వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రచయితల ధూమ్

By Super
|
Google Oneindia TeluguNews

తెలంగాణ రచయితల వేదిక నాల్గవ రాష్ట్ర మహాసభలు జనవరి 12వ తేదీన కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతతో పాటు తెలంగాణ సాహిత్య విశిష్టతను ఈ మహాసభలు చాటాయి. ప్రారంభ సదస్సుకు విదర్భ రచయిత అగ్లావే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తెలంగాణలాగే ప్రత్యేక రాష్ట్రం కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నది. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలనే కాంగ్రెస్ ఆలోచనను ప్రముఖ విప్లవ కవి వరవరరావు వ్యతిరేకించారు. నిజాం ప్రశంసించడాన్ని ఆయన తప్పు పట్టారు. జగిత్యాల జైత్రయాత్ర గురించి వివరించారు. తెలంగాణ ఉద్యమానికి విప్లవ రచయితల మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ పట్ల సిపియం అనుసరిస్తున్న వైఖరిని వార్త దినపత్రిక సంపాదకుడు టంకశాల అశోక్ తప్పు పట్టారు. తెలంగాణ రచయితలకు అధ్యయనం అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ విషయంలో కమీషన్ల వ్యవహారాన్ని ప్రముఖ కవి జింబో తప్పు పట్టారు. ఈ ప్రారంభ సదస్సులో తెలంగాణ రచయితల వేదిక (తెరవే) అధ్యక్షుడు జూకంటి జగన్నాథం రయితలకు మార్గనిర్దేశం చేస్తూ తెలంగాణ సాహిత్య ఉద్యమ తీరుతెన్నులను వివరించారు. తెరవే ప్రత్యేక సంచికను ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. తెరవే ప్రధాన కార్యదర్శి


అనంతరం జరిగిన సదస్సులో ప్రముఖ న్యూరోలజిస్టు రాజారెడ్డి చరిత్రపై ప్రసంగించారు. శాతవాహనుల రాజధాని అయిన కోటిలింగాల ముంపునకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నిజాంను కొన్ని విషయాల్లో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. జానపద సదస్సుకు ప్రముఖ సాహితీవేత్త జయధీర్ తిరుమలరావు అధ్యక్షత వహించారు. ప్రజా కళారూపాలను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ముత్యం ఈ సదస్సులో గుర్తు చేశారు. అనంతరం పుస్తాకావిష్కరణలు జరిగాయి. చివరి సదస్సులో తెలంగాణ గాయకులను ప్రముఖ దర్శకుడు బి. నర్సింగరావు సత్కరించారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాల్లో పాట నిర్వహిస్తున్న పాత్రను నర్సింగరావు వివరించారు. తెలంగాణ పాటల రచయితలతో, వారి ఉద్యమాలతో తనకు గల అనుబంధాన్ని ఆయన నెమరేసుకున్నారు.

తెరవే రాష్ట్ర సభలకు తెలంగాణ నలుమూలల నుంచి కవులు, రచయితలు, మేధావులు కదిలివచ్చారు. దాదాపు మూడు వందల మందికి పైగా పాల్గొన్నారు. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ధూమ్ ధామ్ విశేషంగా ఆకట్టుకుంది.

English summary
report,telangana writers,kareem nagar,sahiti,telugu literature,essay,seperate state,jagannatham,nandini sidda reddy,raja reddy,తెలంగాణ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X