వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫెలోషిప్ అందుకున్న దార్ల

By Super
|
Google Oneindia TeluguNews

యువకవి, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డా.దార్ల్ల వెంకటేశ్వరరావుని భారతీయ దళితసాహిత్య అకాడమీ వారు ఈ ఏడాది (2007) డా.అంబేడ్కర్ ఫెలోషిప్ అవార్డుతో సత్కరించారు. 2007 డిసెంబర్ 9-10 తేదీలలో ఢిల్లీ, రాజనివాస్ మార్గ్ లో ఎంతో వైభవంగా జరిగిన 23 వ దళిత రచయితల జాతీయ సదస్సులో ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు డా.ఎస్.పి. సుమనాక్షర్ చేతుల మీదుగా డా.దార్ల వెంకటేశ్వరరావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన దళిత రచయితల సదస్సులో డా.దార్ల వెంకటేశ్వరరావు “తెలుగు సాహిత్యంలో దళిత (మాదిగ) జీవిత ప్రతిఫలనం " ( Life reflections of Dalits (madigas) in Telugu Literature ) అనే పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ సదస్సులో జాతీయ స్థాయిలో దళితసాహిత్యం, దళిత జీవతాలకు సంబంధించిన వివిధ అంశాలలో చర్చలు జరిగాయి. చాలామంది తమ పత్రాలను, కథలను, కవిత్వాన్ని భారతీయ సాహిత్య అకాడమీ వారికి సమర్పించారు. వేదికపై వివిధ ప్రాంతాలనుండి వెలువడుతున్న కొన్ని దళిత పత్రికలను ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయంగా ఉన్న వర్ణ, కుల , వర్గ వివక్షలను ఈ సదస్సు సుదీర్గంగా చర్చించింది. భారతదేశంలో ఉత్త్తరాదిలో బహుజన చైతన్యం మిగిలిన రాష్ట్రాలలోనూ రావాలని సదస్సు ఆకాంక్షించింది.

భారతదేశవ్యాప్తంగా వివిధ భాషలలో దళిత సాహిత్యం, సామాజిక, పత్రికా, కళారంగాలలో కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఈ సమావేశాల్లో డా.అంబేడ్కర్, జ్యోతీబాపూలే, మహర్షి వాల్మీకి, సద్గురు కబీర్ , గురు రవిదాస్, బిర్సాముండా, జగజ్జీవన్ రామ్ తదితరుల పేర్లతో జాతీయ స్థాయిలో వివిధ పురస్కారాలను అందజేశారు. వేలాదిగా హాజరైన ప్రతినిధులకు షా ఆడిటోరియం సరిపోలేదు. వివిధ స్థాయి రాజకీయ నాయకులు, మంత్రులు, మాజీ గవర్నర్లు, సాహితీవేత్తలు. కళాకారులు హాజరైన ఈ సమావేశాల్ల్లో భారతీయ దళిత సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.ఎస్.పి. సుమనాక్షర్ చేతులమీదుగానే పురస్కారాలను స్వీకరించడానికి అత్యధికులు ఉత్సాహం చూపారు. రెండు రోజుల ఈ జాతీయ సదస్సులో వివిధ భాషలలో వెలువడిని దళిత సాహిత్యాన్ని ప్రదర్శించారు.

English summary
Dr Darla Venkateswar Rao receives Ambedker fellowship
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X