• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్ట్-39

By Staff
|

రాంరెడ్డి అందరికి వెనకగా ఓ మూలన నిలబడి సిగరెట్‌ కాలుస్తున్నాడు. నాయకులు ఆడబోయే నాటకం అతనికి అర్థమవుతూనే ఉంది. ఇటువంటి నాటకాలు అతను చాలా చూశాడు.

వారికి వ్యతిరేకంగా హైదరాబాద్‌ జనరలిస్టు యూనియన్‌కు పోటీ చేసి గెలుపొందాడు. అప్పటి నుంచి అతని కష్టాలు మరింత పెరిగాయి. చివరికి ఈ రాజకీయాలూ వద్దు, యూనియనూ వద్దు అని సన్యాసం పుచ్చుకున్నాడు. ఇప్పుడు మాట్లాడి కూడా ప్రయోజనం లేదు. పైగా దీనికంతటికీ అతనే కారణమనే ధోరణి ఒకటి నాయకుల గ్రూప్‌ ఒకటి ప్రచారంలో పెట్టింది. చెవులు కొరుకుడు పద్ధతి ద్వారా వీరు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని హత్య చేయగలరు. ఊహాగానాలు సత్యాలుగా ప్రచారమవుతుంటాయి. ఆ ఊహాగానాలేవో తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది.

''ముందు న్యాయవిచారణకు ఒప్పుకుందాం. తర్వాత మిగతా డిమాండ్ల కోసం ఆందోళన సాగిద్దాం. వాటిని పట్టుకుని కూర్చుంటే జరిగేది కూడా జరగకుండా పోతుంది'' చెప్పాడు విరాగి.

ఒక గుంపు ఎక్కడి నుంచో ''అలాగే కానీయండి'' అని పెద్దపెట్టున అరిచింది. ఆ అరుపులు మరొకరి మాట వినిపించకుండా వినిపిస్తూనే ఉన్నాయి. వెంటనే రమేష్‌ చేయి పట్టుకుని లోనికి వెళ్లాడు విరాగి.

మళ్లీ బయటకు వచ్చి న్యాయవిచారణకు సిఎం అంగీకరించారని, సత్యం బయట పడేలా న్యాయవిచారణ కమిటీ ముందు మన వాదన వినిపిద్దామని, మిగతా డిమాండ్ల సాధన కోసం దశలవారీ ఆందోళన చేపడుదామని చెప్పాడు. గుంపులు గుంపులుగా జర్నలిస్టులు అక్కడి నుంచి కదిలిపోసాగారు. కొద్ది సేపట్లోనే ఏమీ జరగనట్లే ఆ రోడ్డు ప్రశాంతమై పోయింది.

............... ................ .............................

ఇదంతా నెమరేసుకున్న రాంరెడ్డి మనసు వికలమైంది. ముఖంలో ఆ విషాదం స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. గంటల తరబడి అది కొనసాగింది. అదంతా రాసుకుని ఆఫీసు ముఖం పట్టే సరికి మరింత నీరసం ఆవహించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X