహిత్యాన్నే ప్రాచీన సాహిత్యం అన్నారు కొందరు. 'అది శిరోధార్యం, వెదికి వెదికి వెలికి తీయండి' అంటున్నారు మరి కొందరు. ఇది తప్పు, వెలికి తీసిందంతా శిరోధార్యం కాదు. కాని వెలికి తీయడం వల్ల ఒక్క ప్రయోజనం వుంది. పరిణామ గతి ఏ ధంగా జరిగింది అనేది తెలుసుకోవచ్చు. అప్పటి జీత ధానం, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, సాంఘిక నీతి మొదలైన తెలుసుకోవచ్చు. వారు యేయే పరిసరాల్లో తిరిగారు? యేయే పరికరాలు వాడారు? తెలుసుకోవచ్చు. ఒక్కో చోట వారు ఎందుకు ఎదగ లేకపొయ్యారు? ఏ పరిసరాల ప్రభావం వల్ల, ఏ వాతావరణ ప్రభావం వల్ల, వారి ఊహలు, జ్ఞానం పరిుతమై పొయ్యాయి? మతాల్ని నమ్మకాల్ని ఎందుకు జీర్జించుకోవల్సి వచ్చింది? మొదలైన షయాలు తెలుసుకోవచ్చు. ఒక్కో జానపదుల భావాలు కావ్యాల్లోని మహాకవుల భావాలతో సరితూగ గలిగేగా వున్నాయి. ఇంకా వస్తే ఇప్పటి ఆధునిక సాహిత్యంలోని భావాలతో కూడా సరిపడేట్లుగా ఉన్నాయి. అయితే ఎక్కడ అనేది ప్రశ్న? ఏ కొందరో కొన్ని చోట్ల పోలికలు చూపారు కాని అది చాలదు.

రికార్డు చేస్తే చాలదు కొత్త వరాలు పిండాలి ఏ జానపద గీతం లేక ఏ జానపద కథ ఆ స్థాయికి చేరుకుంది? అనేది పరిశోధనల వల్ల తేలాల్సిన నిజం. ఈ కోణం లోంచి జానపద సాహిత్యంలో స్తృతంగా పరిశోధన జరగాల్సి వుంది. భాష చెందిన మార్పులు గమనించడానికి భాషా శాస్త్రవేత్తలు రిగా పూనుకోవచ్చు. చరిత్రకారులకు, మనస్తత్వ శాస్త్రవేత్తలకు కూడా కొంత సరుకు దొరక్క పోదు. జానపద సాహిత్యాన్ని పోగు చేయడం, అందులోని మెరుపుల్ని రేఖా మాత్రంగా చూపించడం అంతే. ఇప్పటి పరిశోధన ఎక్కువ భాగం ఇంత వరకే పరిుతమై వుంది. ప్రమాణాల లాగా వుండిపోయిన ఆ గేయాల నుండి, కథల నుండి కొత్త షయాలు పిండుకోవాల్సి వుంది. మనల్ని గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే ఈ కృషి తప్పకుండా చేయాల్సి వుంది.

పరిణామంలో ఎప్పుడో హేునిడ్‌ కుటుంబంలో హోమో సెపియన్స్‌ అనే జాతి ుగిలింద కనుకనే- ఈ రోజు మనం యిలా ఉన్నాం. అది మానవుడి సైగలు... ధ్వనులు... జానపదుడి పాటలూ, లేకపోతే ఏ భాషా సాహిత్యం లేదు. అందువల్ల శిష్ట సాహిత్యం తర్వాత మార్పులు మనకు తెలుసు. ఆపై పైన అనేక రకాలు అంతస్థులు అందంగా కట్టబడ్డాయి. అ గొప్ప గొప్ప భావాలతో మబ్బుల్లోకి కూడా చొచ్చుకు వెళ్లాయి. అయితే కొద్ది కాలం క్రిందటే. ఆ మేడలు ఠపీమని రిగిపోయి కూలిపోయాయి. మళ్లీ పునాదుల ప్రేరణలో వాస్తవంలోంచి, అనుభవంలోంచి శాస్త్రీయ దృక్పథంలో కేవలం కళగా కాకుండా కళా శాస్త్రంగా సృజనాత్మకమైన సాహిత్యం వృద్ధి చెందుతుంది. (మన ఇంటి భాగం శుభ్రంగా వుంటె చాలు, చెత్తా చెదారం రోడ్డు dుద వేస్తే ఏుటి నష్టం? అనే ఉద్దేశంతో వున్న కొందరు రచయిత్రులు, రచయితలు యింకా యిప్పటికీ ఆ మేడల్లోనే టెక్నికలల్ని కంటూ సినీ సందేశాల్ని నవలలుగా సామాన్య జనం నెత్తుల dుద కుమ్మరించి చేతులు దులుపుకుంటున్నారు. అది వేరే షయం)

మార్పు అంతర్వాహిని- నాగరకత

వ్యవసాయం ఎప్పుడు ఎక్కడ ప్రారంభించబడిందో తెలుసుకోవడానికి ఆధారాలు లేవు. మానవుడు వ్యవసాయం చేయడం తెలుసుకున్నప్పటి నుండి భూములు చదును చేయడం దున్నడం నీళ్లు కట్టడం, మోట కొట్టడం, గింజలు చల్లడం, పండించడం, తూర్పార బట్టడం, పశువుల్ని మేపడం, మొదలైన చేస్తున్నాడు. అందువల్ల అతని పాటలు మాటలు వ్యవసాయం గురించి వుండే. వృత్తులు ప్రధానంగా వున్న అదే కాలంలో ఇతర వృత్తుల గురించి కూడా వుండే. రాను రాను పరిశ్రమలు వృద్ధి అవుతున్న కొద్ది స్త్రీపురుషులు కలిసి రాళ్లు కొట్టడం, రోడ్లు వేయడం చేస్తున్నప్పుడు, వాళ్ల పాటలలో ఆ షయాలన్నీ చేరాయి. స్త్రీ- పురుషులకు సంబంధించిన పాటలు కూడా ఆ స్థాయిల ప్రకారం మార్పులు చెందుతూనే వున్నాయి. వాళ్లు కంచె కాడ, మంచె dుద కలుసుకోవడం మానుకొని క్రమం గేటు కాడ, స్టేషన్‌ కాడ, చౌరస్తా కాడ కలుసుకోవటం మొదలు పెట్టారు. ఈ మార్పుకు నాగరికత అంతర్వాహిని లాగా ఉంటూ వస్తోంది.

ఇట్లాగే వదిన- మరుదుల మధ్య సంబంధం అన్నను చంపి వదినెను పెళ్లాడిన సంఘటనలు పురాణాల్లో వున్నాయి. అప్పుడది తప్పు కాదు. అందుకే వదినెను వలలో వేసుకొనే మరుదులు, యేలుకో అని వెంట పడే వదినెలూ వుండే వారు. వాళ్ల పాటలూ వున్నాయి. ఇకపోతే ఇప్పటిలా మరుదులు వదినెల్ని గౌరంచే వారని చెప్పడానికి కూడా గేయాల్లో ఉదాహరణలు దొరుకుతాయి.

కృషి అన్వేషణల ఫలితంగా అభివృద్ధి మనిషి కృషి అన్వేషణ ఫలితంగా ప్రపంచంలో రోజు రోజుకు ఎంతో అభివృద్ధి కనిపిస్తోంది. కొత్త వస్తువులు, కొత్త అభిప్రాయాలు, కొత్త ధానాలు పుట్టుకొస్తున్నాయి. అయితే అవన్నీ ఎప్పటికప్పుడు సాహిత్యంలో చోటు చేసుకొంటున్నాయి.

పల్లెలోని ప్రజలు పాడుకునేవే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోని పెద్ద పెద్ద నగరాల్లోని మూల వాడల్లో, మురికిపేటల్లో అలగా జనం, బిచ్చగాళ్లు, పేదోళ్లు పాడుకుంటున్న కూడా అనేకం వున్నాయి. అ జానపద గేయాల లాగానే సృష్టించబడుతున్నా, నేటి నాగరిక ప్రపంచాన్ని చాలా వరకు జీర్ణించుకుంటున్నాయి. ఎత్తి పొడుస్తున్నాయి. వాళ్లకు జరుగుతున్న అన్యాయాల్ని కళ్లకు కట్టిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X