వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రామిక కవిత్వం-సమకాలీన స్పందన

By ఇ. వెంకటేష్
|
Google Oneindia TeluguNews

ప్రపంచీకరణ పాలకవర్గాలకు తప్పనిసరి అవసరం. దీని ప్రభావం మాత్రం ప్రజల ప్రాణాల మీదికి వస్తుంది. ఈ నేపద్యమే ఈనాటి కవిత్వానికంతటికి కారణం. అనుభూతి, ఆవేశం కవిత్వానికి ప్రధాన ద్రవ్యాలని మహాకవి జాషువా అంటాడు. ఈ రెండు "కొండ్రెడ్డి"లో పుష్కలంగా ఉన్నాయి. సమకాలిన పతనానికి సంబందించిన సర్వ అంశాలూ, ఎంతో అవేశంతో, కోపంతో ఖండిస్తూ పోతాడు కవి. ఈ రచయిత ఇటివల వెలువరించిన "దుక్కిచూపు"లొ ఈ అంశాలన్ని రాసులు పోసినట్లుగా కనిపిస్తాయి."దుక్కిచూపు" అనగానే దున్నిన మట్టిచూపు అనుకోవడం సహజం. ఆ నైజం భాహిరం మాత్రమే. కాని కాస్త లోతుగ చూస్తే ఆ దుక్కికి అడుగున ఆర్తి ఉంది.మనిషికి మనుగడ కలిగించే జీవస్పూర్తి ఉంది. రచయిత తీసుకొన్న వస్తువు ప్రాథమికంగా పల్లెపరిసరాలకు సంభంధించిందే.వ్యవసాయం అంటే ఏమిటో, ఎంత కవితాత్మకంగా చెప్పాడొ ఈ క్రింది పంక్తులు సాక్షాలుగా నిలుస్తాయి. "వ్యవసాయం అంటే..../వేగుచుక్కతో మొలిచొచ్చే కళ్ళు/కోడికూతతో కదిలే కాళ్ళు/పొడిచే పొద్దుతో/దినచర్యలైపొయిన చేతులు" ఇలా కొత్తదనాన్ని కుమ్మరించే పంక్తులెన్నో ఈ కావ్యంలో ఉన్నాయి."దుక్కిచూపు" రైతు కావ్యం. ఇక్కడి ప్రజల అనుమతి లేకుండా బలవంతంగా ప్రజల నెత్తిన గ్లోబలైజేషన్ ప్రక్రియను రుద్దారు. దీని పలితంగా అన్ని సామాజిక రంగాలతో పాటు వ్యవసాయ రంగం కూడ సంక్షోబంలో పడింది.

శ్రమ సంబందాలు నశించి ఆర్థిక మానవసంబందాలు పెద్దపీట వేయడం మీద కవి ఆవేదన వ్యక్తం అవుతుంది. రుతువులకు, రైతులకు ఉన్న సంబందం విడదీయరానిది.

"ఇకపై కృషివలుని చుట్టూ కందకాల్లా కొత్తవలయాలు
కాడికి కంప్యూటర్ మేడికి "కీ" బోర్డు
వెబ్ సైట్ లో విత్తడం
ఇంటర్నెట్ లో అమ్మకం
అంతా గ్లోబలైజేషన్
సాగుభూముల్లో తొండల గుడ్లు"
'దగాపడ్డ చెమటచుక్క దిగాలుగ చూస్తుందీ అంటూ మొదలయ్యే 'దుక్కిచూపూకావ్యం పాఠకుడిని తనవెంట లాక్కుపోతుంది.'నిజంగా పేదరికం ఓ నిశ్శబ్దపు గాయం'అన్న పూర్తి అవగాహన కలిగిన రచయిత వెంకటేశ్వరరెడ్డి.
"ఈ రోజు మాట్లాడు కోవడానికి
పేదరికమంతా
విలువైన వస్తువు మరొకటిలేదు" అని దెప్పి పొడిచాడు.
కవి వస్తువును ఎన్నుకోవడంతో పాటు వస్తువుకు తగిన రూపాన్ని,అభివ్యక్తిని తగిన విదంగా వాడుకొన్నాడు. రైతు భాధలను కవిత్వీకరించడంలో అనేక భావ చిత్రాలను ఎన్నుకొని వర్తమాన వ్యవసాయం ఎలా తయారయిందో చిత్రీకరించాడు.
"క్షణం క్షణం శిలువనెక్కే సేద్యం
కారంతా కరువు ఏకరువు పెట్టుకోను దిక్కులేదు"
దేశానికే రైతు వెన్నుముక అని గొప్పలు చెప్పుకొనే రాజకీయ వ్యవస్థలో వ్యవసాయరంగం నగ్నస్వరూపాన్ని వెల్లడిస్తున్నాడు.
"అసలు పంట పొలాలకు
పాడె గట్టిన ప్రతిభ ఎవరిది?
కరువు రైతులు రైతు కూలీలు అప్పుల ఊబిలో కూరుకపోయి ఆత్మహత్యలు చేసుకొనే పరిణామం దాపురించింది.
"అప్పును ఆత్మహత్యను బొమ్మగా గీస్తే పత్తి రైతు గోచరిస్తాడు ఇపుడు రైతును మోసగించనిది మరణమొక్కటే"
భారతీయ రైతుకు ప్రపంచీకరణ పరమ శత్రువు. కవి ఈ సత్యాన్ని గ్రహించాడు.
"సైబర్ సైతాంతో రక్కించాక
సంస్కరణలన్ని శాడిజం సింబల్ కాబోతున్నాయ్
నేలంతా గాయాలు అల్లుకున్నప్పుడు
ఆయుధం ఓ తిరుగుబాటై చిగుర్చుతుంది"
అని ఈ రైతు కావ్యంలో కవి ఇస్తున్న సందేశం."దుక్కిచూపు" ఆకలి కావ్యం. రైతు ఆగ్రహ కావ్యం.రైతు గాయాన్ని పాడుతున్న కర్షక కవి "కొండ్రెడ్డి"మరిన్ని కావ్యాలు రాయాలని కోరుకుంటున్నాను.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X