• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సద్దామ్‌కు సమర్థనా?!

By Staff
|

తెలుగు వార్తా పత్రికల సంపాదకీయాలు, ఆ పత్రికలకు వ్యాసాలు రాసే రచయితలు జీవిత వాస్తవికతను మించినదాన్ని విస్మరిస్తున్నట్లు అనిపిస్తుంది. సద్దాం ఓ గజదొంగ. అతను గద్దె దిగాల్సిందే. ఎంత కాలం వుంటే అంతగా అమాయకుల ప్రాణాలను బలిగొనే అవకాశాలుంటాయి.

తెలుగు వార్తా పత్రికల్లో నువ్వు చదవనిది బిబిసిలో ప్రసారమవుతుంది. ఇరాక్‌ దక్షిణాన గల బాస్రా శివారు పట్టణం అబు అల్‌ ఖాసిబ్‌లోని అది సాధారణ పోలీసు స్టేషన్‌ను సందర్శించే అవకాశం టామ్‌ న్యూటన్‌కు లభించింది. ఆ పోలీసు స్టేషన్‌ తీరుతెన్నుల గురించి అతను వర్ణించాడు. స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టే గది ఉంది. కరెంట్‌ షాక్‌ పెట్డడానికి కూడా అవకాశం ఉండే గది అది. అతి చిన్న గదులు. వాటిలో టాయిలెట్స్‌ లేవు. నీళ్లు లేవు. పై కప్పు నుంచి కొక్కెం వేలాడుతూ వుంటుంది. బ్రిటన్‌ సేనల స్వాధీనంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పోలీసు స్టేషన్‌లోకి అడుగు పెట్టడానికి కూడా ఇరాకీలు ఇష్టపడలేదు. దీన్ని అతి సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు ఇరాక్‌లో ఏం జరుగుతూ వుండేదో ఎవరైనా ఊహించుకోవచ్చు.

గుర్తింపు కార్డులు లేకుండా సద్దాం ఇరాక్‌లో ఇరాకీలు తిరగడానికి వీలుండేది కాదు. గుర్తింపు కార్డు లేకుండా కనిపిస్తే ఇంటరాగేట్‌ చేసేవారు. 20, 30 యేళ్ల మధ్య వయస్సు గలవారికే గుర్తింపు కార్డులున్నట్లు ఆ రిపోర్టర్‌ గమనించాడు. దీన్ని బట్టి సాధారణ ఇరాకీల సోదరులకు, తండ్రులకు ఏం జరుగుతూ ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

యుద్ధానికి వ్యతిరేకంగా రాస్తున్న సంపాదకులు, వ్యాసకర్తలు ఈ విషయాల గురించి మాట్లాడరు. సద్దాం అణచివేత చర్యలను చలువఅద్దాల కళ్లతో చూస్తారు. సద్దాం సోదరుడు కొత్తగా పెళ్లయిన అతని జనరల్‌ కూతురును రేప్‌ చేసిన విషయాన్ని ఎవరూ కాదనలేరు. అందుకు నిరసన వ్యక్తం చేసిన జనరల్‌ను కాల్చి చంపారు. రేప్‌ చేసిన తర్వాత ఆ జనరల్‌ కూతురున హోటల్‌ నుంచి కిందికి పడేశారు. ఓలింపిక్‌ క్రీడల్లో ఓడిపోయినందుకు ఇరాకీ అథ్లెట్లకు ఏం జరిగిందో ఊహించుకోవడం కష్టమేమీ కాదు.

ఆటవికం! సద్దాం చర్యలను చెప్పడానికి ఈ పదమే సరిపోతుంది. నా ఉద్దేశంలో- ఈ పదాన్ని ఇటువంటి చర్యలను సమర్థించే రచయితలకు, శాంతికాముక కార్యకర్తలనబడేవారందరికీ వర్తింపజేయాలి. తెలిసో, తెలియకో వీరు హిందీ, తెలుగు సినిమాల్లో మాదిరిగా ప్రజలను చంపుతామని, రేప్‌ చేస్తామని బెదిరించే గ్రామంలోని వ్యక్తిని చూసి తలలు వంచుకుని నడుస్తారు. నిజానికి వీరు విలన్లను ఇష్టపడుతారు. వీరినే మరో పదంతో కూడా పిలవాలని ఉంది- పిరికివాళ్లని.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more