వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడిని హీరోగా ప్రకటించిన కందుకూరి రమేష్ బాబుతో ఇంటర్వ్యూ..

మై పాయింట్ ఈజ్ డ్రమాటిక్. లేకపోతే కోళ్ల మంగారం మీద నేను రాసిన బుక్.. కోర్టుకు పోవుడేంది? ఆ బుక్ వల్ల మంగారం కుటుంబానికి 3లక్షలు పరిహారం అందుడేంది.

|
Google Oneindia TeluguNews

కెమెరా 'క్లిక్‌'కు.. కలం పాళీకి.. మధ్య నడిచొచ్చే వంతెనలా అతనో సామాన్యుడిని కల గన్నాడు. సహజత్వాన్ని-సామాన్యతను దర్శించలేని ఆధునికతను అతను ఈసడించుకున్నాడు. అందుకే.. ఏకంగా సామాన్యుడిని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని.. నిత్యం ఓ ఉత్సవ ఊరేగింపుతో జీవన వాస్తవికతను మరింత దగ్గరగా దర్శించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆ ప్రయాణంలో ఇప్పుడాయన 'ఎండపొడ'లో సేదతీరుతున్నాడు. ఆయనే కందుకూరి రమేష్ బాబు. ఫోటోగ్రాఫర్‌గా, రచయితగా సామాన్యుడిని తన హీరోగా ప్రకటించుకున్న వ్యక్తి. సామాన్యతతోనే అటు ఛాయచిత్రానికి ఇటు రచనకు సరికొత్త భాష్యం చెప్పిన విశిష్టుడు.

పైకి సాధారణంగా కనిపించే రమేష్ బాబులో కొలబద్ద వాక్యలకు అందనంత నిగూఢ తాత్విక చింతన ఉంది. ఆయన ఛాయాచిత్రాల్లోపల్లోంచి.. ఆయన రచనల్లోని బిట్వీన్ ది లైన్స్ నుంచి ఆయన నడిచొచ్చిన మూలాల్ని ఒకసారి తాకివచ్చే ప్రయత్నమిది..

జనవరి 9న హైదారబాద్‌లోని మణికొండ రోడ్ లోని ఓయూ కాలనీలో రమేష్ బాబు 'ఎండపొడ' ఛాయాచిత్రాల పదర్శన నేపథ్యంలో చేసిన ఇంటర్వ్యూ ఇది. నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం 6.10గం. ప్రారంభమవుతుంది. తెలంగాణ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ప్రదర్శన ప్రారంభమవుతుంది.

కందుకూరి రమేష్ బాబు ఇంటర్వ్యూ:

నేపథ్యం:

నేపథ్యం:

ఆంధ్రప్రదేశ్ లో పుట్టాను.. 1972లో. ఇప్పటి తెలంగాణలో.. ఒక ఉమ్మడి రాజధాని నివాసిగా ఉన్నాను.

-ఏపీలో పుట్టాను అనగానే.. నాలో చిన్న బ్లాంక్ ఎక్స్‌ప్రెషన్..
అది గమనించి ఇలా అన్నారు..

ఒకనాడు తెలంగాణ లేదు కదా!.. ఏపీ ఉంది..
అప్పటి ఏపీలో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలుకా ఎల్లారెడ్డిపేటలో నేను పుట్టిన..(తలాడిస్తూ..).

మా నాన్న కిషన్.. టీచర్.. ఫోటోగ్రాఫర్ కూడా..
ఇప్పుడు నాకున్న స్పృహతో చెప్తున్నా.. తొలితరం ఫోటోగ్రాఫర్లలో మా నాన్న కూడా ఒకరు.

మాచర్ల-గొల్లపల్లి-ఎల్లారెడ్డిపేట.. ఈ మూడు ప్రాంతాల్లో మాకు ఫోటో స్టూడియోలు ఉండేవి. మాచర్ల-గొల్లపల్లిలో.. జ్యోతి ఫోటో స్టూడియో.. ఎల్లారెడ్డిపేటలో స్వాతి ఫోటో స్టూడియో ఉండేది.

సిరిసిల్ల నుంచి కామారెడ్డి పోయే బస్సెక్కితే మాచర్ల ఎక్స్ రోడ్ వద్ద.. రోడ్డుకు కొంచెం దూరంలో 'జ్యోతి చిత్రాయల' అనే బోర్డు కనిపించేది.

బస్సే అని ఎందుకు చెప్పినా అంటే..

'జీవితం అంటే కారు కిటికీలోంచి చూసింది కాదు..
బస్సు కిటికీలోంచి చూసిందే అసలైన జీవితం..'

.... .... .....

మా అమ్మ-నాన్నకు మేం నలుగురం. నేను, తమ్ముడు సురేష్, చెల్లెళ్లు.. జ్యోతి, స్వాతి..
చెల్లెళ్ల పేరు మీదనే ఫోటో స్టూడియోలు పెట్టినం.

మీ జీవితంలో మీకు ఫస్ట్ ఇన్‌స్పిరేషన్?

మీ జీవితంలో మీకు ఫస్ట్ ఇన్‌స్పిరేషన్?

లాభాపేక్ష లేకుండా ఫోటో స్టూడియో నడిపిండు మా నాన్న.. ఆరోజుల్లో!. మెయిన్ ఏందంటే.. అభిరుచితోనే.., మా చుట్టు పక్కల ప్రాంతాలల్ల అప్పుడెవరు మస్కట్ పోవాలన్న మా స్టూడియోలోనే ఫోటోలు దిగేది.

ఒక విషయం చెప్పాలె.. పున్నమికి మా ఊర్లో జాతర జరిగేది. ఆ జాతర జరిగినప్పుడు మా స్టూడియోలో కూడా జాతర వాతావరణం కనిపించేది. అక్కపల్లి, దుమ్మాల, గర్జనపల్లి..(ఇంకా గుర్తు చేసుకుంటూ..) నుంచి గిరిజన స్త్రీలు ఫోటో స్టూడియోకు వచ్చేది.

తెలుసు కదా!.. లంబాడా స్త్రీల వేశధారణ.. వచ్చేటప్పుడు వాళ్ల వేశధారణలోనే వచ్చేది.. స్టూడియోకి వచ్చాక మాత్రం మా అమ్మ చీరలు కట్టుకుని వాళ్లు ఫోటోలు దిగేది.

... ..

రేషన్ కార్డుల ఫోటోలు.. పాస్ పోర్టు ఫోటోలు.. కో-ఆపరేటివ్ సొసైటీలవి.. ఇవన్నీ తీసుకొచ్చి మా ఇంట్లో ఆరేస్తే.. వాటికింది నుంచి వంగిపోవాల్సి వచ్చేది. ఒకవిధంగా..'వంశీ తీయలేని సినిమాలయం మా ఇల్లు'

ఫోటోలను కెమికల్స్ వేసి కడగటం అంటే.. అంత చిన్నతనంలో మీకవి harmful అనిపించలేదా?

ఫోటోలను కెమికల్స్ వేసి కడగటం అంటే.. అంత చిన్నతనంలో మీకవి harmful అనిపించలేదా?

లేదు.. Harmful కాదు.. నా జీవితంలోనే ఆ పని ఉంది కదా!..

ఒక విషయం చెప్తా..

ఓ ఖాళీ బీర్సీసాలో.. దాని గొంతు దాకా వాటర్ పోసి.. మెటాల్, సోడియం, సల్ఫేట్,బ్రోమైడ్,హైడ్రో క్వినైన్.. ఈ ఐదు కెమికల్స్ ను అందులో కలిపేది. వాటి వాసన నాకు తగుల్తున్నప్పుడు.'కెమికల్ నా జీవితంలో భాగమైన వాసన.

-.(కుడి చేతి చూపుడు వేలును, బొటనవేలును.. రెండు వేళ్లను కలిపి సుతారంగా నిమురుతూ.. ముక్కుదాకా తీసుకొచ్చి.. ఓ నోస్టాల్జిక్ ఫీల్ లో ఇదంతా చెబుతూ వెళ్లారు..)

ఫోటోలు తీయడం.. వాటిని కడగడం.. ప్రింట్స్ వేసుకోవడం.. కట్ చేయడం.. పేర్లు రాసి ఓ కవర్ లో పెట్టి ఇవ్వడం.. ఇదంతా ఉండేదన్నట్టు!. అంతా మేమే చూసుకునేది.

గోపాల్ మామ, చారి అన్నా(జగిత్యాల), రెడ్డి ఇలా ముగ్గురూ మా స్టూడియోలనే పనిచేసేది. వాళ్లు మాకేమి బంధువులు కాకపోయినా.. సొంత కుటుంబం వ్యక్తుల లాగానే భావించేది. అందరికీ మా అమ్మే వండిపెట్టేది.

సో.. మీ జీవితంలో ఫోటోగ్రఫీ 'లైన్' తొలినుంచి కంటిన్యూ అవుతోంది.. అప్పటినుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే వచ్చిందా?, ఎక్కడైనా డ్రాప్ అవడం లాంటిదేమైనా?..

సో.. మీ జీవితంలో ఫోటోగ్రఫీ 'లైన్' తొలినుంచి కంటిన్యూ అవుతోంది.. అప్పటినుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే వచ్చిందా?, ఎక్కడైనా డ్రాప్ అవడం లాంటిదేమైనా?..

డిగ్రీ కోసం 1994లో నేను నిజామాబాద్ వెళ్లిన. సాహిత్యం వైపు మళ్లుతున్న దశ.. అప్పటికే డిజిటల్ కెమెరాలు వస్తున్నయ్.. మాకున్న మూడు ఫోటో స్టూడియోలు మూతపడ్డయ్.. అట్లా 1994 నుంచి 2010 దాకా మళ్లా నేను కెమెరా పట్టుకోలేదు.

కెమెరాతో మళ్లీ ఎప్పుడూ టచ్ లోకి వచ్చారు?

కెమెరాతో మళ్లీ ఎప్పుడూ టచ్ లోకి వచ్చారు?

సిరిసిల్లలో లెక్చరర్ గా.. తర్వాత ఓ స్వచ్చంద సంస్థలో సెక్రటరీగా కొన్నిరోజుల పనిచేసిన తర్వాత హైదరాబాద్‌కి రావడం జరిగింది. ఇక్కడికొచ్చాక.. సుప్రభాతం, ప్రజాతంత్ర, తేజటీవీ, ఈటీవీ, ఎన్టీవీ, వార్తల్లో పనిచేసిన తర్వాత.. కొన్ని రోజులు ఢిల్లీలో పనిచేసిన.

అప్పుడు వెళ్లిన ఫోటోగ్రాఫర్ రఘురాయ్ వద్దకు. ముందు నుంచి రచయిత కావాలన్న కోరిక ఉండేది. అట్లా సత్యం-శివం-సుందరం అనే పుస్తకం రాయడం కోసం ఆయన వద్దకు వెళ్లిన. అక్కడ కలిగింది నాలో స్పృహ..

అరే.. నేనూ గతంలో ఓ ఫోటోగ్రాఫర్‌నే కదా! అన్న ఆలోచన మళ్లా నాలో మొదలైందట్లా!..
అక్కడినుంచి..

జర్నలిస్టుగా కొనసాగడమా?
ఫోటోగ్రఫీకి మెరుగులు దిద్దుకుంటూ ముందుకెళ్లడమా? అన్న ప్రశ్న మొదలైన సమయంలో..

ఒక మనిషి( రఘురాయ్) ఆత్మకథ వింటూ నా యదార్థ ఆత్మకు పూర్వపు ఆత్మ ఎక్కడైతే నిలిచి ఉందో.. అక్కడికెళ్లి మళ్లీ దాన్ని నా చేతుల్లోకి తీసుకున్నా!. అదే కెమెరా.. అక్కడినుంచి పుట్టింది 'మై సిటీ మై పీపుల్'

నా ఇతివృత్తం.. 'సామాన్యుడు'. సామాన్యుడిని వైభవంగా దర్శించి రచనల్లో చెప్పాను. ఆ తర్వాత దాన్నే ఛాయాచిత్రాల్లో చెప్పాను.

ఫోటోగ్రఫీ అనేది మీ జీవితంలో తొలినుంచి ఉంది..

ఫోటోగ్రఫీ అనేది మీ జీవితంలో తొలినుంచి ఉంది..

కాబట్టి మీరో ఫోటోగ్రాఫర్ కావడంలో యాథృచ్చికమేమి లేకపోవచ్చనేది నాఫీల్..
మరి రచన ఎట్లా మొదలైంది?, అట్లాగే మీ తొలినాళ్ల సాహిత్యం గురించి కూడా కొంత..

తొలినాళ్లలో యండమూరి, మల్లాది వంటి సాంఘీక రచనలు
మార్లో, షేక్స్ స్పియర్ వంటి నాటక రచనలు
అలెన్ బో, రాబర్ట్, కీట్స్.. వంటివాళ్ల పొయెట్రీ
డీహెచ్ లారెన్స్ వంటివాళ్ల నవలలు చదివిన..

వీళ్లను ఎందుకు చదివినా అంటే?.. నేను రాయాలనుకున్న వాక్యం వీళ్లలో ఎవరైనా రాశారా?..

... ... ...

వాళ్లెవరూ నాకు తృప్తినివ్వలేదు. ఏదైనా వాక్యం చదివితే.. అక్కడింకో వాక్యం రాయబుద్దవుతుంది నాకు. అప్పుడనిపించింది.. ఛలో నేను రాస్తా బిడ్డా ఇగ!.. అని మనసులో అనుకున్నా. అందుకే.. పాత్రికేయుడిగా కూడా నేను కథనాలు రాసే పాత్రికేయాన్నే ఎంచుకున్నా.

నా రచనలు రెండు రకాలు..

1)పోట్రెయిట్స్-వ్యక్తిగత పరిచయ వ్యాసాలు
2)వ్యక్తిగత జీవితాన్ని ఎలాబ్రేట్ చేసేవి. జీవితాన్ని నవలగా విస్తరించి రాయడం..

రచయిత అంటే నా దృష్టిలో తనదైన సొంత వాక్యముండాలె భయ్యా..

అందుకే నా రాయడం కూడా.. మొదట్లో పత్రికలకు ఉత్తరాలు రాయడంతో మొదలైంది. జనరల్ గా రాస్తుంటరు కదా.. ఇది బాగుంది.. ఇది బాగాలేదని.. అట్లా..

మీ తొలిరచన 'కోళ్లమంగారం'..

మీ తొలిరచన 'కోళ్లమంగారం'..

ఆయనతోనే ఎందుకు మొదలుపెట్టాలనిపించింది..
ఐ మీన్.. రచయితగా మీ ఫస్ట్ రైటప్ ఆయనతోనే ఎందుకు కనెక్ట్ అయిందని?

వంశీ అనే మిత్రడు ఓరోజు.. 'మంగారం బొమ్మ చూశావా?' అని అడిగిండు.. లేదు అని చెప్పి నవ్విన కూడా.. మళ్లీ వాడే అన్నడు.. 'చూడు విజయశాంతిని చూసినట్టుంటది', నాకప్పుడేం అర్థం కాలేదు. ఇంకా ఏమన్నడంటే.. 'మంగారం కోడి బొమ్మ చూస్తే.. విజయశాంతి కూడా కోడి లెక్క ఉన్నదనపిస్తది' అని చెప్పిండు.

అట్లా మొదలైంది.. మంగారం మీద నా రచన. అప్పుడు మొదలుపెట్టి.. ఆయన జీవిత కథనంతా రాసిన. 'కోళ్ల మంగారం' మీద నేను రాసిందానికి ఓ సాహిత్య గుర్తింపు తీసుకొచ్చిన. 13మంది జీవితాలను పుస్తకాలుగా చేసి ఆ ఒరవడిని నిలబెట్టిన.

పతంజలి గారు ఓ మాటన్నరు..

పతంజలి గారు ఓ మాటన్నరు..

రష్యా సాహిత్యమంతా రాచరిక కుటుంబాలు, రాజుల చుట్టూ తిరుగుతున్న క్రమంలో
నికోలస్ అనే ఓ ఆసామి పేదరైతు కోటు మీద కథ రాసిండని.. అదో పెద్ద చర్చకు దారి తీసి.. రష్యన్ సాహిత్యంలో వస్తువు గతినే మార్చివేసిందని!..
ఆ సందర్భాన్ని మీ 'సామాన్య' రచనలకు అన్వయించుకోవచ్చా!..

లేదు.. లేదు.. ఈ మాటన్న పతంజలి గారే.. ఇంకో మాట ఏమన్నరంటే.. జర్నలిస్టులు సమాజాన్ని చూసే దృష్టికోణంలో వచ్చిన మార్పుల వల్లే.. నేనలా రాసి ఉండవచ్చునని.

నేననుకునేది ఎట్లా ఉంటదంటే.. ఏదైనా సరే.. ఎక్కువ కాలం బ్రతికే రచన చేయాలని. అట్లా 'కోళ్ల మంగారం' చేసిన. నేనున్న పాత్రికేయంలో కదా!.. అట్లా అని నిత్య జీవన మరణాల గురించే రాసుకుంటూ పోతే.. ఇవాళ రాస్తే రేపుంటదా అది?, చచ్చిపోతది.
... ... ...

రావూరి భరద్వాజ లాంటివారు సామాన్యుడిని దరిద్రుడిగా చూపించారు. కానీ నా సామాన్యుడు హీరో. నేను సామాన్యుడి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తా. ఆయన రచనల్లో సామాన్యుడు సమరం చేస్తడు. నేననుకుంటా.. నిజానికి సామాన్యుడసలు సమరంలోనే లేడు కదా!..

సాహిత్యంలో కథలు, నవలలు రాసుకునేవారికి

సాహిత్యంలో కథలు, నవలలు రాసుకునేవారికి

కొంత ఫిక్షన్ జోడించి రాసుకునే వెసులుబాటు ఉంటది..
కానీ మీలాగా వాస్తవిక జీవితాల గురించి రాసేవారు.. రీడర్స్‌కు దాన్ని కమ్యూనికేట్ చేయడంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటరు?

నేను జీవితం ముందు చాలా వినయంగా చేతులు కట్టుకుని నిలబడి పాదాభివందనం చేస్తా. బ్రైటర్ సైడ్ ఆఫ్ లైఫ్ ని నేను చూస్తా.. కాబట్టి నా కాల్పనికత ఊహ కన్నా అందంగుంటది.

వీళ్లదంతా కల్పన కాదు.. ఊహ. ఊహాజనిత సాహిత్యం.

ఒక్కసారి ఆలోచించి చూడు.. నీ జీవితం నిన్నెంత కల్పన చేసుంటది!.. అమ్మ.. నాన్న.. ప్రకృతి.. వీళ్లంతా నిన్నెట్లా కల్పించరయ్యా?.. (ఆలోచించు అన్నట్టుగా ఆయన చూపు..). నాకు జీవితమే కల్పన గనుక.. నేను ప్రత్యేకించి వేరే కల్పన జోలికి పోలేదు.

శ్రీ శ్రీ ఒక మాటంటరు.. 'అథో జగత్ సహోదరులు' అని. వర్గదృష్టితో..
'అథో జగత్ సృజనశీలురు' అని నేనంటా.. అందుకే.. రక్తమాంసాలద్దిన జీవితమే కల్పన. నా సామాన్యశాస్త్రంలోని సిరీస్ లోని సామాన్యులంతా సృజనశీలురే..

ఓ మిత్రుడు నాతోని ఒక మాటన్నాడు.. 'రమేష్.. జీవితానికి కల్పన అవసరం లేదు.. కానీ జీవిత సత్యాలకు మాత్రం కల్పనను ఆశ్రయించు' అని.

ఇకముందు ప్రయాణంలో సత్యాన్ని ఆశ్రయించడానికి కల్పనను ప్రవేశపెడుతానేమో!.. ఇప్పటికైతే వాస్తవాన్ని దర్శించే సామాన్యశాస్త్రంతో నేను సంతృప్తిగానే ఉన్న.

ఇంకో మాట.. మై పాయింట్ ఈజ్ డ్రమాటిక్. లేకపోతే కోళ్ల మంగారం మీద నేను రాసిన బుక్.. కోర్టుకు పోవుడేంది? ఆ బుక్ వల్ల మంగారం కుటుంబానికి 3లక్షలు పరిహారం అందుడేంది. అందుకే.. జీవితమంతా ఓ కల్పన.. ఆ స్పష్టత నాకుంది.

నాకు మంచి ఆత్మీయులు ప్రతాప్ రెడ్డి గారు ఒక మాటన్నరు..'జీవితమే ఓ కల్పన కదా! అని.. ఆయన ఆ మాట చెప్పినప్పటి నుంచి.. నిజమే కదా.. జీవితం ఓ కల్పనే కదా.. అన్న ఆలోచన నాలో స్థిరపడిపోయింది.

మీ ఫోటోగ్రఫీ.. రచనలు..

మీ ఫోటోగ్రఫీ.. రచనలు..

రెండూ 'సామాన్యుడు' చుట్టే తిరుగుతున్నయ్ కదా!..
అసలు సామాన్యుడు అంటే ఎవరు మీ దృష్టిలో..

ఎవరు సామాన్యుడంటే.. తమ సహజత్వాన్ని, ప్రత్యేకతను కోల్పోనివాడు సామాన్యుడు. దాన్నే నేను 'ఎండపొడ' అంటా. ఆధునికత అని మనమేదైతే అనుకుంటున్నమో.. అది బాగా డెవలప్ అయినవాళ్లలో.. వాళ్లదైన సహజగుణం పోతది, ప్రత్యేకత వేరొకరిది వచ్చి చేరుతది.

లెఫ్టిస్టు భావజాలం కావచ్చు.. పౌర హక్కుల సంఘం నేపథ్యం కావచ్చు.. నేనెందుకో తొలినుంచి సంపన్నులను ద్వేషించేది. అయితే ఆ తర్వాత నేను తెలుసుకున్నా.. 'విజేతలు కూడా పరాజితులే కదా!'.. వీళ్ల పట్ల ద్వేషం ఎందుకు?

ఆర్థికపరంగా సామాన్యుడు వెనుకబడిపోవచ్చు.. కానీ మిగతా విషయాల్లో సంపన్నుడు. అట్లనే సంపన్నుడి విషయంలో కూడా.. ఆర్థిక బలిమి వల్ల అతని మిగతా గుణాలు చిన్నబోవద్దని అర్థం చేసుకున్న.

హైదరాబాద్ వచ్చి.. ఆ తర్వాత ఢిల్లీ, కోల్ కతా వంటి నగరాలు తిరగడం వల్ల సామాన్యత ప్రధానంగా మనుషులను దర్శించడం మొదలుపెట్టిన. అట్లా.. అతను(సామాన్యుడు) నాకు దగ్గరయ్యిండు.

1997నుంచి 2010దాకా

1997నుంచి 2010దాకా

మళ్లా కెమెరా పట్టుకోలేదన్నరు!
రఘురాయ్ వద్దకు వెళ్లొచ్చి.. మళ్లీ కెమెరా పట్టుకున్నాక..
మీ పాత 'పాయింట్ ఆఫ్ వ్యూ'కి.. ఆ తర్వాతకి తేడా?

రఘురాయ్ ని కలిసి వచ్చిన తర్వాత.. వీధి.. నగరం.. ప్రపంచం.. అనే స్టూడియోలోకి నేను అడుగుపెట్టాను. ప్రపంచం అనే స్టూడియోలోకి వెళ్లి.. చిత్రించి.. ప్రచురించి.. ఇప్పుడో గ్యాలరీ పెట్టుకునే స్థాయికి ఎదిగిన.

సాధారణంగా ఓ పెయింటర్ తాను బొమ్మలేసుకోవడానికి ప్రత్యేకంగా ఓ గది ఉంటది..
అట్లనే ఓ సింగర్ కు, ఓ కళాకారునికి తమ రిహార్సల్స్ చేసుకోవడానికి ప్రత్యేక గదులు లేదా స్టూడియోలు ఉంటయ్..

అట్లా.. ఓ ఫోటోగ్రాఫర్ కు మాత్రం తనకు మాత్రమే ప్రత్యేకించిన స్టూడియో ఒకటి ఎందుకు ఉండవద్దు? అన్న ఆలోచన వచ్చింది. అట్లా తీసిన చిత్రాలను ప్రదర్శించుకోవడానికి సొంతంగా ఓ స్టూడియో పెట్టుకున్న ఫోటోగ్రాఫర్ ను నేనే కావచ్చు!..

ఇఫ్ యూ క్యాప్చర్ సో మెనీ ఇమేజెస్.. యూ నీడ్ ఏ గ్యాలరీ..
అయితే.. కొన్నివేల చిత్రాలను తీసుకుంటూ పోవడమేనా! అదేనా ఫోటోగ్రఫీ..
ఫోటోగ్రఫీ రహస్యం ఎక్కడుంది?.. ఎక్కడుందంటే.. టెక్నిక్-హృదయం-ఆత్మ.. ఈ మూడు విశిష్ఠ గుణాలతో ఏకకాలంలో ఒక ఫోటోను క్లిక్ మనిపించాలె.

ఉదాహరణకు.. నేనో ఫోటో తీసిన. తన జీవన సహచరిణి.. ఓ భర్త తన భుజాల మీద ఎత్తుకున్న ఫోటో అది. అదో జీవన సమరం.. అనుకోకుండా నా కెమెరాకు చిక్కింది. అట్లా..

సామాన్యుల ఫోటోలను చిత్రీకరించడం ద్వారా

సామాన్యుల ఫోటోలను చిత్రీకరించడం ద్వారా

పలానా అచీవ్ మెంట్ నేను సాధించానని చెప్పుకునేదేమైనా?..

ఒక సామాన్యుడి జీవిత విశేషాలను ఫైవ్ స్టార్ హోటల్ తీసుకుపోయి సెలబ్రేట్ చేసిన. 120 లైఫ్ స్టైల్ చిత్రాల్లో 60 చిత్రాలతో వైస్రాయ్ హోటల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన. ఓ కామన్ మ్యాన్ నా వల్ల ఫైవ్ స్టార్ హోటల్లో అడుగుపెట్టిన సందర్బమది.

ఆ 60చిత్రాలు అదో జగత్ సృజనశీలురవే.. ఓ సామాన్యుడి చిత్రాన్ని పెద్ద పెద్దవాళ్లకు ఖరీదు కూడా చేసిన. అట్లా.. పెద్దోళ్ల ఇళ్లలో సామాన్యుడి జీవితాన్ని సెలబ్రేట్ చేసిన.

నాకు గుర్తున్నంతవరకు.. ఒక స్త్రీ తలవంచుకుని పాపను ఎత్తుకున్న ఫోటో ఒకటి.. గీతాంజలి సార్ ఇంట్లో ఉన్నది. అట్లనే.. ఒక 15మంది స్త్రీలు బిందెలు బోర్లేసుకుని ముచ్చటవెడ్తున్న ఫోటో ఒకటి.. మలుపు బాల్ రెడ్డి అన్న ఇంట్లో ఉన్నది.

మీరు గమనించాల్సిందేంటంటే.. నా ఛాయాచిత్రాలను అస్సలు ఎడిట్ చేయను. సామాన్యతను.. అందులోని వాస్తవాన్ని.. దర్శిస్తా నేను. దాన్నట్లాగే చిత్రిస్తా.

ఐదేళ్లలో నేను తీసిన 60చిత్రాలతో ఛాయా చిత్రకళకు ఓ కావ్య గౌరవం తరహా గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. సామాన్యమైన సామాన్యుడి చిత్రాలను అసామాన్యమనిపించేలా.. అలంకరించుకునే స్థాయికి తీసుకెళ్లగలిగిన.

ఒక థీమ్ అంటూ తీసుకుని చేసిన ఛాయాచిత్రాలు ఉంటాయి కదా!

ఒక థీమ్ అంటూ తీసుకుని చేసిన ఛాయాచిత్రాలు ఉంటాయి కదా!

వాటి గురించి..

మై సిటీ మై పీపుల్ తర్వాత.. 2014లో చిత్రలిపి-మగువకానుక.. థీమ్ తో ఛాయాచిత్రాలను చిత్రీకరించాను. సహజత్వాన్ని ఎండపొడగా చూసే క్రమంలో.. ఆ ఎండపొడను నేను ప్రకృతికాంతలో చూస్తాను.

ఒక స్త్రీ తన ఇంటిముందున్న వాకిలినే కాన్వాస్ గా చేసుకుని ముగ్గులు వేస్తది. అట్లా ప్రతీరోజు.. ఎంత అద్భుతంగా ఉంటది ఆ దృశ్యం. అందుకే.. ఒక పరిణితితో ఆ చిత్రాలను ప్రెజెంట్ చేయగలిగాను. ఒక విశిష్టతను ఒక ఫోటోలో చెప్పగలగడమంటే.. ఒక యజ్ణం.. ఒక పిల్లవాడు రుషిలా మారడం..

పెళ్లి చూపులు.. అప్పుడే పుట్టిన పాపను ఓ తండ్రి చేతుల్లోకి ఎక్కడం.. పాస్ పోర్ట్.. ఇవన్నీ.. విశిష్ఠ
ఫోటోగ్రఫీ సందర్బాలే. ఒక్క ఫోటోతో చెప్పేయడం.. జీవితంలో ఆ సందర్బానికి ఉన్న మూమెంట్ అదొక్కటే కదా!.. అర్థమైందా..

సామాన్యశాస్త్రం ఛాయచిత్రాల ప్రదర్శన-ఎండపొడగా మాట్లాడుకుంటున్న సందర్బంలో.. దాని గురించి కొన్ని మాటలు..

సామాన్యశాస్త్రం ఛాయచిత్రాల ప్రదర్శన-ఎండపొడగా మాట్లాడుకుంటున్న సందర్బంలో.. దాని గురించి కొన్ని మాటలు..


ఎండ-నీరెండ-ఎండపొడ-ఎండ్
పాయింట్ అటు ఇటు అయినా గానీ వెలుతురంతా ఒకే వెలుతురు కాదు. చీకటంతా ఒకే చీకటి కాదు. చీకటి వేరు.. చిమ్మ చీకటి వేరు. అట్లనే.. ఎండ వేరు.. ఎండపొడ వేరు. పొడ అంటే ఒక మెలుకువ..

ఒక్క మాటలో.. ఎండపొడ అనేది.. ఆరోగ్యం..సహజం..ఓ విశిష్టత.. ఓ వెచ్చదనం. ఎండను కాదు ఎండపొడను దర్శించండి.. కొద్దిసేపు ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించండి.. ఆరోగ్యవంతులవుతారు. ఇదీ సామాన్యశాస్త్రం.

-ఈ సమాధానం విన్న తర్వాత.. జీవితంలో ప్రతీ విషయాన్ని రమేష్ బాబు గారు తాత్విక కోణంలోంచి చూస్తారన్న స్పృహ కలిగింది నాకు.

కొంత కవిత్వం కూడా రాసినట్టున్నారు కదా..

కొంత కవిత్వం కూడా రాసినట్టున్నారు కదా..

మీ 'సామాన్యత'లో కవిత్వాన్ని ఎందుకని సీరియస్ గా మళ్లీ కొనసాగించలేదు?.

ఇంతకుముందే చెప్పినట్టు సొంత వాక్యం రాస్తే రచయిత భయ్యా..

ఫ్లక్స్ అనే పేరు మీద నేను కవిత్వం రాసిన.

హైదరాబాద్ వచ్చి సిద్దార్థ లాంటి రచయితలను కలిసిన తర్వాత కవిత్వం మీద ఇంకాస్త స్పష్టత వచ్చింది. అయితే నా ఆలోచన చెప్తా.. 'డోంట్ థింక్ దట్ పొయెట్రీ ఈజ్ నాట్ వర్డ్స్ ఇట్ ఈజ్ ఇమేజెస్ ఆల్సో..'

తొలినుంచి యాక్టివిజమ్ ఇష్టం.. బుద్ది, జ్ఞానంతో పనిచేయాలి. కవిత్వంతో రాసుకోవడానికే అయితే నేను హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరమే లేదు. నేను మొత్తం జ్ఞానం నశించిన కాలంలో పుట్టాను. కిషన్ సార్ లాంటి టీచర్.. వృత్తి-ప్రవృత్తి.. అనే రెండు పడవల ప్రయాణంలో సామాన్యుడిగా మిగిలిపోతే!.. అలాంటి సామాన్యుడికి నేను పుట్టిన.

అలా యాక్టివిజమ్ వైపు వెళ్తే.. యాక్టివిస్ట్ గా ఉంటే.. ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చునేమో అన్న భావనతో పౌరహక్కుల సంఘం తరుపున పనిచేశాను. ఆ తర్వాత.. చంద్రబాబు నాయుడు హయాంలో పురుషోత్తం హత్య జరిగిన రాజ్యహింస నేపథ్యంలో.. మళ్లీ జేబుకు పెన్ను పెట్టి పాత్రికేయంలోకి వచ్చాను.

అలా.. సహజం-సుందరం అన్న జీవితం వైపు అడుగుపెట్టిన. అదృష్టవశాత్తు అప్పటి బూటకపు ఎన్‌కౌంటర్లలో చనిపోకపోవడం వల్ల.. ఓ సృజనను సృష్టించగలిగే అవకాశం కలిగింది.

నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ గా

నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ గా

నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ గా
తెలంగాణ గ్రామీణ జీవితాన్ని దర్శిస్తున్నారు..
తెలంగాణ వచ్చిన సందర్బంలో.. అంతకుముందు పరిస్థితికి.. ఇప్పటికీ.. తేడా ఏమైనా కనిపిస్తుందా?

నేనేమంటా అంటే.. ఇది నా సొంత అభిప్రాయం.. బంగారు తెలంగాణను నేనో ఎండపొడ అంటున్న. ఎట్లా అంటే.. తెలంగాణలో ప్రజలిప్పుడు కాస్త రిలాక్స్ గా ఉన్నరు. గతంలో తమ పాట, మాట.. ఎలా సాగింది? అన్నదాన్ని.. వెచ్చని ఎండపొడలో కూర్చుని వాళ్లలో వాళ్లే విశ్లేషించుకుంటున్నారు.

ఒకరకంగా తెలంగాణ ఆర్ట్ ఫ్యాకల్టీస్ అన్నీ.. ఇప్పుడు కమ్మగా పాడటం మొదలుపెట్టినయ్. గూడూరి సీతారాం గారు అన్నట్టు.. తెలంగాణ పల్లెల్లో మొఖానికి పౌడర్ కొట్టుకుంటున్న దశను నేను చిత్రించిన. ఇప్పుడు అలంకరణ అన్నది అక్కర లేకుండా తెలంగాణ తయారవుతున్నది. ఇప్పటికైతే 'ఎండపొడ'లో కూర్చున్నది.. లేచి ఎటుపోతుందో.. ఏం చేస్తుందో.. అన్నది మనమే చూడాల్సి ఉన్నది.

అభివృద్దికి పుట్టిన కోతి అని ఈమధ్యే ఓ మంచి వ్యాసం కూడా రాసిన్రు.. ఆధునికత రూపాన్ని సరికొత్తగా కళ్లముందు పెట్టిన వ్యాసమది అంత నిశితంగా దాన్ని అక్షరబద్దం చేయడం గురించి?..

అభివృద్దికి పుట్టిన కోతి అని ఈమధ్యే ఓ మంచి వ్యాసం కూడా రాసిన్రు.. ఆధునికత రూపాన్ని సరికొత్తగా కళ్లముందు పెట్టిన వ్యాసమది అంత నిశితంగా దాన్ని అక్షరబద్దం చేయడం గురించి?..

టూ బి ఫ్రాంక్లీ సేయింగ్.. 1997లో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత.. బీసీ గర్జన కోసం మాత్రమే గ్రామాల్లోకి వెళ్లిన. ప్రొఫెషనల్ గా ఎప్పుడూ గ్రామాల్లోకి అడుగుపెట్టలేదు.

నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా 10రోజులు గ్రామాలను దర్శించిన తర్వాత 'అబివృద్దికి పుట్టిన కోతి' రాసిన. రాష్ట్రమంతటా ఉన్న ఆ సమస్యలో నేను గమనించిందేంటంటే.. ఆవాసం-ఆహారం విషయంలో కోతికి-మనిషికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

నేనా.. యుద్ధవాతావరణం బయటినుంచి వెళ్లిన వ్యక్తిగా దాన్ని గమనించిన. కోతుల దాడితో ఎంతమంది గాయపడ్డరు.. ఎంత పంటనష్టం జరిగింది? ఇవన్నీ తెలుసుకున్న. అయితే ఇది ప్రభుత్వ సమస్య మాత్రమే కాదు. కవులు, కళాకారులు, మేధావులు, అందరు కలిసి ఒక దగ్గర కూర్చుని మాట్లాడాలె.

ఇవాళ చాలామంది అంటున్నట్టు అడవుల పెంపకమే పరిష్కారం కాదు.. అసలు మనలోని సహజత్వమైన ప్రకృతి తరిగిపోతుంది కదా!.. మనిషి పూర్తిగా కాంక్రీట్ జంగిల్ స్వభావంతోని ఉంటున్నడు..

ఒక ఉదాహరణ చెప్తా.. ఇంతకుముందు ఊళ్లలో కల్లాలు ఉండేవి. ఇప్పుడెవరూ కల్లాలు కూడా ఉంచుకోవట్లేదు. దాన్ని కూడా పొలం చేసేసి.. కల్లాన్ని తెచ్చి రోడ్డు మీద పెడ్తున్నరు. ఏమవుతుంది దానివల్ల.. రోడ్డు ప్రమాదాలు జరగుతున్నయ్.

నీ పొలం దాటి నువ్వు రోడ్డు మీదకు నీ కల్లాన్ని తెచ్చిన రోజు.. వాహనదారుడు ఎవరైనా పడిపోతే.. వాన్ని తీసుకపోయి.. పక్కనే ఉన్న కాల్వలోకి తోసేస్తున్నవ్.. అంటే.. నువ్వో హంతకుడిగా తయారవుతున్నావ్.. కాబట్టి.. ఇక్కడ కోతి ఎవరంటే.. నువ్వే!. ప్రకృతి ధ్వంసం నీలో జరిగింది. అందువల్ల వెనక్కి వెళ్తున్నాం మనం.

ఏమంటరు వాటిని..(యాదికి తెచ్చుకుంటూ..).. 'ఆర్&బీ రోడ్లు'.. ఇవాళ అవన్నీ కల్లాలే. అభివృద్దికి పుట్టిన కోతి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు.. ఇదంతా రెండో పార్శ్వం..

ఎప్పుడూ కెమెరా భుజానికే ఉంటది కదా! దారంతా.. సామాన్యతను దర్శిస్తూనే వెళ్తారా?

ఎప్పుడూ కెమెరా భుజానికే ఉంటది కదా! దారంతా.. సామాన్యతను దర్శిస్తూనే వెళ్తారా?

భుజం మీద తలకాయ లాగా.. ఫోటోగ్రాఫర్ భుజం మీద కెమెరా ఉంటది. ఆఫీస్ కు వెళ్తున్న క్రమంలోను ఉదయాలను చిత్రించుకుంటూ వెళ్తా. పృకృతి కాంత నుదుటిన సూర్యుడు వెలుగుతున్నప్పుడు మానవుడిని అది ఎండపొడగా స్పర్శిస్తున్నప్పుడు ఛాయాచిత్రం క్లిక్ మనిపిస్తా. అది నాకు సామాన్యత.. ప్రత్యేకత.

 -కాకి మసీదులో ఎగురుతున్న ఫోటో ఒకటి తీశానన్నారు..

-కాకి మసీదులో ఎగురుతున్న ఫోటో ఒకటి తీశానన్నారు..

బీజేపీ హయాం కాబట్టి.. ఇందులో అంతర్లీనంగా పాలిటిక్స్ కనిపిస్తున్నయ్..
అట్లా.. ఓ మల్లన్న సాగర్ లాంటి అంశాన్ని కూడా మున్ముందు రోజుల్లో
మీ ఫోటోగ్రఫీకి వస్తువుగా ఎంచుకునే అవకాశం ఉందా?

ఏ రాజకీయ పార్టీ అనేది అనవసరం. టీఆర్ఎస్సా, బీజేపా?,కాంగ్రెస్సా?.. ఇది అనవసరం. నా ఫోటోల ద్వారా నేను ఖచ్చిత వాస్తవాన్ని దర్శిస్తా.

తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ పడుతున్న అవసాన దశను వ్యక్తం చేయడంలో స్వేచ్చ ఉంది. వాస్తవికతను దర్శించుకోవాలె. మల్లన్న సాగర్ దాకా నేనింతవరకు పోయే ప్రయత్నం చేయలేదు కదా!..

మౌలికంగా నా పని ప్రశ్నించడం కాదు. వాస్తవాన్ని చిత్రించి, రచించి జనం ముందు పెడ్తా. విమర్శ చేయను. నేను ఔట్ సైడర్ కాదు కదా!.. ఇవాళ ఈడిదాకా తెలంగాణ నడిచిందంటే అందులో నా అడుగుంది. వెనక్కి తీసుకోగలుగుతనా ఆ అడుగును!..

కాబట్టి.. అభినందించడం.. పరామర్శించడం.. వ్యక్తీకరించడం.. ఇట్లా సాగిపోతా.

ఎందుకని ఎప్పుడూ బ్లాక్ షర్టులోనే కనిపిస్తారు? బ్లాక్ షర్ట్-బ్రైటర్ సైడ్ ఆఫ్ లైఫ్..

ఎందుకని ఎప్పుడూ బ్లాక్ షర్టులోనే కనిపిస్తారు? బ్లాక్ షర్ట్-బ్రైటర్ సైడ్ ఆఫ్ లైఫ్..

కోళ్ల మంగారం.. బాలుడి శిల్పం.. డోంట్ ఫీల్.. ఈ రచనల్లో నేనొక పాజిటివ్ ఎనర్జీతో కనిపిస్తా. నేనో వ్యక్తినే కానీ నేనో సైన్యంలా తిరుగుతున్నా!. అందుకు.. 24*7 అలర్ట్ గా ఉండేందుకు.. నేను బ్లాక్ షర్ట్ ధరిస్తా. కొంతమంది కమిట్ మెంట్ కోసం కాషాయ వస్త్రాలు, అయ్యప్ప వస్త్రాలు ధరిస్తుంటారు.. నేనూ అంతే.

మీ లైఫ్ లో మీకు బాగా బూస్టింగ్ ఇచ్చిన పర్సన్?..

మీ లైఫ్ లో మీకు బాగా బూస్టింగ్ ఇచ్చిన పర్సన్?..

సుమబాల.. నా మిస్సెస్. మాది అరెంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపుల సందర్బంలో.. నాకు తనతో మాట్లాడే అవకాశం దొరికింది. అప్పుడు తనతో చెప్పిన..'నేనో రచయితను కావాలనుకుంటున్నా.. దానికోసం ఏ సాహసాలు చేయాల్సి వస్తదో?, అసలు ఎట్లుంటదో తెల్వదు, ఆ విషయంలో నువ్వు నాతో నిలబడుతావా?' అని.

అందుకు ఆమె అంగీకరించింది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచింది.

సామాన్యతను పరిచయం చేసిన వ్యక్తి?..

సామాన్యతను పరిచయం చేసిన వ్యక్తి?..

కొలచల చంద్రశేఖర్. సామాన్యుడు-సామాన్యతకు సంబంధించి ఆయనో కంప్లీట్ వ్యక్తీకరణ. ప్రతిభను సామాన్యతగా పెట్టుకోడు.. ప్రత్యేకత కలిగి ఉండి, సహజత్వం ఉండి.. ప్రతిభను ప్రదర్శనకు పెట్టుకోలేదు. అతని ద్వారా నేను ఎడ్యూకేట్ అయిందాన్ని ఓ పుస్తకంగా రాయొచ్చు.

సామాన్యత విషయంలో ఏ హీరో అయితే నేననుకుంటున్నానో.. అప్పట్లో కాదు.. ఇప్పుడు కూడా ఉన్నడు. ఆయన కొలచల చంద్రశేఖర్.

సామాన్యుడిగా ఉండటానికి ఇష్టపడుతా అని చెప్పే మీరు.. అవార్డులు, ప్రశంసల విషయాన్ని ఎట్లా చూస్తరు?

సామాన్యుడిగా ఉండటానికి ఇష్టపడుతా అని చెప్పే మీరు.. అవార్డులు, ప్రశంసల విషయాన్ని ఎట్లా చూస్తరు?

నేనేదైతే వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానో.. ఆ వస్తువు వల్ల నాకు గుర్తింపు రావాలె. అంతేగానీ ఆ వస్తువును విస్మరించి నన్ను ప్రశంసిస్తా అంటే నేను ఒప్పుకోను. అవార్డుల విషయంలో స్వీకరించవద్దని నిర్ణయించుకున్నా.

ఎంతోమంది సామాన్యుల జీవితాలను విశిష్టంగా చూపించడం ద్వారా దొరికిన సంతృప్తి అవార్డుల్లో దొరుకుతుందా?.. అవార్డులు ఇచ్చేవాళ్లది సమస్య కాదు.. నీ లక్ష్యమేంటన్న దానిపై దీనికి స్పష్టత ఉండాలె.

నిజానికి దేశంలో కొంతమందిని విశిష్టత కలిగిన వ్యక్తులుగా గుర్తించడాన్ని నేను ఫ్యూడల్ దృక్పథంతోనే చూస్తా. ప్రజాస్వామ్య దేశంలో.. రాజ్యం.. ఒకరిని విశిష్టంగా గుర్తించడమనేది.. ఏమాత్రం క్షేమకరం కాదు.

నా రచనలు చేరాల్సిన చోటుకు చేరుతున్నప్పుడు.. నా ఛాయాచిత్రాలను చూడాల్సినవాళ్లు చూస్తున్నప్పుడు.. అంతకుమించిన పురస్కారం ఇంకొకటి లేదు నాకు.

ఆశయాలు-ఆదర్శాలు ఏమ్లేవ్.. ఆ క్షణానికి రచయితగానో.. ఫోటోగ్రాఫర్ గానో.. ఎక్కువ తృప్తి పొందుతున్నప్పుడు.. నేను ఊహించిన దానికన్నా ఎక్కువే పొందుతున్నానన్న దగ్గర నేనున్నా.

ఏడుసుడు ఎందుకని?..(ప్రశ్నిస్తున్నట్టు..)
నాకైతే అవార్డులు తీసుకోకుండా ఉండటం ఎనర్జీ.

*

కందుకూరి రమేష్ బాబు రచనలు: బతికిన కోడి(కోళ్ల మంగారం), సామాన్యుల పరిచయ వ్యాసాలు, గడ్డి పరకలు, డోంట్ ఫీల్, నిండు మనుషులు, లే పెన్స్యూర్, బాలుడి శిల్పం

Interview by :శ్రీనివాస్ సాహి

English summary
Its an interview of well known Photographer and Writer Kandukuri Rameshbabu, shared his entire life journey with oneindia.com
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X