• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అందరి కథలు బేచారే: స్కైబాబ తత్వం

|

స్కైబాబా తెలుగు సాహిత్యం లో పరిచయం అక్కరలేని పేరు. ఒక్కమాటలో చెప్పాలంటే కవిగా ,జర్నలిస్ట్ గా ,కథకుడిగా ,ఉద్యమ కారుడిగా ,అస్తిత్వ ఉద్యమాల గోతుకగా నిండా చైతన్యపు ప్రవాహమై పరుచుకున్న సింగిడి స్కైబాబా మనిషిని మనిషిగా ప్రేమించే సూఫీ స్కైబాబా సాహిత్యంలో తన మార్క్ ను అప్రతిహతంగా కొనసాగిస్తున్న స్కై కలం నుండి ఇటీవల జాలువారిన కథలు బేచారే -భగ్న ప్రేమ కథలు.

రచయిత పేరును బట్టి ఇవి ముస్లిం కథలు అనే విషయం చూచాయగా స్పష్టమవుతున్నప్పటికీ కొంచం బాధ్యతగా చదివితే తెలుస్తుంది...... కేవలం ఇది ముస్లిం యువతీ యువకుల ప్రేమ కథలే కావని భగ్నమైన ప్రతి హృదయపు బింబ ప్రతిబింబాలని. ఈ కథల్లో ప్రేమే కాదు ప్రేమతో ముడి పడి ఉన్న అనేక విషయాలను అదే విధంగా సమాజపు అసహజత్వాలను ,సమాజం నిండా పరుచుకున్న సన్నని పొరలను ,తెరలను అత్యంత సహజంగా చెప్పగలిగారు స్కైబాబ.

ముస్లిం సమాజపు గొంతుక నుండి ఈ కథలు వెల్లువడినప్పటికీ కథలను కాస్త జాగ్రత్తగా చదివి ఇంకాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది ఈ కథలు గొప్ప మానవీయ కళాఖండాలని. ఈ కథల్లోని అక్షరం అక్షరం తెలుపుతుంది మనిషిని మనిషిగా ప్రేమించే ఈ నేల మనుషుల సూఫీ తత్వాన్ని. ఇంకాస్త ముందుకెళ్తే ఈ కథల్లో కులం మతం ప్రాంతం వర్గం ఆర్ధికం పురుషత్వం... వీటి అన్నిటి కారణంగా కోల్పోయిన జీవితపు సఫలీకృత హృదయాల సంభాషణ గొప్పగా దాగుంది అనేది స్పష్టమవుతుంది.

ఒక వైపు స్కైబాబ కథలు ఇలా...

ఒక వైపు స్కైబాబ కథలు ఇలా...

స్కైబాబ కథలు ఒక వైపు కులం మతం ప్రాంతం జెండర్ ఎకనామిలాతోపాటు గ్లోబలైజ్ బతుకులను వస్తువుగా చూపెడుతూ మరోవైపు అతీతంగా సాగే విశ్వ ప్రేమ తత్వపు భావుకతను రంగరించి మన మనసులను మెలి మెడుతూ మనల్ని ఆలోచింప చేస్తూనే ఉంటాయి కొన్ని కథలు గత స్ముతుల్లోకి మనల్ని వెంట తీసుకుపోతుండగా మరి కొన్ని చక్కిలి గిలి పెడుతూనే కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాయి . మొత్తం ముస్లిం వాద రచయిత కోణం నుండి చూసి ఒక పక్కన నెట్టి వేయటం సరికాదని ఒక్కొక్క కథని చదువుతుంటే బోధపడుతుంది కాస్త మనసు పెట్టి ఇంకాస్త నిశిత దృష్టితో పరిశీలిస్తే ఇవి ఒక నిర్దిష్ట సమాజపు భావనలు అని గిరిగీసుకోవటం పొరపాటు అవుతుందని తెలిసిపోతుంది .ఒక్క అడుగు ముందుకేసి కాస్తంత విశాలంగా ఆలోచిస్తే అర్ధమవుతుంది ఇవి '' ప్రేమ గుండా ప్రవహించి భారతీయ సమాజాన్ని ఒడిసి పట్టిన అందరి కథలని'' .

స్కైబాబ బేచారే కథల గురించి...

స్కైబాబ బేచారే కథల గురించి...

ఒక్క మాటలో బేచారే కథల గురించి చెప్పవలసి వస్తే ఇవి అత్యంత నిజాయితీ గల కథలు . ఈ కథలను కులం కొంచం చూపుతో మతం ఛాందసంతో చూస్తే కథల్లా కనిపించవు . ఈ కథలను చావటానికి చదివి అర్థం చేసుకోవటానికి మనిషితనం కావాలి . గిరిగీసుకుని బ్రతకాని మానవత్వపు పరిమళం కావాలి . అంన్నింటికంటే మిన్నగా కాస్త సున్నిత హృదయం కావాలి . వాస్తవానికి రచయిత అనుభవపూర్వక విషయాలే బేచారే కథలుగా మలచబడ్డట్టు స్పష్టంగా తెలుస్తుంది.. ఈ కథల్లో కనిపించే మరొక గొప్ప అంశం ... రచయిత ఎక్కడా గిరిగీసుకుని కూసున్నట్లు కనిపడదు. మనువాదపు మూఢత్వాల నుండి మైనారిటీ మత సాంస్కృతిక చిహ్నం అయిన బుర్కా వరకు తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు స్కై.

ఇంకా ఇలా స్కై కథలు...

ఇంకా ఇలా స్కై కథలు...

ఇంకా దళితుల్లోనూ కులవ్యవస్థ ఎంత బలంగా ఉందొ జమ్మి కథల్లో అత్యంత సహజంగా చెప్పారు .. మనువాద సమాజంలో సగటు ముస్లిం ఎదుర్కునే వివక్షను సున్నితంగా చెబుతూనే ఎటువంటి పక్షపాతం లేకుండా ముస్లిం సమాజాల్లో భావజాల పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇర్మొహమాటంగా అక్షరీకరించారు స్కై ఏక్ నయా ఖిడికి కథలో నఖాబ్ (బుర్క/పరదా)పద్ధతి తొలగించాలని సాహిర్ పాత్ర ద్వారా చెప్పించటం నుండి మొహబ్బత్ 1724 హిజ్రీ కథలో బుర్క కేంద్రంగానే కథంతా తిరగటం గమనిస్తే ముస్లిం స్త్రీలు పరదాల్లో బంధించబడుతున్నారనే బాధను వ్యక్తం చేస్తూ ఈ పద్దతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునివ్వడం రచయితను సాటి మనుష్యుల స్వేచ్ఛ జీవితం కోసం ఆరాటపడే హక్కుల యోధుడిగా నిలబెడుతుంది.. అయితే రచయిత ఎక్కడా మతాల విషయంలో పక్షపాతం చూపించకపోవడం అన్ని మతాల్లో ఉన్న అసమానతలను ఎత్తి చూపటం... మతం కన్నా మనిషి ముఖ్యమనే ఆయన సూఫీత్వపు నమ్మకానికి నిదర్శనం గా నిలుస్తుంది...

స్కై సర్కస్ ఫీట్లు చేయలేదు

స్కై సర్కస్ ఫీట్లు చేయలేదు

స్కై కథల్లో ఉన్న గొప్ప లక్షణంనమేమంటే రచయిత వీటిని ఏ సందర్భంలోను సర్కస్ ఫీట్లు చేయలేదు... హంగు ఆర్భాటాలు ,రంగులు అద్దలేదు .. ఎక్కడా ఏ విషయాన్ని గురించి తాత్పర్యాలు ఇవ్వలేదు. తాను చెప్పదల్చుకున్న విషయం ...,రాయదలచుకున్న వాక్యం సూటిగా రాసేసాడు .. ఎక్కడా ఎక్స్ట్రా వాక్యం లేదు . మితిమీరిన ప్రజంటేషనూ లేదు ... సాదాసీదా వాక్యాలతో మట్టిమనుష్యుల సహజాతి సహజమైన భాషతో ప్రతి గుండెలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ... యుక్త వయస్సులో ఉన్న సలీమా పాత్ర నుండి అరవై ఏండ్లు దాటినా షాహిదా పాత్ర వరకు ప్రతి పాత్ర విలక్షణమే... ప్రతీ పాత్ర గుండెలో స్కై ప్రేమ పూలు నాటి మన గుండెలకు గొప్పనైన హాయినిస్తాడు .ఈ కథల నిండా ముస్లిం స్త్రీ పురుషులే కాకుండా ముస్లిం సమాజంతో మమేకమవుతున్న మమేకం కానీ ,ముస్లిం అంటేనే దూరం జరిగే అనేకానేక పాత్రలున్నాయి.. అయితే రచయిత ఎక్కడా కూడా ఇతర సమూహాల మీద నిందారోపణలు చేయలేదు ముస్లింల పట్ల సభ్యసమాజం అవలంబించే విధానాన్ని అత్యంయంత సహజంగా కథల్లో చెప్పి మనల్ని ఆలోచింప చేసాడు .

ప్రేమరాహిత్యం స్థితిని చెప్పారు...

ప్రేమరాహిత్యం స్థితిని చెప్పారు...

ముస్లిం సమాజాల్లో కూడా ఇతర సమాజాల్లాగే ఉన్న ప్రేమ రాహిత్యపు స్థితిని ,స్టేటస్ ,ఆర్ధిక పరమైన అంశాలన్నిటినీ చెబుతూనే ,మిగత సమాజాల కన్నా ఎక్కువగా ముస్లిం స్త్రీలు ఎదుర్కుంటున్న స్వేచ్ఛరాహిత్యపు అంశాలు , వస్త్రధారణ ,గిరిగీసుకున్న జీవితపు స్థితిలో కోల్పోతున్న తనాన్ని చూపెట్టే ప్రేమ అన్ని హద్దులను ,సరిహద్దులను చెరిపివేయగలదనే బ్రాడీసెన్సును ప్రదర్శిస్తాడు . పైపైన ప్రేమకు కులం మతం లేదన్నప్పటికీ వాస్తవ రూపంలో కులం ప్రాక్టీకాలాటిని చెప్పకనే చెపుతాడు . లోహం కథలో పద్మజ సుల్తాన్ ని ఎంతగా ప్రేమించినప్పటికీ ఓ రోజు సుల్తాన్ ఇంటికి వచ్చినప్పుడు సుల్తాన్ ఇల్లును చూసి ఫొటోల్లో వాళ్ళ వేషధారణను చూసి పారేశానయ్యె వాస్తవ స్థితిని మన కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు స్కై అన్నిటికంటే బేచారే కథల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అందులోని బాషా గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి నేల విడిచి సాము చేయని మట్టి మనుషుల బాష ప్రతి కథలో ఉంది మన నేటివిటీ గుబాళింపును వెదజల్లుతాయి ప్రతి పాత్ర తన మూలపు భాషనే మాట్లాడుతూ మనతో ముఖాముఖీ సంభాషిస్తున్నట్టుగా తోస్తుంది . బాష విషయంలో స్కై తన మార్కును ప్రదర్శించాడు ఈ కథల్లో ...

కథల్లో మతసామరస్యపు విలువలు..

కథల్లో మతసామరస్యపు విలువలు..

ఇంకా ఈ కథల్లో జమ్మి ఉర్సు కథల్లో మత సామరస్యపు విలువలు కనిపిస్తాయి . గ్రామాల్లో ముస్లింలు హిందువులు కలిసికట్టుగా అన్ని రకాల పండుగలని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నా విషయాన్నీ చెబుతూనే గ్రామాల్లో విస్తరిస్తున్న మనువాద మాత ప్రచార సంస్థలు, అదే విధంగా సూఫీతత్వాన్ని బోధించే దర్గాలకు పోవొద్దని అక్కడ సిజ్జా చెయ్యొద్దని చెబుతున్న మౌలాలను ఉపదేశాలు తదితర అంశాలు ఒక మనిషి మరొక మనిషి ఒక మతానికి ఒక మతం ఆలంబనగా బతికే ఆనందకరమైన పరిస్థితులలో ఇటు జామాతలు అటు హిందుత్వ సంస్థలు ముస్లిమేతరులు ముస్లింలు అనే భేదభావాన్ని ఏర్పారుస్తున్నాయని చివరికి ఈ పరిస్థితి ఎటు దాపురిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తాడు రచయిత. మొత్తంగా హిందువులు , ముస్లింలు కలిసిపోయే సూఫీతత్వాన్ని ప్రేమించి ఆ తత్వం అలాగే కొనసాగాలనే అభిలాషను వ్యక్తపరుస్తాడు రచయిత స్కై.

పదకొండు కథల్లో ... జుబేదా ,సలిమా ,పద్మజ

పదకొండు కథల్లో ... జుబేదా ,సలిమా ,పద్మజ

సల్మా,రుక్సానా,సుల్తానా,అతియా,వహిదా,షాహిదాలు ,జబీనాలు బేచారే అయిన స్త్రీలు . మునీర్ ,సుల్తాన్, సైదులు ,జాని ,ఉర్సు కథలో నాయకుడు , షఫీ , సాహిర్, నిసార్,యూసుఫ్ , మహబూబ్ , అమీర్లు బేచారే అయిన పురుషులు. మరీ ముక్యంగా ముస్లిం స్త్రీలు ఎదుర్కుంటున్న స్వేచా రాహిత్యం అనేకానేకమైన ఇబ్బందులు అందునా స్వేచ్చ లేక కేవలం పిల్లను కనే యంత్రల్లగా మారిన బేచారే ల జీవితాలను కంటతడి పెట్టించారు స్కై .. బేచారే లో 11కథలు ఒక్కొక్క కథ ఒక్కో మాస్టర్ పీస్ . ప్రతి కథ పాటకుల హృదయాలను గెలిచే కథే . ఈ కథల్లో విద్య , బతుకుదెరువు, ఉత్సవాలు , ఉద్వేగాలు ,పేదరికం , నమ్మకాలు .స్టేటస్, ఉద్యమాలు, ఆహారపు, అలవాట్లు, ఆదర్శభావాలు , ఆరాధన ,కుల,మత అంతరాలు ... ఒక్కటేమిటి సమాజంలో ఉన్న దాదాపు అన్ని అంశాలను చర్చకు పెట్టినా అన్ని కథల్లో హృదయ సంబాషణ ద్వారానే ఆ విషయాన్నీ చర్చకు పెట్టడం ఎక్కువగా కనపడుతుంది . అయితే చాలా కథల్లో ఆర్దికపరమైన అంశాలతో ,జీవితంలో సెటిల్ కాకపోవతంలాంటి కారణాలు బేచారేలుగా మారటానికి కారణాలుగా కనిపిస్తూ ఉండటం ముక్యమైన అంశం . అయితే కారణాలు ఏవైనప్పటికీ బెచారెల హృదయ భాష ప్రతి సందర్బంలో వెచ్చగా మనల్ని తాకుతూనే ఉంటుంది .

స్కై కథల్లో పాత్రలు పాత్రల్లా కాకుండా....

స్కై కథల్లో పాత్రలు పాత్రల్లా కాకుండా....

ప్రతి కథలో పాత్రలు కేవలం పాత్రలా కాకుండా నిజ జీవిత ప్రవర్తన కలిగి ఉంది ఆలోచింపజేస్తాయి . ప్రతి పాత్ర సహజాతి సహజంగానే ప్రవర్తిస్తుంది గాని భిన్నంగా ప్రవర్తించదు..కథల్లో విపరీతమైన ఎత్తుగడలు లేకుండా సాఫ్సీదాగా ప్రవర్తించే పాత్రలే అన్ని కుడా . పాతకున్ని మనసు పోరల్లోనుండి సరాసరి మెదడు పొరల్లోకి తీసుకెళ్ళి ఆలోచింపజేస్తుంది గానీ విస్మయానికి గురి చేయదు బేచారే లోని ఏ పాత్ర , ఏ కథ..

స్కై కథల గురించి మల్లీశ్వరి ఇలా...

స్కై కథల గురించి మల్లీశ్వరి ఇలా...

ఈ కథలకు ముందు మాట రాసిన కె .ఎన్. మల్లీశ్వరి గారి కొన్ని విలువైన మాటలు ఇక్కడ పేర్కొనటం సముచితంగా ఉంటుంది ... ''ప్రేమలకు సంబంధించిన వైఫల్యాల్లో అధిక శాతం స్త్రీలపై భౌతిక మానసిక హింసలుగా రూపాంతరం చెందుతాయి . ఆ ఊహకే ఆసాకారమివ్వని మానవీయ దుఃఖం గా తీర్చిదిద్దటం వాళ్ళ సున్నితత్వాన్ని మిగుల్చుకోగలిగాయి బేచారే కథలు'' ''అన్ని వర్గాల్లోనూ విఫల ప్రేమలు ఉంటూనే ఉంటాయి .అయితే సగటు పాఠక సమాజానికి అంతగా పరిచయం లేని ముస్లిం సమాజాన్ని నేపథ్యంగా తీసుకోవటం వల్ల ఈ కథల్లో ప్రెష్ నెస్ ఉంది . తక్కువ కులం వారయిన స్త్రీ పురుషులు ,స్త్రీలైనందువల్ల నిస్సహాయులైన యువతులు ప్రధాన పాత్రలుగా ఉన్నారు.''

అవి భగ్నప్రేమికుల కథలే కాదు..

అవి భగ్నప్రేమికుల కథలే కాదు..

మొత్తంగా బేచారే కథల సంపుటిలో చాలా పాత్రలు భగ్న ప్రేమికులు కావచ్చు ...కానీ భావాల తాలూకూ ఆలోచనా విధానం మాత్రం సఫలీకృత ప్రేమనే బోధిస్తున్నాయి .. మొత్తం కథల్లో సుమారుగా అన్ని పాత్రలు కోల్పోయినతనాన్ని కలిగి ఉన్నప్పటికీ తన నుండి దూరం జరిగిన వ్యక్తుల గురించి కానీయండి ...లేదా తామే ఎదుటి వ్యక్తుల నుండి దూరం జరిగిన స్థితి కానీయండి ...సందర్భం ,సంఘటనలు ఏవైనా ప్రతి పాత్ర హుందాగా ప్రవర్తించి... పొందటమే కాదు కోల్పోవటంలోనూ అద్భుతమైన ప్రేమ దాగుందనే సత్యాన్ని బోధిస్తున్నాయి.. పొందటం కోల్పోవటం కేవలం సంఘటనలేనని ప్రేమే శాశ్వతం అని బోధిస్తున్నాయి ఈ కథలు . బేచారే లో పల్లీయుల జాతరలో గ్రామాల్లో మొదలయ్యే ప్రేమ దగ్గర నుండి గ్లోబలైజేషన్ ఎరాలో సాగుతున్న ఆధునిక తరపు ఫేస్ బుక్ ప్రేమల వరకు అన్ని కథల్లో ఒక ఫీల్ గుడ్ ఉంది .ఒక మానవీయ హృదయ స్పందనుంది. ఎక్కడా ప్రతీకారేచ్ఛ లేకుండా సాగే రియల్ లైఫ్ కం మెచ్యుర్డ్ హ్యుమానిస్టిక్ లవ్ స్టోరీస్ ఇవి ...

అస్తిత్వ ఉద్యమామలూ.. హక్కుల పోరాటాలూ..

అస్తిత్వ ఉద్యమామలూ.. హక్కుల పోరాటాలూ..

అస్తిత్వ ఉద్యమాలు ,హక్కుల పోరాటాలు , అణిచివేతలు ,మతోన్మాదం, వేధింపులు తమ సాహిత్యంలో చర్చకు పెట్టె సాహిత్యకారులు ఇవేం కథలబ్బా ప్రేమ కథలు అని కొట్టిపారేయవచ్చు. నిజానికి ఏ ఉద్యమానికైనా మూల సూత్రం మనిషి మనిషిగా ప్రేమించడని తెలిపే అప్పిలే కదా . అస్తిత్వం ఉద్యమకారుడైన స్కైబాబా బేచారే లో చెబుతున్నది అదే .. కానీ టెక్నీకల్ వేరు . ఇప్పటిదాకా చదివిన కథల శైలికి భిన్నంగా ప్రేమను ఆలంబనగా చేసుకుని వ్యవస్థీకృతమైన ఎన్నో విషయాలను చెప్పారు స్కైబాబా .ఇదొక గొప్ప టెక్నీక్ . ఈ విషయంలో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యారు స్కై బేచారే కథలతో .రొటీన్ ఉద్యమ కథలకు అలవాటు పడిన వాళ్ళు అబ్బే ప్రేమకథలు మన వల్ల కాదండి అని గిరిగీసుకోకుండా ఒక్కసారి బెచారే ని తడమండి... ఒక్కసారిగా జీవితపు ప్రేమతత్వం అందం గా కళ్ళ ముందు పరుచుకుంటుంది....

డా . చింతం ప్రవీణ్ కుమార్

English summary
Dr Chintham Praveen Kumar reviews Sky Baba's Bechare short stories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X