వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తోవలేసిన రచయితలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఒకే జాతి పేరిట ఏర్పడిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష, సంస్కృతులపై దాడి జరిగిందని, ఏర్పడబోయే రాష్ట్రంలో సాంస్కృతిక పునరుజ్జీవం జరగాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్ర సారస్వత పరిషత్తులో జరిగిన 'తెలంగాణ తోవలు' పుస్తకావిష్కరణ సభలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ప్రముఖ సినీ దర్శకుడు బి.నర్సింగరావు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, సీనియర్ పాత్రికేయుడు అల్లం నారాయణ తదితరులు మాట్లాడారు.

సభకు వన్ ఇండియా తెలుగు ఎడిటర్, పుస్తక సంపాదకుడు కాసుల ప్రతాప రెడ్డి అధ్యక్షత వహించారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ - తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి రాజ్యాంగ పరమైన, చట్టపరమైన చిక్కులు లేవన్నారు. ఏ ఆర్టికల్ 3 ప్రకారం మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో, అదే ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు.

తెలంగాణ తోవలు పుస్తకావిష్కరణ

తెలంగాణ తోవలు పుస్తకావిష్కరణ

తెలంగాణకు చెందిన 18 మంది రచయితలు వాసాలతో వెలువడిన తెలుగు తోవలు సంకలనాన్ని ఆవిష్కరించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి

బి. సుదర్శన్ రెడ్డి ఇలా..

బి. సుదర్శన్ రెడ్డి ఇలా..

తెలంగాణ తోవలు పుస్తకంలోని ఆ వ్యాసాన్ని ఆసక్తిగా చదువుతున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి

బి నర్సింగరావు ఇలా..

బి నర్సింగరావు ఇలా..

తెలంగాణ తోవలు పుస్తకావిష్కరణ సభలో ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బి. నరసింగరావు ఇలా కనిపించారు.

స్పష్టమైన దృక్పథం

స్పష్టమైన దృక్పథం

తెలంగాణ తోవలు పుస్తక రచయితలు పునర్నిర్మాణానికి తగిన దృక్పథాన్ని అందిస్తారని కాసుల ప్రతాప రెడ్డి అన్నారు.

ఉద్యమానికి బాసటగా..

ఉద్యమానికి బాసటగా..

పరాయి సంస్కృతి ఆక్టోపస్‌లా విస్తరించిన సందర్భంలో తెలంగాణ తోవలు పుస్తకం ఉద్యమానికి బాసటగా నిలిచిందని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో మలి ముద్రణ రావడం రేపటి తెలంగాణకు మలి తోవ సృష్టిస్తుందన్నారు.

అందెశ్రీ గానం..

అందెశ్రీ గానం..

ప్రముఖ గాయకుడు, కవి అందెశ్రీ సభా వేదిక మీది నుంచి తాను రాసిన గేయాన్ని చదివి ప్రేక్షకులను అలరించారు.

ఎన్నారైల కృషి

ఎన్నారైల కృషి

ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం భారత సమన్వయ కర్త డిపిరెడ్డి మాట్లాడుతూ - తెలంగాణ ఎన్నారైలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చేసిన కృషిని వివరించారు.

భాషా ప్రామాణికత

భాషా ప్రామాణికత

తెలంగాణ భాషకు ప్రామాణికత తీసుకువచ్చింది రచయితలేనని ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత, చిత్రకారుడు బి. నర్సింగరావు అన్నారు.

సంస్కృతిపై దాడి

సంస్కృతిపై దాడి

నిరంకుశ పాలనగా చెప్పుకునే నైజాం కాలంలోనూ తెలంగాణ భాష, సంస్కృతులు సజీవంగా ఉన్నాయని, కానీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ భాష, సంస్కృతులపై దాడి మొదలైందని ఆయన అన్నారు. తెలంగాణ జాతిని నిర్వీర్యం చేసేందుకు, ఇక్కడి వనరులను దోచుకునేందుకే ఈ దాడి జరిగిందని బి. సుదర్శన్ రెడ్డి అన్నారు.

మతశక్తుల ప్రమాదం

మతశక్తుల ప్రమాదం

తెలంగాణ ఉద్యమంలో ప్రగతిశీల శక్తులు సైతం మతోన్మాదులతో ఐక్యత కట్టాయని కవి స్కైబాబ విమర్శించారు. ఇది ముస్లిం సమాజంలో ఆందోళనను కలిగిస్తోందన్నారు.

కళావంతుల గురించి..

కళావంతుల గురించి..

రచయిత కందుకూరి రమేష్ బాబు కళావంతుల జీవితాల గురించి వివరించారు. తాను రాసిన వ్యాసం వల్ల తన కుటుంబంలో తాను ఎలా ఒంటరివాడినయ్యానో చెప్పారు.

సాంస్కృతికోద్యమం

సాంస్కృతికోద్యమం

తెలంగాణ సాంస్కృతికోద్యమ ప్రారంభం గురించి రచయిత కాసుల లింగా రెడ్డి చెప్పారు. తెలంగాణ రచయితల బాధ్యత గురించి ప్రస్తావించారు.

కవిత్వం గురించి..

కవిత్వం గురించి..

కవి కాంచనపల్లి - తెలంగాణ కవిత్వంపై తాను రాసిన వ్యాసం గురించి విశ్లేషించారు. శ్రీధర్ దేశ్‌పాండే, గుడిపాటి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాహిత్యమే..

సాహిత్యమే..

ప్రముఖ రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ - తెలంగాణ సాహిత్యమే ఉద్యమాన్ని నిలబెట్టిందని, లేదంటే 69 ఉద్యమంలా అణిచివేతకు గురయ్యేదని అన్నారు.

భాషపై కృషి

భాషపై కృషి

నందిని సిధారెడ్డి పుస్తకంలో వ్యాసరచనలపై అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తెలంగాణ భాష, సంస్కృతులపై దశాబ్దాలుగా పెత్తనం కొనసాగుతోందని, దాన్ని ప్రశ్నిస్తూ రచనలు సాగాయని అన్నారు. ఈ రచయితలంతా ఉద్యమకాలమంతా రాజీ లేకుండా నిలిచారని అన్నారు.

మజిలీయే..

మజిలీయే..

తెలంగాణ ఒక మజిలీ మాత్రమేనని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ అంటూ అంతకన్నా విశాలమైన లక్ష్యాలవైపు పయనించాలని సూచించారు.

కవులూ కళాకారులే..

కవులూ కళాకారులే..

రాజకీయ నాయకులపై విశ్వసనీయత సన్నగిల్లినప్పుడు కవులు, కళాకారులే ఈ ఉద్యమాన్ని నిలబెట్టారన్నారు.

సాహిత్యమే నడిపిస్తుంది

సాహిత్యమే నడిపిస్తుంది

లండన్ తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాక సభ్యుడు గంప వేణుగోపాల్ - తాము తెలంగాణ సాహిత్య, సాంస్కృతికోద్యమానికి చేసిన కృషిని వివరించారు.

తెలంగాణ భాషను పట్టుబట్టి తన రచనల్లో ఎలా తీసుకువచ్చాననే విషయంపై ప్రముఖ కవి నందిని సిధారెడ్డి వివరించారు.

ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ - చరిత్ర ఎప్పుడూ వ్యక్తి నిర్మితం కాదని, దాని వెనక సామూహిక దోహదం ఉంటుందని అన్నారు. వివక్ష నుంచి జనం అనుభవాలనుంచి తెలంగాణ ఉద్యమం వెల్లువెత్తిందన్నారు. వెనక్కి తిరిగి చూసుకోవడం ముందుకు నడవడం కోసమేనని, ఎక్కడి నుంచి మొదలయ్యామో గుర్తుంచుకోవడం ద్వారా ఉద్యమ లక్ష్యాలను చేరుకోగలమని అన్నారు.

నమస్తే తెలంగాణ సంపాదకుడు అల్లం నారాయణ మాట్లాడుతూ - తెలంగాణ సుదీర్ఘ ఆకాంక్ష అని, అది తీరే క్రమంలో ఒక ఐక్యత అవసరమైందని, అందుకే అన్ని శక్తులూ కలిసినడవాల్సి వచ్చిందని అన్నారు.

హైదరాబాద్ కవుల వేదిక తరఫున ఆ తర్వాత కవి సమ్మేళనం జరిగింది. ఆ కవిసమ్మేళనంలో నాళేశ్వరం శంకరం, దెంచనాల శ్రీనివాస్, చింతపట్ల సుదర్శన్, ఏనుగు నర్సింహారెడ్డి, మురళి, గాదె వెంకటేష్, కందుకూరి శ్రీరాములు తదితరులు తమ కవితలను వినించారు. కవి సమ్మేళనానికి ప్రముఖ రచయిత, కవి అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షత వహించారు.

English summary
Supreme court former justice B Sudarshan Reddy said that there will be no constitutional hurdle to pass Telangana bill in Parliament. Film director anad painter B Narsing Rao explained the importance of protection of Telangana culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X