విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశ్వనాథ, జాషువా సరసన సినారె

By Pratap
|
Google Oneindia TeluguNews

CNR statue at Visakha along with Viswanatha
విశాఖపట్నం: తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, కవికోకిల, నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి విగ్రహాలను అతిథులు విశాఖపట్నంలో ఆవిష్కరించారు. లోకనాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఇక్కడి రామకృష్ణ సాగర తీరంలో ఈ ముగ్గురు సాహితీ దిగ్గజాల విగ్రహాల ఆవిష్కరణ జరిగింది.

పార్లమెంటు సభ్యుడు జెడి.శీలం, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బాలమోహన్‌దాస్, జాషువా అల్లుడు డాక్టర్ లవణం, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయరాజ్ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణకు ముందు గజల్ శ్రీనివాస్ సినారె గజల్స్‌ ఆలపించారు.

ముగ్గురు మహనీయులు తమ అసమాన రచనలతో ఆంధ్రుల గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేశారని పార్లమెంటు సభ్యుడు జెడి శీలం అన్నారు. పుట్టరాని కులంలో పుట్టినందుకే తనకు రావాల్సిన గౌరవం రాలేదని జాషువా అనేక సందర్భాలలో బాధపడ్డారని అన్నారు. గుణాత్మకతతో అసమానలను తొలగించిన కవి జాషువా అన్నారు. ఎయు, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో జాషువా పీఠాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల జ్ఞానపీఠ్ అవార్డు పొందిన రావూరి భరద్వాజ ఆంధ్రులు గర్వించదగిన వ్యక్తి అని అన్నారు. విగ్రహాలు ఆవిష్కరించిన ఆవరణలో సాహితీవేదిక ఏర్పాటుకు ఎంపి నిధుల నుండి రూ.3 లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు.

కళాబంధు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - తెలుగుజాతి గర్వించదగిన ఈ ముగ్గురు త్రిమూర్తి సమానులని అన్నారు. సినారె తన గరువని, మంచితనం, విశాలహృదయుడని అన్నారు. సాహితీ కళావేదిక ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. ఆచార్య బాలమోహన్‌దాస్ మాట్లాడుతూ తెలుగు సాహిత్య రచనల్లో ఘనులని అన్నారు. ఉపాధ్యాయులైన వీర విలక్షణమైన రచనలతో ఖ్యాతినార్జించినట్టు తెలిపారు.

లవణం మాట్లాడుతూ విశ్వనాథ తండ్రి వంటి వారైతే, జాషువా మామని, సినారే సోదర సమానులని అన్నారు. జాషువా బతికుంటే తనకంటే ముందు జ్ఞానపీఠ్ వచ్చేదని అనే వారన్నారు. యార్లగడ్డ మాట్లాడుతూ రావూరి భరద్వాజ సభకు హాజరుకావాల్సి ఉందని, స్వల్ప అనారోగ్యం కారణంగా రాలేకపోయారని తెలిపారు. ఇదే ప్రాంగణంలో రావూరి భరద్వాజ విగ్రహాన్ని అనతికాలంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

English summary
Statues of Viswanatha Sathyanarayana, Jashuva and C Narayana Reddy have been installed at Visakhapatna,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X