వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడుగుజాడలు కెరీరిజంలో...

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగు సాహిత్యానికో విచిత్రమైన లక్షణం వుంది. ముఖ్యంగా తెలుగు కవిత్వానికి. రాజకీయోద్యమాలు, సామాజికోద్యమాలు లేకపోతే అది నిట్టూర్పులు విడుస్తూ కుంటి నడక నడుస్తుంది. ఇక్కడ కవులే ఉద్యమకారులు, సిద్ధాంత కర్తలు అవుతున్నారు. కవిత్వంలో ఉద్యమాలను చూసుకుని సామాజిక, రాజకీయోద్యమాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నట్లే ఫోజులు కొడుతారు. ఆ ఉద్యమాలకు ఒక చిరు ఆలోచన కారణమవుతుంది. ఇప్పుడు తెలుగు కవిత్వం కొత్త ఉద్యమాన్ని వెతుక్కునే దశలో వుంది. ఒక్కటే ఉద్యమం, అది విప్లవోద్యమం అనేవారు, తమ సాహిత్యాన్ని తమ కోసమే నిరంతరంగా సృష్టించుకుంటూ పోతారు. ఇది వేరే విషయం. దళిత, స్త్రీవాద వుద్యమాలు అవార్డులకు, సత్కారాలకు, యూనివర్శిటీల్లో పనులకు, ఉద్యోగాలకు, ఎన్‌జివోలకు నిష్పూచిగా తాకట్టు పడ్డ తర్వాత ఈ గ్యాప్‌ వచ్చింది. ఈ మెజారిటీ వర్గం ఎప్పుడూ గొంతు పెద్దది చేసుకోవడమే కాకుండా మైక్‌లు పెట్టి ఊదరగొడుతుంది.

ఇంత వరకు ఉధృతంగా వచ్చిన దళిత, స్త్రీవాద సాహిత్యాలకు కొనసాగింపు లేకుండా పోతోంది. ఈ కొనసాగింపు లేకపోవడానికి మధ్యేమార్గ కవులతో అంటే కెరీరిస్టులతో మెజారిటీ రచయితలు, కవులు మిలాఖత్‌ కావడమే కారణం. సాహిత్య సృష్టి, ముఖ్యంగా కవిత్వ సృష్టి సాహిత్యేతర ప్రయోజనాల కోసం ఉత్పత్తి అవుతూ ఆ ప్రయోజనాలను తీర్చుకున్నాక నీరుగారి పోతోంది.

గుంటూరు శేషేంద్ర శర్మకు పద్మశ్రీ రాకుండా జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత ఆచార్య సి. నారాయణ రెడ్డి అడ్డుపడ్డారనే విషయంపై పెద్ద దుమారమే చెలరేగింది. శేషేంద్ర శర్మ బహిరంగంగా సి. నారాయణరెడ్డికి వ్యతిరేకంగా ముందుకు రావడంతో ఇది కొంచెం పాకాన పడింది. ఇది తెలుగు సాహిత్యంలో ఒక రకంగా చూస్తే చాలా చిన్న విషయం. సి. నారాయణ రెడ్డి తాను సతత హరితారణ్యాల మాదిరిగా పచ్చగా వుండడానికి తెలుగు సాహిత్యంలో కష్టపడాల్సి వచ్చేదేమో గానీ ఇప్పుడా కష్టం అవసరం లేదు. ఇంతకు ముందు తెలుగు సాహిత్యంలో ప్రత్యామ్నాయం ప్రతిపాదించిన పెద్దలందరూ ఇప్పుడు ఆయన మార్గాన్ని సువిశాలం చేశారు. స్త్రీవాదులు, దళిత వాదులు కొందరు నిజాయితీగా కన్న స్వప్నాలను కాళ్ల కింద తొక్కేసి అటు నడిచారు. ఈ మార్గంలోకి వెళ్లడానికి వారెంచుకున్న మార్గమే చాలా మందిని నిరాశపరుస్తోంది. అయితే, ఇదంతా ఒకందుకు మంచినే చేస్తోంది. ఇన్నాళ్లు, సృజనాత్మక రచనలకు స్థానం లేకుండా ప్రచారార్భాటాలతో ముందున్న వారి రచనలు ఇక వెనుక తట్టు పట్టు అవకాశం వుంది. అసలు సిసలు సృజనాత్మక రచనలకు, రచయితలకు ఇప్పుడైనా మంచి రోజులు వస్తాయని భావించవచ్చునేమో!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X