• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సూటి గా సుత్తి లేకుండా ఓ వ్యంగ్యం!

By Pratap
|

చెప్పదల్చిన విషయాన్ని సూటి గా నొప్పించక తానొవ్వక, మెత్తని చురకలేస్తూ ఆలోచించింప చేసే విధానమే వ్యంగ్యం. సునిశిత హాస్యం అపహాస్యం కాకుండా వ్యంగ్యార్థం వచ్చేలా రచన చేయడమే దీని పరమార్ధం కవిత అయినా, కధ అయినా, వ్యంగ్య రచన త్వరగా పాఠకులకి చేరుతుంది. ఎక్కువగా మనం కార్టూన్ లలో వ్యగ్యాన్ని చూడవచ్చు. చాలా సంవత్సరాలు గా ఎందరో రచయతలు వ్యంగ్యాన్ని జోడించి ఎన్నో రచనలు చేశారు ..కొన్ని కథ ల రూపం లో ఉంటే మరికొన్ని కవిత ల రూపం లో ...అయితే వీటికి బిన్నం గా వ్యాస రూపం లో వ్యంగ్యాన్ని జోడించి రావడం బహుశా నాకు తెలిసి ఇదే మొదటిది అయి ఉంటుంది ఇంతకీ ఏమిటి అది సుదర్శన్ సెటైర్స్, తెలంగాణా. కామ్ చింతపట్ల సుదర్శన్ గారు వివిధ పత్రికలలో రాసిన వ్యగ్యం తో కూడిన వ్యాసాలన్నిటి ని సంకలనం గా తీసుకు వచ్చారు ..

తెలంగాణ మలి దశ లో జరిగిన ఘటనలను ...అన్నిటిని తనదైన శైలి లో రచించారు ..మొత్తం ఇరువది ఐదు వ్యాసాల పరంపరం లో వేటికవే ప్రత్యేకత ఉన్నాయని చెప్పొచ్చు. ఏది సత్యం? ఏది అసత్యం లో అగ్గిపుల్ల తన అవస్థను చెప్పుకునే విధం గా సాగిన రచన నిజంగా ఆలోచించతగినదే ...పాతికేళ్ళు నిండని ఒకడు భూమి కోసం, భుక్తి కోసం నీటి కోసం, గాలి కోసం చౌరస్తాలో తన ఐదు ప్రాణాల్ని పంచభూతాలకు బహుమతి గా ఇచ్చాడు ..షరామామూలే ఆ బిడ్డడి త్యాగాన్ని క్యాష్ చేసుకునే పార్మెంటుకు వేలాడే గబ్బిలాలు త్యాగాన్ని ఊరికే పోనిస్తామ అంటూ ఉత్తి ఉత్తి ప్రమాణాలు చేసి ఆశలు రేపించారు .

కొంత మంది రాజీనామాలు చేసి మరికొంతమంది చెయ్యక సాధించాల్సిన లక్ష్యం దూరం పెట్టారు ..అయినా భూమి కోసం, నీటి కోసం గాలి కోసం త్యాగం చేసిన వాళ్ళ కి విలువ కట్టే ఓట్ల మెషిన్ ని పట్టుకొని వేటాడుతున్నారు అని తెలంగాణ కోసం పాటుపడిన వీరుల పై రాజకీయ నాయుకులు ఓట్ల బ్యాంకు గా చూడటాన్ని నిరసించారు. రెండు రాష్ట్రాల కొట్లాటని ఓ కమిటీ లో పెడితే ఎలాగా ఉంటుంది. ఉమ్మడి గా తలో పార్టీ వాళ్ళు వచ్చి ఒకరికి ఒకరు కొట్టుకుంటే కృష్ణ రూపం లో వచ్చిన వాడు ఏమి చెయ్యగలడు ...అందులో నే ఇలాగ "ఒకడు ఇవాళ చెప్పింది రేపు కాదంటాడు, మొన్న చెప్పించింది నిన్న లేదంటాడు, జెండా మార్చంటాడు, ఒకేసారి చెప్పింది మల్లి చస్తే చెప్పడు" సొంత నెల ని సాధించుకునే ఉద్యమం లో భిన్న దారులు ...ఎవరికీ ఎంత ఉపయోగమో తేల్చుకొని మరి కమీటీ ముందు ఉంచుతారు ..చివరికి తేలింది ఏమిటి కేవలం అభిప్రాయాలను తెలుసు కొని రమ్మని అంతే...మిగతాది అంతా అధిష్టానమే చూసుకుంటుంది ..ఉద్యమం తీవ్రం గా జరుగుత్న్నప్పుడు అంతా అధిష్టానమే వాపే కదా చూసేది ..

Pushyami sagar reviews Chintapatla's book

అగ్గిపుల్ల చుట్టముక్క లో ని విషయము ఏమిటి అంటే వెనకటికి ఓ సామెత వుంది ..అదేమిటి అంటే...ఇల్లు కాలీ ఒకడు ఏడుస్తుంటే చుట్ట ముట్టించుకున్నాడు అంట..మల్ల అగ్గిపుల్ల తోనే మొదలు పెట్టారు ...కధ నాయకుడితో మొదలు అవుతుంది. నాయకులూ అగ్గిపుల్లని అడ్డగోలుగా వాడుకుంటారు .మనుషులంటే భయపడని పుల్లలు రాజకీయనాయకులకు మాత్రం భయపడతారు ..అలాంటి ఓ నాయకుడు, ఉద్యమం కోసం ఎంతోగా కస్టపడి అందరి ద్రుష్టి కి తీసుకువస్తే ఆ నిప్పు లాంటి స్ఫూర్తి ని ఉపయోగించుకోవాలని చూస్తాడు "ఐదు వందల ప్రాణాలు పోయి ఇల్లు కాలిన వాడు ఏడుస్తునాడు కానీ" అని వెటకారం గా ప్రశినుస్తూనే పండగ చేసుకోవలసిన వాడు ఎవరు ఇల్లు కాలినవాడిదా లేదు చుట్ట ముతితెనుంచి వాడిదా ? ఇవన్నీ జవాబులేని ప్రశ్నలే..జవాబు తెల్సి ప్రశ్నలడిగె అలవాటు మనకి వున్నప్పుడు చుట్ట ముట్టించుకునే వాడికి మాత్రం పండుగే..ఇక కృష్ణ మాయ గురించి చెప్పేది ఏముంది ఇద్దరి కోట్లటాను మూడో వాడు వచ్చి తీరుస్తాడు నిజానికి జరిగేది అదే.

ఇక్కడ రెండు ప్రాంతాల కొట్లాటలను వాదనలు ను మధ్య తగువు తీర్చడానికి ఓ కమిటీ ని పెడతారు ..దీనిపై ప్రముకమైన కధ ని ఆధారం గా తీసుకున్నారు అదే రెండు పిల్లలు ఓ కోతి కధ ...నల్ల పిల్లి, తెల్ల పిల్ల, కోతి ...సమావేశం ఆవుతాయి సమస్య పరిష్కారానికి కమిటీ వేస్తుంది ఆరువందల పేజీల సూచనలు రాస్తాయి ...అది ఎవరి కి అర్థం కాదు ఇలా కాదు అని సమస్య ని నానబెట్టడమే కరెక్ట్ అని నిర్ణయిస్తుంది...కోతి. ఇక ఉఛ్ద్యమం తీవ్రతరమై అన్ని వైపులా నుంచి అధిష్ఠానం మీద ఒత్తిడి తీసుకు వచ్చి ప్రత్యేక తెలంగాణ కోసమై అన్ని రాజకీయ పక్షాలు రాజనీమా చెయ్యాలని ఉద్యమకారులు ఆశపడ్డారు ..కానీ పదవి మీద కాంక్ష వున్నా నయయకులు ఊరుకోరు కదా...తుమ్మితే ఊడిపోయే ముక్కులు అని తెలిసి కూడా పడవలు ను పట్టుకొని వేలాడతారు అందుకే పెట్టుడు మీసాలు లో వైనాగ్యం గా నాయకుడికి దేవుడికి మధ్య సంభాషణ రక్తి కడుతుంది.

"ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు అవసరమైతే ప్రజల కోసం నిలబడి పదవి త్యాగం చేస్తారు " , ప్రజలు ఇచ్చిన పదివి ఎప్పుడు కావాలంటే అప్పుడు దిగిపోతామని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంటుంది కాబట్టి చిత్తశుద్ధి గ తెలంగాణ కోసం నిజాయితీగా పదవి త్యాగం చేసేది ఎవరో అని తేల్చమంటారు ..వీరి వేషాలు ప్రజలకు నెమ్మదిగా తెలుస్తాయి అంతవరకు వేచి చూడటమే.. ఇక ఒకప్పటి వైభవం ఇప్పుడు కానరాదు కదా ....ఉమ్మడి రాష్ట్రము లో సమగ అభివృద్ధి జరగలేదు అనడానికి ఎన్నో తార్కాణాలు. సంప్రదింపుల పురం లో మంత్రి కుమారుడు పేదరాశి పెద్దమా ల మధ్య సంభాషణ, సమస్య భవనము లో సమస్యని సృష్టించి ...పరిషేకానికి కాలయాపన చెయ్యడం...తెలంగాణ ఉద్యమం లో సంప్రదింపుల పేరు తో కాలాయాపన చేయడం ...సమస్యని తప్పు దోవ పట్టించడానికే ...తద్వారా ఎంతో మంది ప్రత్యేక రాష్ట్రాన్ని వారి కల ని అణచివేయడమే..బాగా చెప్పారు ..

ఉమ్మడి రాజీనామాలను ఎక్కడ ఆమోదిస్తారా అని కలవర పడుతూ ప్రజాప్రతినిధులు అనుభవించిన క్షోభని, పేరు కు ప్రధాన మంత్రి అయినా కొద పెత్తనం అంతా అమ్మ చేతుల్లోనే నడవడం ....పదవి కి యేసువారు రాణి విధం గా పండితుడి తో దుర్మహుర్తం పెట్టించడం మిఠాయిదివన్నీ ఉత్తర కుమారులలో చురకలంటించారు . అరవై సంవత్సరాల పోరాటం, తండ్లాటా అగ్ని గుండమై రగులుకుంది అది ఊరికే అఆగిపోదు సకల జనులు రోడ్ పై కి వచ్చి సమ్మె బాట పట్టారు ...అగ్నిగుండం ఊళ్లోకి జొరబడింది ఊరు అంటుకుంది ఊరు మండే అగ్నిగుండం అయ్యింది నిజమే తెలంగాణా కోసం ఊరు కదిలింది. అగ్నిగుండం అయ్యింది పనివాడి నుంచి పారిశ్రామిక వేత్త దాకా, పసివాడు నుంచి వృద్ధుడి దాకా ఆత్మ గౌరవం కోసం బానిస బాటకు కోసం రోడ్డ్డేకి అగ్నిగుండం చేశారు ..సాధించుకోవడం కోసమే....అందుకే అగ్నిగుండం అయ్యింది అని వ్యగ్యం గ చెప్పారు ..

ఇక అఖిల పక్షం చేతిలో ప్రత్యేక రాష్ట్రము నిర్ణయాన్ని పెట్టి పాలకులు చేసిన తప్పుని ఎత్తి చూపించారు ..కర్రా విరగదు పాము చావదు అన్న చందాన అటు వాళ్ళని, ఇటు వాళ్ళని ఇద్దరిని దెబ్బ కొట్టి చివరికి ప్రత్యేక రాష్ట్ర ఆలోచన ని చంపేయాలని తద్వారా లాభపడమనుకున్న వారికీ చెంపపెట్టు ..అదిష్టానినం భావిస్తుంది ఇది అసలైన పాము కాదు రబ్బరు పాము అని ...అయినా కూడా చిచ్చు పెట్టి విడదీయాలన్న అధిష్టానం ఎత్తుగడలు వేస్తూనే వున్నాయి అంటారు . ఇంకా ఇలాంటి వ్యంగ రచనలు చాలా వున్నాయి ఈ పుస్తకం లో అవన్నీ కూడా తెలంగాణ మాండలికం లో సాగి ఆసాంతం ఆకట్టుకుంటుంది

తెలంగాణ ఏర్పడిన తరువాత వివిధ రాజకీయ పార్టీల కుటిల రాజకీయాలు వ్యతిరేక ప్రచారం, వ్యంగం గా చిత్రయించి సెటైర్ లు , బురిడీ బాబా , సందులో బేరం ..ఉద్యోగ విభజన గురించిన సెటైర్లు "నీది నీదే, నాది నాదే" లాంటివి ..ఇక కబడ్డీ కబడ్డీ తెలంగాణ మాండలికం లో రాయబడి సామాన్య ప్రజల కష్టాల గురించి తెలియపర్చినది ...వాస్తవానికి పదునైన వ్యంగ్యం జోడించి నిర్మొహమాటం ముక్కు సూటిగా సాగే రచన ఇది ..తెలంగాణ ఉద్యమ సాహిత్యం లో ఈ తెలంగాణ.కం ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు ..మంచి పుస్తకాన్ని అందించిన సుదర్శన్ గారికి అభినందనలు ..

-పుష్యమీ సాగర్

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pushyami sagar reviewed Chinthaptla Sudarshan's book Telangana.com, collection of satires.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more