• search

అమిత్‌ చౌధురికి అవమానం

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న భారత రచయిత అమిత్‌ చౌధురిని కూడా జాతి వివక్ష వీడలేదు. అమిత్‌ చౌధురిని హాంగ్‌కాంగ్‌ ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకుని గంట పాటు నిర్బంధించారు. హాంగ్‌ కాంగ్‌ ఇమిగ్రేషన్‌ అధికారులు తనను అదుపులోకి తీసుకోవడంలో జాతి వివక్ష ప్రదర్శించారని ఆయన విమర్శించారు. తనను ఎందుకు అరెస్టు చేశారో కూడా తెలియజేయకపోవడం అమిత్‌ చౌదరిని ఆశ్చర్యపరచడమే కాకుండా బాధపెట్టింది కూడా.

    అమిత్‌ చౌధురి హాంగ్‌కాంగ్‌ సాహిత్యోత్సవంలో పాల్గొనడానికి భారత్‌ నుంచి బయలుదేరి బుధవారంనాడు హాంగ్‌కాంగ్‌కు చేరుకున్నారు. బుధవారం రాత్రి చెక్‌లాప్‌ కోక్‌ విమానాశ్రయంలో కాలు పెట్టడమే ఆలస్యం ఇమిగ్రేషన్‌ అధికారులు ఆయనను తమ వెంట తీసికెళ్లారు. సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ అనే పత్రిక ఈ విషయాన్ని రాసింది.

    తన వద్ద వున్న భారత పాస్‌పోర్టు చౌధురిని వీసా ఫ్రీ ఎంట్రీని అనుమతిస్తుంది. గంట తర్వాత తనను విడుదల చేసి ఆ ఆలస్యానికి గల కారణాలను అధికారులు చెప్పలేదని చౌధురి అన్నారు. తన పట్ల ఇమిగ్రేషన్‌ అధికారులు మర్యాదగానే ప్రవర్తించారని, కానీ తనను అదుపులోకి తీసుకోవడానికి గల కారణం చెప్పకపోవడమే ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. చైనీస్‌ అధికారులు తీవ్రంగా పరిగణించే ఇతివృత్తాలేమీ తాను తీసుకోలేదని, జాతి వివక్ష వల్లనే తన పట్ల ఆ విధంగా ప్రవర్తించి వుంటారని భావిస్తున్నానని ఆయన అన్నారు.

    'ఫ్రీడమ్‌ సాంగ్‌', 'ఎ న్యూ వరల్డ్‌'లతో పాటు చౌధురి నాలుగు నవలలు రాశారు. బెస్ట్‌ ఫస్ట్‌ బుక్‌ కింద ఆయనకు కామన్‌ వెల్త్‌ రైటర్స్‌ ప్రైజు, దక్షిణాది ఆర్ట్స్‌ లిటరేచర్‌ ప్రైజులతో పాటు ఆయనకు పలు అవార్డులు వచ్చాయి.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more