వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సవరణలు, వివరణలు

By Staff
|
Google Oneindia TeluguNews

(తానా బహుమతులు గెల్చుకున్న కథలపై విప్లవ్‌ రాసిన 'తానా కథలు- మరో కోణం' అనే వ్యాసాన్ని సాహితి విభాగంలో మీ ముందుంచాం. ఈ వ్యాసంపై ప్రతిస్పందిస్తూ 'తానా' ప్రచురణల కమిటీ అధ్యక్షుడు వి. చౌదరి జంపాల కొన్ని సవరణలు, వివరణలు ఇచ్చారు. ఈ సవరణలు, వివరణలను ఇక్కడ ఇస్తున్నాం)

'తానా' పోటీలో బహుమతి పొందిన కథలను శ్రద్ధగా చదివి విశ్లేషించినందుకు విప్లవ్‌ గారికి 'తానా' ప్రచురణల కమిటీ తరఫున కృతజ్ఞతలు. విప్లవ్‌గారి వ్యాసంలో ప్రస్తావించిన కొన్ని విషయాలకు సవరణలు, వివరణలు-

1. ఈ కథల్లో ఉత్తమ కథకు ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవని న్యాయ నిర్ణేతలు తెల్చారన్న విప్లవ్‌ గారి ఆరోపణ నిజం కాదు. బహుమతి పొందిన కథలన్నీ మంచికథలే అని న్యాయనిర్ణేతల నమ్మకం. ఆ విషయం బహుమతులను ప్రకటించిన నివేదికలో స్పష్టంగా తెలియజేశాం. అయితే ఏ ఒక్క కథా ఉత్తమ కథకు ఉండాల్సిన ''అన్ని'' ప్రమాణాలు అందుకోలేదనేదే మా ఆవేదన.

2. పోటీకి వచ్చిన కథల్లో ఉత్తమమైన కథకు న్యాయనిర్ణేతలు బహుమతి ఇచ్చి ఉండాల్సిందన్నారు శ్రీ విప్లవ్‌. నిజానికి న్యాయనిర్ణేతలు ఆ పనే చేశారు. అందువల్లే శ్రీ విప్లవ్‌ బహుమతి పొందిన ఈ ఆరు కథలను చదువగలిగారు.

3. బహుశా, శ్రీ విప్లవ్‌ ఉద్దేశం, అన్నిట్లోకి ఉత్తమమైన కథకు ప్రకటించిన రూ.25 వేల బహుమతి ఇచ్చి ఉండాల్సింది అనేమో. ఆ బహుమతికి అర్హమయ్యే కథ విషయంలో మా కమిటీకి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. పోటీకి వచ్చిన కథలేవీ ఆ ప్రమాణాన్ని చేరుకోలేదన్నది న్యాయ నిర్ణేతల ఏకగ్రీవ నిర్ణయం. ఇట్టి పరిస్థితుల్లో ఆ బహుమతి ఇవ్వబడదు అని నోటీ నిబంధనలలో స్పష్టంగా ఉంది. అయినప్పటికీ, ప్రకటించిన దాని కంటే అధిక మొత్తాన్ని ఈ పోటీలో బహుమతిగా పంచటం జరిగింది. మామూలుగా తెలుగునాట కథలకు ఇచ్చే పారితోషికంతో పోలిస్తే ఈ బహుమతుల మొత్తం తక్కువేమీ కాదు. ఈ బహుమతులతోనూ, ప్రత్యేక ప్రచురనలతోనూ పోటీలో పాల్గొన్న రచయిత(త్రు)లను ప్రోత్సహిస్తున్నామనే మేం భావిస్తున్నాం. దీన్ని రచయితలను అవమానించినట్లుగా శ్రీ విప్లవ్‌ భావిస్తే క్షంతవ్యులం.

4. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు కథకు ఖ్యాతి రావాలన్నది మా కోరిక. పోటీకి వచ్చే కథలు ఆ స్థాయిలో ఉంటే మాకంటే ఆనందించేవారు ఉండరు. ఆ స్థాయిలో ఉన్న కథ(ల)ను మాత్రమే ఇంతకు ముందు ఎప్పుడూ సత్కరించని స్థాయిలో సత్కరించాలని మా పోటీ ఉద్దేశం. ఆ ప్రమాణాలను సడలించే ఉద్దేశం మా కమిటీకి లేదు.

5. ఈ పోటీకి స్పందించిన రచయితలకు మరొక్కసారి మా కృతజ్ఞతలు చివరగా ఒక మాట- అఖరు దశకు వచ్చిన 12 కథలనూ, తానా న్యాయనిర్ణేతలు ప్రతి పదాన్ని, అక్షరాన్ని కనీసం రెండు సార్లయినా చదివి ఉంటారని విప్లవ్‌ గారికి నా హామీ. అంత దీక్షగా శ్రమించే న్యాయనిర్ణేతలు దొరకటం మా అదృష్టం. వారికి విప్లవ్‌ గారు ఇచ్చే అవార్డు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తుంటాను.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X