వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరుపురాని లోకసంచారికి నివాళి

By Pratap
|
Google Oneindia TeluguNews

Balagopal
సామాజిక కార్యకర్తగా, మావన హక్కుల ఉద్యమకారుడిగా కె. బాలగోపాల్ తెలుగు సమాజంపై వేసిన ముద్ర అనిర్వచనీయమైంది, అమోఘమైంది. నిరంతరం భయాందోళనల మధ్య జీవించే మనిషికి భరోసా ఇచ్చిన మరో మానవుడు. సృజనాత్మక మేధావిగా ఆయన వెలువరించిన ఆలోచనా పరంపర ఎంతో విలువైంది. ఆచరణలో వ్యక్తిత్వాన్ని సాన పెట్టుకున్న మహా వ్యక్తి ఆయన. ఆయన హఠాన్మరణం తెలుగు సమాజాన్ని కుదిపేసింది. తెలుగు బౌద్ధిక ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. తెలుగు ప్రజల గుండెలు బరువెక్కాయి. ఆయన మృతికి పలు వైపుల నుంచి ప్రతిస్పందనలు వచ్చాయి. మరణించినా జీవించి ఉండే ఆ వ్యక్తి గురించి తెలుగు బౌద్ధిక ప్రపంచం ప్రతిస్పందనలు వ్యాసాల రూపంలో వెలువడ్డాయి.

ఆ ప్రతిస్పందనలను ఒక దగ్గర చేర్చి జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో రామయ్య విద్యా పీఠం మరుపురాని లోకసంచారి పేర ఒక పుస్తంగా వెలువరించింది. బాలగోపాల్ పై నివాళి వ్యాసాలను ఆ రకంగా తెలుగు సమాజానికి అందించింది. ఈ వ్యాసాల్లో బాలగోపాల్ వ్యక్తిత్వం, కార్యశీలత, సృజనశీలత, బౌద్ధిక ప్రపంచం వ్యక్తమైంది. పలు కోణాల నుంచి వారి వారి అనుభవాలను వ్యాసకర్తలు తమదైన పద్ధతిలో రాశారు. సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా తెలుగు సమాజం ప్రతిస్పందించిన తీరు ఈ వ్యాసాల్లో వ్యక్తమైంది. అన్నింటికన్నా బాలగోపాలో ఒక మానవుడు అనే విషయాన్ని ఈ వ్యాసాలు పట్టిస్తాయి.

వరవరరావు, హరగోపాల్, ఎం.కోదండరామ్, వేల్చేరు నారాయణరావు, కత్తి పద్మారావు వంటివారు రాసిన నివాళి వ్యాసాలతో పాటు పలువురి వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. గతంలో కెఎన్ వై పతంజలి బాలగోపాల్ పై రాసిన ప్రశంసాత్మక వ్యాసం కూడా ఇందులో ఉంది. దానికి తోడు, బాలగోపాల్ రాసిన కొన్ని సాహిత్య వ్యాసాలను మచ్చుకు ఇందులో చేర్చారు. సాహిత్యంపై కె. శ్రీనివాస్ చేసిన బాలగోపాల్ ఇంటర్వ్యూ కూడా ఉంది. ఈ పుస్తకంలోని నివాళి వ్యాసాలు చదివితే మానవ మనుగడకు అర్థం చెబుతూ బాలగోపాల్ నడుచుకున్నతీరు, ఆలోచించిన వైనం మనకు బోధపడుతుంది.

(మరుపురాని లోకసంచారి, సం. జూలూరు గౌరీశంకర్, వెల: రూ. 50, ప్రతులకు: రాష్ట్రంలోని అన్ని పుస్తకాల షాపులు)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X