వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు పుస్తకాలు.....

By Staff
|
Google Oneindia TeluguNews

గుడిపాటి రెండు పుస్తకాలకు ఒక ఏకసూత్రత ఉంది. గత కొంత కాలంగా తెలుగు సాహిత్యంలో ప్రధానమైన రెండు కీలకాంశాలను ఈ పుస్తకాలు సృశిస్తాయి. దాదాపు ప్రతి సృజనాత్మక ప్రక్రియను తడుముతూ తెలంగాణ అస్తిత్వం, గ్లోబలైజషన్‌ల గురించి ఈ పుస్తకాలు తడుముతాయి. గత నాలుగేళ్లుగా రాసిన వ్యాసాలతో తెచ్చిన 'ఫాయిదా' వ్యాస సంకలనంలో తెలంగాణ కథా ప్రక్రియలోని నూతనత్వానికి, సహజత్వానికి సంబంధించి గుడిపాటి మెత్తగానే అయినా కచ్చితమైన ప్రశ్నలు లేవనెత్తాడు. తెలంగాణలో ఎంతో మంది రచయితలు ఉన్నప్పటికీ వారి కథలు స్థానీయ అస్తిత్వాన్ని ప్రదర్శించడంలో విఫలమయ్యాయని ఆయన అంటాడు. తెలంగాణ మాండలికంలో రాసినప్పుడు తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని, భాషను సమర్థంగా చిత్రీకరించాల్సిన అవసరం వుందని గుడిపాటి భావిస్తాడు. అన్ని ప్రాంతాల ప్రజలకు అర్థం కావాలనే ఉద్దేశంతో స్థలకాలాలకు దూరం కావద్దని ఆయన అభిప్రాయపడుతాడు.

సమాజంలో విభిన్న వర్గాలపై పడుతున్న గ్లోబలైజేషన్‌ ప్రభావాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని దాని దుష్ప్రభావాలను వ్యతిరేకించడానికి ఉద్యమాలు నిర్మించాలని గుడిపాటి 'గ్లోబలైజేషన్‌' అనే తన రెండో పుస్తకంలో అంటాడు. ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి కొత్త పరిష్కారాలు కనిపెట్టాలని ఆయన అంటాడు.

తెలుగు సాహిత్యంలో తెలంగాణ రచయితల ప్రాంతీయ చైతన్యానికి సంబంధించిన సందర్భాడాన్ని కాసుల ప్రతాప రెడ్డి తన 11 వ్యాసాల 'కొలుపు' వ్యాస సంకలనంలో ముందుకు తేవడానికి ప్రయత్నించాడు. తెలంగాణ రచనావ్యాసంగంపై ఆధిపత్యం చెలాయిస్తున్నవారిపై క్రూరమైన దాడి చేస్తున్నట్లు అనిపిస్తున్నప్పటికీ నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంత రచయితల భావనలను ఈ వ్యాసాలను వ్యక్తీకరిస్తాయి. సిద్ధాంత నిబద్ధతతో రాసిన రచనలు సృజనాత్మక రచనలకు/ రచయితలకు చేస్తున్న నష్టంపై ఈ వ్యాసాలు ఆగ్రహం ప్రదర్శిస్తాయి. స్త్రీవాద, దళిత రచనలు కూడా తెలంగాణ రచనలను వివక్షతో చూశాయని ప్రతాప రెడ్డి అభిప్రాయపడ్డాడు. ఈ ధోరణిని వదిలించుకోవాల్సి వుండిందని ఆయన అంటాడు.

తాను నమ్మిన విశ్వాసాలకు కట్టుబడి ఉన్నాడంటూ తెలంగాణకు చెందిన ప్రముఖ కవి కాళోజీకి ప్రతాప రెడ్డి ఒక వ్యాసంలో నివాళులర్పించాడు. కాళోజీని సూఫీ కవి కబీర్‌ సరసన నిలిపాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X