వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ప్రయాణం ఇదీ: సంగిశెట్టి శ్రీనివాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

పరిశోధన విషయంలో మానవల్లి తదితర ప్రముఖ తెలుగు పరిశోధకుల కోవలోకి సంగిశెట్టి శ్రీనివాస్ కోవలోకి వస్తారని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ ఒకానొక సందర్భంలో అన్నారు. ఆయన తెలంగాణ సాహిత్య, చరిత్ర విషయంలో చేసిన పరిశోధన ఎనలేనిది. ఆయన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవార్డు ప్రదానం చేసింది. తన నేపథ్యాన్ని, తాను చేసిన కృషిని సంగిశెట్టి శ్రీనివాస్ వన్ఇండియా తెలుగు కోసం ప్రత్యేకంగా అందించారు. ఆయన మాటల్లోనే చదవండి...

1. నాగురించి

నేను పుట్టింది నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని రఘునాథపురం గ్రామంలో 1965లో. మధ్యతరగతి పద్మశాలి కుటుంబంలో. మా నాయిన పేరు సంగిశెట్టి స్వామి, తల్లి సంగిశెట్టి వజ్రమ్మ. ఐదుగురు అన్నదమ్ముల్లో నేను మధ్యవాడిని. రఘునాథపురంలోనే ప్రాథమిక విద్య చదువుకున్నాను.

2. చదువు:

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో, లైబ్రరీసైన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ తొలి జర్నలిజం ఎంఫిల్‌ బ్యాచ్‌ విద్యార్థిని. విద్యార్థిగా ఉన్న కాంలోనే తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ స్థాపకుల్లో ఒకణ్ణి. ఈ సంఘం 1989లో ప్రారంభమయింది. 1991 నవంబర్‌ ఒకటిన ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాపై నల్లజెండా ఎగరేశాను. ఇది మలిదశ తెంగాణ ఉద్యమంలో తొలి ధిక్కార చర్య. ఇందుకు గాను విద్యార్థుల్ని పోలీసులు అరెస్టు చేసిండ్రు.

3. ఉద్యోగం:

1990-1994 మధ్యకాంలో 'ఉదయం' దిన పత్రికలో స్పోర్ట్స్‌ ఇంచార్జీగా పనిచేశాను. ఇప్పటి సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి గారు ఆ పత్రికకు సంపాదకులుగా ఉండేవారు. ప్రముఖ జర్నలిస్టు కె.శ్రీనివాస్‌, కాసుల ప్రతాపరెడ్డి, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన రసూల్‌, ఎం.పీ. రాపోలు ఆనందభాస్కర్‌ అందరూ కూడా అప్పటి ఉదయం సహోద్యోగులు.
ఉదయం పత్రిక మూత పడ్డ తర్వాత ప్రభుత్వ జూనియర్‌ కళాశాలో లైబ్రేరియన్‌గా చేరాను. 2012 నుంచి జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాను.

 Sangisetti narrates his back ground for oneindia Telugu readers

4. ఉద్యమం

'కవిలె' తెంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌ని ఏర్పాటు చేసి మరుగునపడ్డ తెంగాణ ఘనతను, చరిత్రను, సాహిత్యాన్ని పుస్తకాలుగా వెలువరించడం జరిగింది. తెలంగాణ రచయితల వేదిక, సింగిడి తెలంగాణ రచయితల సంఘం స్థాపనలోనూ, నిర్వహణలోనూ చురుగ్గా పాల్గొన్నాను. 2000 సంవత్సరం నుంచి వివిధ సాంస్కృతిక సంస్థల స్థాపన, నిర్వహణలో చురుకైన పాత్ర పోషించాను. తెలంగాణ రచయితల వేదిక తీసుకొచ్చిన పత్రిక 'సోయి'లో రెగ్యులర్‌గా వ్యాసాలు రాయడమే గాకుండా మరుగున పడ్డ ఎందరో మహానుభావులను, ఎంతో సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడమైంది. అలాగే తెంగాణ టైమ్స్‌, చర్చ, సింగిడి పత్రికల్లో కాలమ్స్ ని నిర్వహించాను.

తెలంగాణ హిస్టరీ సొసైటీ, దస్కత్‌ తెలంగాణ కథావేదిక, బహుజన కథకుల కచ్చీరు, తెలంగాణ చరిత్ర పరిశోధక సంఘాలను మిత్రులతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. వీటి తరపున అనేక పుస్తకాలను నా సంపాదకత్వంలో వెలువరించాను.

5. సాహితీ సేవ గురించి...

ఆంధ్రప్రాంత సాహితీవేత్తలు, విమర్శకులు, విస్మరించిన, వివక్షతో తొక్కిపెట్టిన విషయాలను సాహిత్యాధారాలతో చర్చకు పెట్టడం జరిగింది. నల్లగొండ జిల్లాకు చెందిన 'భండారు అచ్చమాంబ' తెలుగు సాహిత్యంలోనే తొలి కథకురాలని ఆమె కథా సంపుటిని వెలువరించి రుజువు చేయడం జరిగింది. అలాగే సాయుధ పోరాటం కాలం నాటి కథకుడు 'ఆవుల పిచ్చయ్య' కథలు పుస్తకంగా తీసుకు వచ్చాను. వట్టికోట ఆళ్వారుస్వామి జీవితం 'సార్థక జీవనం'పుస్తకాన్ని మిత్రుడు ఎన్‌.వేణుగోపాల్‌తో కలిసి రాసాను. అలాగే 1969-73 పుస్తకాన్ని మరో మిత్రు సుంకిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి సంపాదకత్వం వహించాను.

తెంగాణాలలో కథా సాహిత్యం లేదు అని ఆంధ్రాప్రాంత విమర్శకులు చేసిన ప్రచారానికి జవాబుగా 'దస్త్రమ్‌' పేరిట 1956కు ముందు ఉన్న 1000మంది కథకులను లిస్టవుట్‌ చేసి పుస్తకంగా తీసుకు వచ్చాను. అలాగే తెలంగాణ పత్రికా రంగ చరిత్రను పరిశోధించాను. తెలంగాణ పత్రికా రంగ చరిత్రను రికార్డు చేస్తూ 'షబ్నవీస్‌' అనే పుస్తకాన్ని వెలువరించాను. 50కిపైగా పుస్తకాలకు ముందుమాట రాయడం జరిగింది. తెలంగాణ సాహిత్యాన్ని సగర్వంగా పరిచయం చేసిన 'మునుం', 'జిగర్‌' కవితా సంకనాలకు, మెతుకు కథలు, వరంగల్‌ జిల్లా కథాసర్వస్వం, ఖమ్మం కథలకు ముందుమాటలు రాయడమే గాకుండా ఆ సంకనాలు సమగ్రంగా వెలువడడానికి సహకరించాను.

ఇప్పుడు ప్రతి యేటా తెలంగాణ కథను వెలువరిస్తున్నాను. 2013లోని మెరుగైన కథను 'రంధి' పేరిట 2014 కథను తన్లాట పేరిట పుస్తకంగా అచ్చేయడమైంది. ఇప్పటి వరకు దాదాపు 40 పుస్తకాలను రాయడం/సంపాదకత్వం వహించడం జరిగింది. 'సింగిడి' పత్రిక సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. దక్కన్‌ల్యాండ్‌, సారంగ వెబ్‌ మ్యాగజైన్‌లో క్రమం తప్పకుండా కాలమ్స్‌ రాస్తూ తెంగాణకు సంబంధించిన మహానుభావులను, గర్వించ దగ్గ సాహిత్యాన్ని, చరిత్రను వెలుగులోకి తెస్తున్నాను.

6. తెంగాణ వచ్చిన తర్వాత కార్యక్రమాలు

తెంగాణ ప్రభుత్వం ఒకటి నుంచి పదో తరగతి వరకు మార్పు తీసుకు వచ్చిన టెక్స్ట్‌బుక్‌ కమిటీ సభ్యులుగా ఉండి ఎంతోమంది మరుగునపడ్డ సాహిత్యకారులని, సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి నావంతు కృషి చేశాను. అలాగే తెలుగు అకాడెమీ తరపున వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు,, సురవరం ప్రతాపరెడ్డి రచనల ప్రాజెక్టు సంపాదకవర్గంలో ఉన్నాను. అలాగే తెలంగాణ పబ్డిక్‌ సర్వీస్‌ కమీషన్‌కు కూడా సేవలు అందజేయడం జరుగుతోంది.

7. అవార్డు

పరిశోధనారంగంలో చేసిన కృషికి గాను 2013 సంవత్సరానికి తెలుగువిశ్వవిద్యాయం 'కీర్తి పురస్కారం' ఇచ్చి గౌరవించింది. బి.ఎస్‌.రాములు నెలకొల్పిన విశాల సాహితి అకాడెమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాను. ఇప్పుడు సాహిత్య రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాస్థాయి అవార్డుని ప్రకటించింది. ఈ అవార్డుని జూన్‌ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ గారి చేతు మీదుగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో గ్రహించడమైంది.

 Sangisetti narrates his back ground for oneindia Telugu readers

8. తెంగాణ సాహిత్యంలో నా ముద్ర

- తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక అని నిరూపించాను.
- తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ అని నిరూపిస్తూ భండారు అచ్చమాంబ కథలు పుస్తకంగా వెలువరించాను.
- తెలుగులో తొలి దళిత కథకుడు భాగ్యరెడ్డి వర్మ అని చెబుతూ, ఆయన రాసిన 'వెట్టి మాదిగ' కథను వెలుగులోకి తెచ్చాను.
- మొత్తం భారతీయ సాహిత్యంలో 'దళిత' అనే పదాన్ని తొలిసారిగా తెలుగులోనే వాడారని చెబుతూ దాని చరిత్రను పాఠకలోకానికి అందించాను.
- 1969-73 మధ్యకాంలో తెలంగాణ ఉద్యమంపై వచ్చిన సాహిత్యాన్ని తొలిసారిగా మిత్రులు సుంకిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి సంకలనంగా తీసుకు వచ్చాను.
- తెంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరుగున బడ్డ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి జీవిత చరిత్రను మిత్రులు ఎన్‌.వేణుగోపాల్‌తో కలిసి పుస్తకంగా ప్రచురించాము.
- తొలి రాయలసీమ కథ 'కడపటి పైసా'ను వెలుగులోకి తెచ్చాను. ఆ తర్వాత దీనికన్నా ముందు మరిన్ని కథలున్నాయని తెలిసి వాటిని వెలుగులోకి తేవడంలో రాయలసీమ పరిశోధకులకు సహకరించాను.
- తెలుగునాట తొలి దళితోద్యమకారుడు వల్తాటి శేషయ్య గురించి మొదటిసారిగా నేనే రాశాను.

9. మెచ్చుకోలు:

కథకులు, కథానిలయం స్థాపకులు కాళిపట్నం రామారావు లాంటి పెద్దల చేత 'నీలాంటి వాడొక్కడు మా వుత్తరాంధ్రలో ఉంటే మా ప్రాంత సాహిత్యం ఎంతో వెలుగులోకి వచ్చేది' అని కితాబిచ్చారు.

శతాధిక గ్రంథకర్త, గత 60 ఏండ్లుగా పరిశోధనా రంగంలో కృషి చేస్తున్న కపివాయి లింగమూర్తి గారు 'మా కన్నా గొప్ప పరిశోధకుడివి, ఎన్నో కొతట్ట విషయాలు వెలుగులోకి తెచ్చావు' అనడం గొప్ప అనుభూతి.

ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ గారు 'సంగిశెట్టి శ్రీనివాస్‌ చేసిన కృషికి ఈ అవార్డు చాలా చిన్నది' అని తెలంగాణ రాష్ట్ర అవార్డు అందుకున్న సందర్భంగా వ్యాఖ్యానించడం ఎనలేని ప్రోత్సాహాన్నిస్తుంది.

10.. భవిష్యత్‌ కార్యకలాపాలు

తెంగాణ రాష్ట్రం కల సాకారామైన తర్వాత మరింత వేగంగా సాహిత్య, చరిత్రను తవ్వితీయాల్సిన అవసరముంది. మరుగున పడ్డ పత్రికల్లోని విషయాలు, పదకోశాలు, వ్యక్తుల జీవిత చరిత్రలు, కథలు, నవలలు, వివిధ ప్రక్రియల్లోని సాహిత్యం వెలుగులోకి రావాల్సిన అవసరముంది. అందుకు ప్రభుత్వం, సంస్థలు, వ్యక్తులు కలిసి కట్టుగా పనిచేసి మన చరిత్ర సౌధాన్ని నిర్మించుకోవాలి.

తెంగాణ సాహిత్యకోశాన్ని తయారు చేయాలి. ఇందులో ఇప్పటి వరకు తెలంగాణ నుంచి వెలువడ్డ పుస్తకాల సంక్షిప్త పరిచయం, కవులు, రచయితలు, వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవిత వివరాలను పొందుపరుస్తూ పది పన్నెండు సంపుటాల్లో మెవరించాలి. ఉద్యమ సందర్భంగా వెలువడ్డ వేల పాటలు, కవితా సంకనాల గురించి కూడా ఈ సంపుటాల్లో నిక్షిప్తం చేసినట్లయితే భవిష్యత్తరానికి తెలంగాణ ఉద్యమం నడిచిన తీరు తెలుస్తుంది.

జాతీయ సాహిత్య అకాడెమీ మాదిరిగా తెలుగులో సాహిత్య అకాడెమీని ఏర్పాటు చేసి దాని ద్వారా సాహితీ సభలు, సమావేశాలు నిర్వహించడమే గాకుండా తెలుగు సాహిత్యంలోని క్లాసిక్స్‌ని ఇంగ్లీషులోకి, ఇతర భాషల్లోని క్లాసిక్స్‌ని తెలుగులోకి తర్జుమా చేయించాలి. అలాగే గుణాఢ్యుడు మొదలు, పాలకురికి సోమనాథుని నుంచి ఆదునిక కాలం వరకు సాహితీవేత్తల జీవితం-సాహిత్యాలను పరిశోధన చేయించి పుస్తకాలుగా వెలువరించాలి. మన ఘనతను విశ్వమంతా చాటాలి.

English summary
Telangana government state awardee for his services rendered to Telangana literature Sangisetti srinivas narrated his back ground and about his works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X