వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవిత్వం నాకో మాయలాంతరు లాంటిది పార్ట్-1

By Pratap
|
Google Oneindia TeluguNews

Vegunta Mohan Prasad
మోగా ప్రసిద్ధుడైన తెలుగు కవి వేగుంట మోహన్ ప్రసాద్ అమర కవివరులు ఆశ్చర్యపడగా అమరలోకానికేగాడు. మోది పోస్ట్ మోడర్న్ కవిత్వమని, వినిర్మాణవాదమనీ అంటారు. ఆయన తెలుగు కవిత్వానికి కొత్త వ్యాకరణాన్ని అందించారు. అసలు వ్యాకరణాన్ని బద్దలు కొట్టే కవిత్వం ఆయనది. మో కవిత్వం అర్థం కాదని ఇప్పటికీ చాలా మందే అభిప్రాయపడుతుంటారు. తాను భూలోకం వదిలి వెళ్లిపోతున్నానని ముందుగానే పసిగట్టాడేమో తన కవిత్వ రహస్యాన్ని ఆయన విప్పాడు. జులై 14వ తేదీన తణికెళ్ల భరణి పురస్కార సభలో ఆయన తన కవిత్వమేమిటో క్షుణ్నంగానే వివరించాడు. ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ ఆ ప్రసంగ పాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాం -

మీ అందరి ముందు, ఇంత వందలాది మంది అందరి ముందు మహామహులైన చలన చిత్ర కళాకారులందరి ముందు వారి వందలాది మంిద కళాభిమానుల ముందు, సాహిత్య, సారస్వతవేత్తల ముందు ప్రసిద్ధ, ప్రఖ్యాత, పరిణత కవుల ముందు, వారి వందలాది మంది అభిమాన యువకవుల ముందు నేను ఇలా చేతులు కట్టుకుని తలవంచుకొని బిడియపడుతూ సమర్థించుకోటానికి మాటలు రాక సంజాయిషీ చెప్పుకోటానికి అభిమానం అడ్డుపడుతూ - తెలిసి చేసిన నేరమేదో తెలీక, తెలియక చేసిన సాహసమేదోనని అనుమానాస్పద స్థితిలో - నేనిలా ఈ సాయంకాలం నా సంధ్యా సమయంలో నాదే అయిన ఒకానొక సాంధ్యభాషలో ఏమి చెప్పాలో ఎలా చెప్పాలోననే అనవగాహన స్థితిలో పోనీ ఏదన్నా రాద్దామా - దాన్నే ఏదో ఒక అవస్థలో చదివేద్దామా అనే ఒకానొక సందిగ్ధ స్థితిలోంచి ఎక్కడ మొదలు పెట్టాలో ఏది ఆరంభానికి ప్రారంభమోనని నా సర్వ దేహంతోనూ సందేహిస్తుంటే - చిన్నప్పుడెప్పుడో చదివిన 'ఆలిన్ ఇన్ వండర్‌లాండ్' లోంచి ఓ స్వరం విన్పించింది. "Begin at the beginning ... and omtill you come to end, then stop" అని. సరే. ముందుగా నన్ను నేను నా కవితా రుషి టిఎస్ ఎలియట్ మాటల్లోనే వర్ణించుకుంటాను - అంన్నాడు ఆల్ఫ్రెడ్.జె.ప్రూఫ్రాక్ నాలానే

I grow old.. I grow old...
I shall wear the bottoms of my trousers rolled

నిజమే కదూ! మీలానే ప్రూఫ్రాక్‌ని చూస్తోన్నవాళ్లు కూడా అనుకొంటున్నారట స్వగతాలుగా!

(How his hair is going thin!
.........
But how his arms and legs are thin!)

ప్రూఫ్రాక్ ఏమన్నాడో చెప్పనా? "I have measured out my life with coffee spoons" నా భయమేమిటో చెప్పనా, ప్రూఫ్రాక్‌లానే?

I have seen my head (grown slightly bald)
Brought in upon a platter
I am mo prophet - and here is no matter!

అవునూ వీడేవిటి వాడి తెలుగు కవిత్వాన్ని గురించి చెప్తాడనుకుంటే ఆంగ్లంలో గొణుక్కుంటున్నాడనుకుంటున్నారు కదూ.

అవును. నేను రాసే తెలుగు అందరూ రాసే తెలుగులాంటిది కాదు. అది కవిత్వమైనా వచనమైనా. నాకసలు ఈ రెండు భాషల్లో ఏదీ పూర్తిగా రాదు. భావానికి శబ్దాలు అల్లుతాను ఊరికినే. కవిత్వ భాష నాకొక మాయ లాంతరులాంటిది. ఆ మాయ లాంతరు తన వెల్తురు నరాల్ని తెర మీద అల్లుతుంది. ఆ మాట నాది కాదు నిజానికి. ఎక్కడ్నుంచి కొట్టేసానో చెప్పుకోండి.

(ఇక్కడ ప్రొఫెసర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎవరైనా ఉన్నారా?) సాధారణ కవులు మహాకవుల్ని అనుకరిస్తారు. అసాధారణ కవులు మహాకవుల్ని తస్కరిస్తారు. నేను సాధారణ కవినీ కాను, మహాకవినీ కాను, అసాధరణ కవిని. కవిత్వం మాయలాంతరనేది ఒక్క వెల్తుర్నే కాదు ప్రసరించేది. నీడల్ని కూడ. ఛాయల్ని కూడ. జాడల్ని కూడ. అందుకే అన్నాడు మహాకవి ఎలియట్ -

Between the idea
And reality
Between the motion
And act
Falls the shadow

ఈ వెల్తురు యొక్క ఛాయనే నేను చిత్రించాను నా ప్రథమ కృతి 'చితి - చింత'లో. దానిలోని నీడలేమిటో నీడల గొదవేమిటో గొడవ గొడవ గొడవగా ఉందని చాలా మంది గోలుగోలుగా గగ్గోలు పెట్టారు. సరే. తెలుగు కవిత్వాభిమానులారా మీ పనిలా ఉందాని మరో కవితా గ్రంథం 'రహస్తంత్రి' వెలువరించాను.

'అట్లా అని పెద్ద బాధా ఉండదు' అని 'చితి - చింత' (1969)లో ఆరంభించినవాడినల్లా 'రహస్తంత్రి' (1991)లో ఒక కవిత 'ఎక్స్‌ప్రెషనిజమ్' అనే దానికి 23 పాదసూచికలిచ్చాను. దీంతో పాఠకులు మరింత అయోమయంలోకి మునిగిపోయి ఇక వీడితో లాభం లేదని నన్ను పూర్తిగా ఒదిలేసారు.

అయినా నేనొదుల్తానా నా ప్రియ పాఠకుల్ని

ఈసారి కాగితం మీద రాయకుండా కవితల్ని అన్నిటినీ టేప్ రికార్డర్‌కి వినిపించి పునరపి (1993) ప్రచురించాను. ఇది వచన కవిత్వమూ కాదు శుద్ధవచనమూ కాదు. కాని ఒక కొత్త వాచ్యకవితను, శబ్దాశ్రయ కవిత్వాన్ని సాధించుకొంటాను.

అంతకు కొంచెం ముందే 1990లో 'బతికిన క్షణాలు' అన్నిటినీ ఒకే ప్రవాహంలో రెండు రాత్రులలో రాసేసాను. మిగిలిన క్షణాల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసారు పాఠకులు. పూర్తిగా అన్నీ విప్పిచెప్పే అమాయకత్వం నాకెపుడూ లేదు. అసలు భావాన్ని ఏ భాషలోనైనా పూర్తిగా విప్పి చెప్పగలమా అనే Ontological అనుమానం నాకెపుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. 'సాంధ్య భాష' 1999లో అంటే అర్థమేమిటో (ఈ పదానికి అర్థమేమిటో) కాస్త అర్థమయ్యేట్లు రాస్తే ఓ పార్కర్ పెన్ బహుమతిగా ఇస్తానని పత్రికా ప్రకటన చేశాడో విమర్శక మిత్రుడు! పైగా అతడొక తెలుగు పండితుడు.

English summary
Vegunta Mohan Prasad popularity known as 'Mo' is no more. he works will remain. As a tribute, here is his speech on his poetry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X