వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ రంగ్ మహోత్సవ్‌-2017లో అంతర్జాతీయ నాటకోత్సవం..

దేశంలో నాటక రంగ అభివృద్దికి ఒక విశిష్టమైన వేదికను ఏర్పాటు చేసే ఉన్నతాశయంతో తెలంగా భాషా సాంస్కృతిక శాఖ ఈ ఉత్సవాన్ని ఆరంభించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జాతీయ నాటక శాఖ, న్యూఢిల్లీ మరియు తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆద్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 19వ భారత్ రంగ్ మహోత్సవ్ - 2017లో సమాంతర అంతర్జాతీయ నాటకోత్సవం నిర్వహించబోతున్నారు.

దక్షిణభారత దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ఈ అంతర్జాతీయ నాటకోత్సవాలను రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు సాII 7:00 గంIIలకు. ఈ నాటకోత్సవం 11
ఫిబ్రవరి, 2017 నుండి - 16 ఫిబ్రవరి, 2017 వరకూ 6 రోజుల పాటు జరుగుతుంది.
ప్రదర్శించే 6 నాటకాల్లో 4 భారతీయ నాటకాలు, యు.కె. మరియు టర్కీ ల నుండి 2 అంతర్జాతీయ నాటకాలు ఉన్నాయి.

ఈ నాటకోత్సవం ద్వారా వినోదం, విద్య, అభివృద్ధి, వికాసం లను ఈ నాటకాల ప్రదర్శనల్లో నాటక ప్రియులందరూ ఆస్వాదించబోతున్నారు.

* * *

రేపు (11.02.2017) తొలిరోజు నాటకోత్సవంలో...
తెలంగాణ రాష్ట్రం నుంచి గుస్సాడి కళాకారులు ప్రదర్శన చేయనున్నారు.

International drama festival in Bharathi rang mahotsav 2017

నాటకం: LOVE YOUR NATURE,

ప్లే రైట్ మరియు దర్శకులు: Mr. Yumnam Sadananda Singh,
Group: Kanglei Mime Theatre Repertory, Imphal
Language: Non - Verbal.

ఈ కార్యక్రమానికి తొలిరోజు ముఖ్య అతిథిగా శ్రీమతి కల్వకుంట్ల కవిత, MP గారు, శ్రీ నాగేశ్వర రావు (Eminent Theatre Personality), ప్రొ. సురేష్ భరద్వాజ్ (NSD), గిరిజన, పర్యాటక మరియు సాంస్కృతికాభివృద్ధి మాత్యులు శ్రీ అజ్మీరా చందులాల్ గారు, ప్రొ.వామన్ కేంద్రే డైరెక్టర్ NSD న్యూఢిల్లీ గారు, శ్రీ బసవ లింగయ్య NSD బంగళూర్ రీజినల్ డైరెక్టర్ హాజరు కానున్నారు.

* * *
జాతీయ నాటక శాల సౌజన్యంతో 19వ భారత్ రంగ్ మహోత్సవ్-2017 నిర్వహణలో సమాంతర అంతర్జాతీయ నాటకోత్సవం - హైదారాబాద్ నగర నాటక ప్రియులకు మహోత్సవం నిర్వహిస్తున్నారు.

"భారత్ రంగ్ మహోత్సవ్ ద్వారా భారత్ లోనూ, అంతర్జాతీయంగా ఉన్న రంగస్థల కళాకారులందరిని ఒక్క తాటి మీదకు తీసుకువస్తోంది. జాతీయ నాటక శాలకు తనదైన ప్రత్యేకత ఉంది.
భారతీయ ఆత్మను నాటక కళ ద్వారా ప్రపంచ వేదిక మీద ఆవిష్కరిస్తోంది. ఈ యేటి ప్రదర్శనల్లో శాస్త్రీయ, భారతీయ సంస్కృతి, జానపదం, ఆధునిక నాటకాలు ప్రదర్శితమౌతున్నాయ్. భారత్ రంగ్ మహోత్సవ్ - ఆధునిక నాటకాలనే కాకుండా గ్రామీణ, జానపద, శాస్త్రీయ మరియు సంప్రదాయ నాటక రంగాన్ని సమాదరిస్తోంది.

జాతీయ, అంతర్జాతీయ విజ్ఞాన మరియు సంస్కృతుల కలయికతో సాటిలేని విధంగా నాటక మరియు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తున్నాం.

నాటక రంగం ఉనికి ఉన్న ప్రతి చోటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తాం" అని ప్రొ. వమన్ కాండ్రే, సంచాలకులు, జాతీయ నాటకశాల వారు అంటున్నారు.

భారత్ రంగ్ మహోత్సవ్:

ఈ భారత్ రంగ్ మహోత్సవ్ రెండు దశాబ్దాల నుండీ నిర్వహించబడుతోంది. జాతీయ నాటక శాల (National School of Drama) దేశంలో నాటక రంగ అభివృద్దికి ఒక విశిష్టమైన వేదికను ఏర్పాటు చేసే ఉన్నతాశయంతో ఈ ఉత్సవాన్ని ఆరంభించింది.

నాటక ప్రదర్శనలు, పరస్పర సాహచర్యాన్ని కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన సృజనాత్మక నాటక రంగ కళాకారుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న జాతీయ ఉత్సవం ఇది. ఆసియా ఖండంలో అతి పెద్ద నాటకోత్సవంగా ప్రపంచ నాటక సంస్థలు గుర్తించిన ఖ్యాతిని భారత్ రంగ్ మహోత్సవ్ సాధించింది.

ఈ ఉత్సవంలో ప్రదర్శనలు, నిర్మాణాలు, ఆయా నాటక దర్శకులతో, కళాకారులతో పరస్పర పరిచయాలు, అద్భుతమైన వేదికలు, బహిరంగ చర్చలు, సమావేశాలు కూడా ఏర్పాటు చేయబడుతున్నై. మరింత సమాచారం కోసం http://19brm.nsd.gov.in వెబ్ సైట్ ని చూడవచ్చు,

జాతీయ నాటక శాల (National School of Drama):

జాతీయ నాటక శాల (National School of Drama) ప్రపంచంలోని మొట్టమొదటి నాటక శిక్షణా సంస్థల్లో ఒకటి. భారత దేశంలో అద్వితీయమైన నాటకాభివృద్ధి సంస్థ ఇది. 1959లో సంగీత నాటక అకాడమీకి అనుబంధంగా స్థాపించబడిన సంస్థల్లో ప్రముఖమైనది.

1975లో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ XXI-1860 ప్రకారం జాతీయ నాటక శాల, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ద్వారా స్వతంత్ర వ్యవస్థగా ప్రకటించబడింది. నాటక రంగానికి సంబంధించిన విశేషమైన, విపులంగా, లోతైన శిక్షణ ఇవ్వబడుతుంది.

శిక్షణలో భాగంగా విద్యార్థులు నాటకాలకు రూపకల్పన చెయ్యాలి, జనసామాన్యం ఎదుట ప్రదర్శించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం http://nsd.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

భాషా సాంస్కృతిక శాఖ - తెలంగాణ ప్రభుత్వం
కళాభవన్, రవీంధ్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్,

(మామిడి హరికృష్ణ)
సంచాలకులు.

English summary
Telangana language and cultural department Director Mamidi Harikrishna made a set up for international drama festival in Bharat Rang Mahotsav 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X