వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-35

By Staff
|
Google Oneindia TeluguNews

ఉదయం 11 గంటలు. ప్రెస్‌క్లబ్‌ వద్ద జర్నలిస్టులు ఒక్కొరొక్కరుగా, గుంపులుగా వచ్చి చేరుతున్నారు. అందరి మొహాల్లో విషాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాల నుంచి రిపోర్టర్లు వచ్చారు. వారి ముఖాల్లో విషాదం, భయం దోబూచలాడుతున్నాయి.

రాంరెడ్డి పది గంటలకే అక్కడికి చేరుకున్నాడు. అతని ముఖం అంతా పీక్కుపోయింది. కళ్లు లోతుకు పోయాయి. దీర్ఘ రోగంతో మంచాన పడి లేచినవాడిలా వున్నాడు. భయమో, ఆగ్రహమో, విషాదమో తెలియని ఒక విచిత్రభావనకు అతను లోనవుతున్నాడు. ఒక్కరొక్కరే వచ్చి అతడ్ని పలకరిస్తున్నారు. వారికి జవాబు చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. తనను బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది. ఆంగ్లదినపత్రికలవారైతే ఏదో కొత్త విషయం తమకు తెలిసినట్లు వింతగా మాట్లాడసాగారు. వాళ్లకు వాస్తవాలు తెలియవు. నక్సలైట్లు, నక్సలిజం వారికి ఎప్పటికీ కొత్త విషయాలే. మార్క్సిజం చాలా మందికి తెలియదు. అధికార వర్గాల వార్తలకు వాళ్లు దగ్గరగా ఉంటారు. వాళ్లకు ఫీల్డ్‌ స్టోరీస్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

జిల్లా రిపోర్టర్ల పలకరింపు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జిల్లా రిపోర్టర్ల పరిస్థితి వేరు. జిల్లాకు ఒక రెగ్యులర్‌ ఎంప్లాయ్‌ మాత్రమే అప్పుడు ఉండేవాడు. ఒక్కో పత్రికకు మండలానికో రిపోర్టర్‌ ఉంటాడు. వీళ్లను స్ట్రింగర్లని పిలుస్తారు. అంటే పార్ట్‌టైమర్స్‌. వాళ్లు రాసిన వార్తలను స్కేల్‌ పెట్టి కొలిచి డబ్బులు ఇస్తారు. బాధ్యత మాత్రం ఎక్కువే ఉంటుంది.

''ఏదో బెదిరిస్తున్నారు గానీ చంపరనే ధైర్యం ఇప్పటి వరకు ఉంటూ వచ్చింది'' అన్నాడు కరీంనగర్‌ నుంచి వచ్చిన వాసు.
వార్తలు రాసే పనిలో నక్సలైట్లతో జిల్లా రిపోర్టర్లకు సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. దీంతో సమాచారం కోసం పోలీసులు వారిని వేధిస్తూ ఉంటారు. నక్సలైట్లతో సంబంధాలు అంటిగట్టి మానసిక వేదనకు గురి చేస్తూ ఉంటారు. ఈ స్థితిలో తెలంగాణలో రిపోర్టర్‌ ఉద్యోగమంటే కత్తి మీద సాము వంటిది. అందువల్ల రసూల్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ర్యాలీ తీస్తున్నామని జర్నలిస్టుల సంఘం పిలువు ఇవ్వడమే తరువాయి తెలంగాణ జిల్లాల నుంచి రిపోర్టర్లందరూ వచ్చి చేరారు.

ఊరేగింపు మొదలైంది. జీతాలు పెంచడానికి బచావత్‌ అవార్డును అమలు చేయాలని తలపెట్టిన ర్యాలీకి కూడా ఇంత మంది రాలేదు. జర్నలిస్టుల ర్యాలీలు ఎప్పుడూ ఏదో కొంత మందితో సాగుతుంటాయి. ఇప్పుడలా లేదు.

ప్రెస్‌క్లబ్‌ నుంచి మొదలైన ఆ ర్యాలీలో జర్నలిస్టుల ముఖాలు చూస్తే జీవించే హక్కును కాపాడుకోవాల్సిందేనన్న భావన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నినాదాలు హోరెత్తాయి. 'హోం మినిస్టర్‌ రాజీనామా చేయాలి', 'సిఎం డౌన్‌ డౌన్‌' లాంటి నినాదాలు మిన్నంటుతున్నాయి. తాము ర్యాలీలు తీస్తే వార్తలు రాసేవాళ్ల ర్యాలీ ఇంత పెద్దయెత్తున సాగడం హైదరాబాద్‌ ప్రజలకు వింతగా ఉంది.

అప్పటికే ప్రభుత్వం మీద ఒత్తిడి తీవ్రమైంది. పౌర హక్కుల సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొనడానికి వస్తామని చెప్పారు. వారిని వద్దని జర్నలిస్టు నాయకులు చెప్పారు. దీంతో జర్నలిస్టులు మాత్రమే ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాంరెడ్డి ర్యాలీ మధ్యలో మౌనంగా నడుస్తున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X