వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పఠాభి కవిత్వమై నడిచొచ్చాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Aila Sydachari
ఆ మధ్య దాము కవిత్వం పై తెలుగు సాహిత్య లోకంలో దుమారం చెలరేగింది. కొందరు గుండెలు బాదుకున్నారు. సమాజానికి చూపకుండా కొన్నింటిని దాము 'ఎటిట్‌' చేసుకుంటే బాగుండేదనే ఉచిత సలహా పారేశారు. ఇలా సలహా ఇచ్చిన వారందరూ బహుశా అంతకు ముందే పఠాభి 'ఫిడేల్‌ రాగాల డజన్‌' చదివి వుంటారనడానికి సందేహం అక్కర్లేదు. వ్యక్తిగతం వేరు సామాజికం వేరు - అంటే రెంటినీ దేనికి దాన్ని విడదీసి కవిత్వానికి పెద్ద ప్రమాదాన్ని తెచ్చి పెట్టినవారు. వ్యక్తిగతం కూడా సామాజికమేనన్న కనీస విషయం వీరికి పట్టలేదని అనుకోవాల్సి వుంటుంది. వ్యక్తి సమూహంలోని ఒక్కడిగానే వుంటూనే ఒకంటరివాడనే విషయం వారికి పట్టినట్లు లేదు. కవీ అంతే. అయితే, కవి వ్యక్తిగతం కూడా సామాజిక పరిస్థితులను బట్టే రూపోందుతుంది. ఈ విషయం వారికి తెలియదని కాదు. కవులు, సాధారణ వ్యక్తుల కన్నా ఉన్నతులమనే భావన అంతరాంతరాల్లో గూడు కట్టుకని వుండటం వల్లనే కవిత్వంలో ఎడిటింగ్‌ వుండాలని చెప్పారు.

ఈ చర్చకు అయిల సైదాచారి కవిత్వానికి విడదీయరాని సంబంధం ఉన్నది. ఆయన కవిత్వమంతా ఆ మధ్య పుస్తక రూపంలో వచ్చింది. ఆ సంకలనం పేరు 'ఆమె నా బొమ్మ'. అంతరంగం లోతులను సైదాచారి తన కవిత్వంలో ఆవిష్కరించాడు. తనను ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కుంటున్నాడు. ఈ అన్వేషణకు స్త్రీ కేంద్ర బిందువు. అది ఒక్కొక్కసారి కొంత అశ్లీలంగానూ వ్యక్తమైంది. అయితే సామాజిక నిర్మాణ సూత్రాలను బద్ధలు కొట్టే కవి చేయాల్సిన పనే ఇది. సమాజంలోని హిపోక్రసీ మీద అతని కవిత్వ దండయాత్ర '' ఇంట్లో దువ్వుకుని/బయటికెళ్లేటప్పుడు చెరుపుకుందాం'' (విశృంఖల, పేజీ-37) అనే కవి గోడలను బద్ధలు కొట్టగలమనే ధీమాను ఇస్తాడు. అంతరంగాలను బుజ్జగించి అంేా సవ్యంగా వుందని బీరాలు పలికే వాళ్ల మీద అస్త్రాలు వదిలాడీ కవి. పల్లంలోకి పడిపోవడం ప్రవహించడమనుకుంటాం/మనవన్నీ వఠ్ఠి జలపాతాల నిస్సహాయతలు' అని ప్రకటిస్తున్నాడు.

నిజానికి ఏ వదమూ నిషిద్దం కాదు. అలాగే భావనా నిషిద్ధం కాదు. అత్యవసరమైనప్పుడు, అవసరం లేనప్పుడు ఎంతటి నీతిపదమైన నిషిద్ధమే. సైదాచారి కవిత్వం ఎక్కడా ఒక పదం తీసి మరో పదం వేయడానికి వీల్లేనంతగా చిక్కగా వుంది. ఆగతంతకుడూ నేనూ ఒక దేహంలో ప్రవేశించాం/ వాడి నెత్తుటి కణాల వీర్యపు కుప్పల్లో సమాధవుతున్నాను/ దు:ఖం రహస్యం రహస్యంగానే వుండనీ/అన్నీ ఎంగిలి గానీ దు:ఖం తప్ప'' (ఎంగిలి, పేజీ- 22) అని తనను తాను ఓదార్చుకుంటున్నాడు. సైదాచారి కలుషితం కాని ప్రేమను వాంఛిస్తున్నాడు. దేహం మలినమైనా (నైతిక దృష్టితో చూస్తే) ఫరవాలేదంటున్నాడు.

సైదాచారి తన వృత్తి శిథిలమైన తీరును చిత్రిక కట్టి మన కళ్ళ ముందుంచే కవిత 'మహా ముద్ర'. అన్వేషణకు అంతు దొరక్క విలవిల్లాడే కవి ఈ కవితలో కనిపిస్తాడు. 'ఇమోషన్‌ రీకలెక్టడ్‌ ఇన్‌ ట్రాంక్విలిటీ' అంటే ఏమిటో సైదాచారి కవిత్వాన్ని చదివి తెలుసుకోవాల్సిందే. సైదాచారి కవిత్వం చదివి ఆహ్వానించడానికి ధైర్యం కావాలి. ధైర్యం తెచ్చుకోవాలన్నా చదవాల్సిందే. నంగి నంగి మాటలకు, తెరచాటు వ్యవహారాలకు కాలం చెల్లిన రోజు ఈ కవిత్వం అవసరం వుండదు. మనిషి ఆత్మ ఒక్కటే నిజమై, మిగతావన్నీ అబద్ధాలైన రోజు కూడా ఈ కవిత్వం అవసరం లేదు.

అబద్ధాలన్నీ నిజాలుగా ఊరేగుతున్నప్పుడు సైదాచారి కవిత్వం దాని గుట్టు విప్పాల్సిందే. డీకనస్ట్రక్షన్‌ ఎంత అవసరమో కూడా ఈ కవిత్వం అవసరం లేదు. దేన్ని బద్ధలు కొట్టకుండా కొత్త భవంతి కడుతామనే వాళ్ళతోనే పేచీ అంతా. బయటకు కొత్తగా కనిపించినా లోపలంతా అదే పాత వాసన వేయదూ!

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
Aila Sydachari, a different poet in Telugu literature. His poetry roams around woman for true love.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X