• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సురవరం ‘ఆంధ్ర సాంఘిక చరిత్ర’: ఆధునికత

By Pratap
|

సురవరం ప్రతాపరెడ్డిని ఇప్పటి వరకు ఎవరూ సరిగా అంచనా వేయలేకపోయారనే అనిపిస్తుంది. ఆయన తొగు సమాజంలో దక్కాల్సిన స్థానం కూడా దక్కలేదు. అందుకు కారణం ఆయన చేసిన కృషిని అంచనా వేయడంలో తొగు బుద్ధిజీవు విఫం కావడమో లేదా పట్టించుకోకపోవడంలో జరిగింది. దీనికి కారణాు చాలానే ఉన్నాయి. ఆ కారణాను ప్రస్తుతానికి పక్కన పెడితే, ఆయన రాసిన ‘ఆంధ్రు సాంఘిక చరిత్ర'ను ఆధారం చేసుకుని ఆయన ఆలోచనా సరళిని, దృక్పథాన్ని ఆంచనా వేయడానికి ప్రయత్నిస్తే ఆయన మహితత్వం బయటపడుతుంది.

తెంగాణ సమాజం ఆధునికతలోకి ప్రవేశించలేదనే వాదనలో పస లేదనే విషయం బయటపడుతుంది. ఆధునికత అనేది కాలానికి సంబంధించింది మాత్రమే కాదు, ఆలోచనకు సంబంధించింది కూడా. కార్యకారణా ప్రాతిపదికపై విషయాను ఆంచనా వేయడానికి సంబంధించింది ఆధునికత. అంటే, హేతువును ఆధారం చేసుకుని విషయాను చూడడం. అలా చూసిప్పుడు ప్రతాపరెడ్డి అధునికుడిగా కనిపిస్తాడు. తొగు సమాజంలోకి ఆధునికత అనేది గుండుగుత్తగా రాలేదు. సమాజంలోకి కొన్ని వర్గాు ఆధునికతను అందిపుచ్చుకున్నాయి. ఆ వర్గాకు చెందినవారిలో సురవరం ప్రతాపరెడ్డి ఉంటారు. అందుకే, ఆ కాంలోనే సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రు సాంఘిక చరిత్ర' అనే అమ్యూమైన గ్రంథాన్ని మెవరించగలిగారు.

సురవరం ప్రతాపరెడ్డిని సరిగా అంచనా వేయడంలో, ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో విఫమైన తొగు సమాజం ఆయనను సంప్రదాయవాదిగా పరిగణిస్తూ వచ్చింది. ఇలా పరిగణించడానికి కారణాున్నాయి. ఆ కారణా గురించి మరో చోట చెప్పుకోవచ్చు. అయితే, ‘ఆంధ్రు సాంఘిక చరిత్ర' అనే అప్రమేయమైన పరిశోధనా గ్రంథాన్ని మెవరించడంలో ఆయన రెండు విధాుగా ఆధునికుడిగా కనిపిస్తాడు. ఒకటి, ప్రజ వైపు నుంచి చరిత్రను చూడడం. రెండోది, తన నిర్ధారణకు హేతువును ఆంబనగా చేసుకోవడం.

Suravaram Pratap reddy's Andhrula Saangika Charitra: Modernity

సురవరం ప్రతాపరెడ్డి తన ‘ఆంధ్రు సాంఘిక చరిత్ర' రచనలో హేతువును ఆధారం చేసుకుని మాత్రమే రాశాడని చెప్పడానికి చాలా ఉదాహరణున్నాయి. ఆయన శాస్త్రీయ దృష్టి గ్రంథంలోని ప్రతి పరిశీనలోనూ మనకు కనిపిస్తుంది. శాస్త్రీయ దృక్పథం ఆధునికతను ఒక కొమానం కూడా. ఆయన తన రచనలో వ్యక్తిగత అభిరుచుకు, ఇష్టానిష్టాకు తావు కల్పించలేదు. ఆయన దేవుడిని నమ్ముతాడో, లేదో తెలియదు. అది ఆయన వ్యక్తిగత జీవితంలో భాగంగానే ఉండిపోయింది. మత విశ్వాసాకు కూడా ఆయన దూరంగా తన పరిశోధన సాగించారు.

ఆయన శాస్త్రీయ దృష్టికి, మూఢ విశ్వాసా పట్ల వ్యతిరేకతకు ఒక ఉదాహరణ చూద్దాం. ‘.... నేటికిని దేవర్లు పుట్టుచూ చచ్చుచూ తొగుదేశపు జనసామాన్యు మూర్ఖతను లోకానికి చూటినవైనవి' అని అత్యంత సంప్రదాయ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, సురవరం ప్రతాపరెడ్డి ఆధునిక దృక్కోణాన్ని ప్రకటించాడు. ఆయన సమకాలికుల్లో ఇంతటి ఆధునిక దృక్పథాన్ని వ్యక్తం చేసినవారు చాలా అరుదుగా ఉన్నారని చెప్పవచ్చు.

రాజును సూర్యవంశానికో, చంద్రవంశానికో అంటగట్టడంపై సురవరం ప్రతాపరెడ్ది అధునిక దృక్కోణాన్ని చాటుకుంటూ శాస్త్రీయతను పనిముట్టుగా చేసుకుని, ‘బలిష్టులై దేశమునాక్రమించుకొని పాలించిన విజేతపై పౌరాణికుకు అనుగ్రహం కలిగినప్పుడ్లెను వారిని చంద్రునికో సూర్యునికో అంటగట్టి క్షత్రియునుగా జేసిరి' అని అంటాడు.

ప్రతాపరెడ్డి 1896 మే 28వ తేదీన జన్మించి, 1953 ఆగస్టు 25వ తేదీన మరణించారు. తెంగాణ తొలి తరానికి చెందిన ఆధునిక బుద్ధిజీవుల్లో ఆయనను ఆగ్రగణ్యుడిగా చెప్పవచ్చు. ఆధునిక భావాను పుణికిపుచ్చుకుని ఆ కాంలోని బ్రిటిషాంధ్ర సమాజంలోని ఆధునిక బుద్ధిజీవు కన్నా ఆయన ముందున్నాడని చెప్పవచ్చు. ఆయన మిగతా రచనను, ఆయన అవిరళ సామాజిక, సాంస్కృతిక సేవను ఆధునిక భావాతో ముందుకు నడిపించిన ధీశాలి.

భారత సమాజానికి బ్రాహ్మణీయ భావజాం, ఆచరణ ప్రాబల్యాన్ని ఆయన అంచనా వేయడంలో చాలా ముందున్నారని చెప్పడానికి తగిన ఆధారాను కూడా ‘ఆంధ్రు సాంఘిక చరిత్ర' గ్రంథం మనకు అందిస్తుంది. అందుచేతనే, ఆయన ‘ఇన్ని శక్తులెదురొడ్డినను బ్మ్రాణత్వమునకు భంగం కుగలేదు సరికదా అది మరింత లోతుగా పాతుకొనెను' అని అనగలిగాడు.

మూఢవిశ్వాసాను ప్రతాపరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ విషయంలో ఆయన వాక్యం పదును దేరి సూటిగా పాఠకుకు చేరుతుంది. ఈ విషయంలో ఆయన హేతువాదిగా కూడా కనిపిస్తాడు. సమాజంలో ఇప్పటికీ ‘వశీకరణ'ను విశ్వసించేవాళ్లున్నారు. ‘వాత్స్యాయనుని మొదుకొని తర్వాతి కామశాస్త్ర ప్రవర్తకుందరును వశీకరణ యోగాను గురించి వ్రాయనే వ్రాసిరి. కాని ఇవెందును పనిచేసినట్లు నిదర్శనములే లేవు. ఉన్న నిదర్శనా వన భర్తు వశీకృతుగుటకు మారుగా భస్మీకృతులైరనియే తెలియవచ్చినది' అని వ్యాఖ్యానించడం ద్వారా ఆయన ఆధునిక భావజాలానికి, శాస్త్రీయ దృక్పథానికి, హేతుబద్ధతకు పట్టం కట్టాడు.

ఓ కేసులో బ్రహ్మసభ విప్రనారాయణుడిని నిర్దోషిగా తేల్చిన విషయాన్ని సురవరం ప్రతాపరెడ్డి చాలా నిశిత దృష్టితో పరిశీలించి విశ్లేషించారు. దానివ్ల బ్రహ్మసభలో పంచాయతీ సభ్యుందరూ బ్రాహ్మణుని తేలిందని నిగ్గు తేల్చాడు. అలా ఆధునిక దృష్టి కోణం నుంచి ఆంధ్రు సాంఘిక చరిత్రను ఆయన రాశారు.

భాష విషయంలోనూ సురవరం ప్రతాపరెడ్డి అప్పటికే పూర్తి ఆధునిక దృష్టిని ప్రదర్శించాడు. వ్యవహారిక భాష పట్ల ఆయన సానుకూ దృక్పథాన్ని ప్రదర్శించారు. నిఘంటువును తీర్చి దిద్దిన తీరు పట్ల ఆయన పు చోట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘..... మాటిమాటికి వ్యావహారిక పదాను సేకరించవలెననుట....... కావున గ్రాంథిక వ్యావహారికమను భిన్న దృష్టి కలిగి యుండుట సారస్వతానికి నష్టం కలిగించడమే' అని సురవరం అనడం ద్వారా అప్పటికే ఆయన వ్యావహారిక భాషానుకూ దృక్పథాన్ని కలిగి ఉన్నారని చెప్పవచ్చు.

ఆంధ్రు సాంఘిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ప్రజ వైపు నుంచి ఒక్కో యుగంలో రాజ్య వ్యవస్థు ఎలా పనిచేస్తూ వచ్చాయో విశ్లేషించాడు. ప్రజ ఆచారవ్యవహారాను తెలియజేస్తూ న్యాయం, శాంతిభద్రతు, రక్షణ, విద్య, కళు, పరిశ్రము, వాణిజ్యం వంటి అన్ని రంగాను ఆయన విశ్లేషించారు. ఒక్కో యుగంలోని సామాజిక స్థితిగతును, రాజ్య వ్యవస్థను వింగడిరచి విశ్లేషించడానికి సాహిత్యం నుంచి ఆధారాను తీసుకున్నారు.

ఆంధ్రు సాంఘిక చరిత్ర మొదటి ప్రచురణ ఆంధ్ర సాహిత్య పరిషత్తు నుంచి మెవడిరది. అప్పటికే సురవరం ప్రతాపరెడ్డి ఆధునిక నాగరిక ప్రపంచానికి సంబంధించిన భావజాలాన్ని ప్రోది చేసుకున్నాడు. దాదాపు 20 ఏళ్లు పరిశోధన చేసి ఆయన ఈ గ్రంథాన్ని రాశాడు. 1930 ` 50 సంవత్సరా మధ్యలో ఆనాటి శోభ, సుజాత మొదలైన సాహిత్య మాసపత్రికలో ఇందుకు సంబంధించిన వ్యాసాను సురవరం ప్రతాపరెడ్డి ప్రకటించాడు. ఆ కాంలోనే ఆంధ్ర సమాజంలో ఆధునిక భావజాం విస్తరిస్తూ వచ్చింది. ఆంధ్ర సమాజానికి సమాంతరంగా తెంగాణలో సురవరం ప్రతాపరెడ్డి ఆధునికతను తన ఆలోచనల్లో ప్రదర్శించాడు. శ్రీశ్రీ వంటివారు ప్రజ పక్షం వహించడానికి కవిత్వాన్ని ఆయుధంగా ఎంచుకుంటూ దేశచరిత్రు గేయాన్ని రచిస్తే, ‘రాజు చరిత్రు మనకంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వు చరిత్రను మనకు తొపును..... తేలిన సారాంశమేమన సాంఘిక చరిత్ర మన చరిత్రయే! మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే!! అలా ఉద్దీన్‌ ఖిల్జీ, ఔరంగజేబు ఆస్‌జా చరిత్ర కంటే మన చరిత్రు మాత్రము తక్కువమైనవా?' అంటూ ప్రజ చరిత్రను గ్రంథం చేశాడు సురవరం ప్రతాపరెడ్డి.

ఆదర్శాను మాటల్లో చెప్పడం కాకుండా దాన్ని ఎలా ఆచరించాలో ‘ఆంధ్రు సాంఘిక చరిత్ర' గ్రంథ రచన ద్వారా నిరూపించారు. ప్రజాపక్షం వహిస్తామని చెప్పిన ఆరుద్ర వంటి రచయితు కూడా తమ సాహిత్య చరిత్ర నిర్మాణంలో రాజుకే పెద్ద పీట వేశారు. కానీ, ప్రతాపరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరించి, ప్రజ పక్షాన నిబడి రచన చేశారు.

భాషావాడకంలో కూడా అతి సుభమైన మార్గాన్ని సురవరం ప్రతాపరెడ్డి ఎంచుకున్నాడు. బహుశా సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రు సాంఘిక చరిత్రలో వాడిన భాష, వాక్య నిర్మాణం అప్పటి తెంగాణ శిష్టవ్యవహారికమై ఉంటుంది. ఈ రకంగా కూడా సురవరం ప్రతాపరెడ్డి ఆధునిక దృక్పథానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.

అన్ని రకాుగా ఆధునికతను ప్రదర్శించిన సురవరం ప్రతాపరెడ్డి తొగుజాతి అంతటికీ మార్గనిర్దేశం చేశాడు. కానీ, ఆయన మార్గాన్ని అనుసరించడంలో తొగు జాతి వైఫ్యమైందనే చెప్పాలి. ఆ కారణంగానే ఆయన మహత్వాన్ని గుర్తించడంలో కూడా వెనకబడిపోయింది. తొగుజాతి అంతటికీ వైతాళికుడు కావాల్సిన సురవరం ప్రతాపరెడ్డిని ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి కట్టిపడేసి తొగుజాతి తన సంకుచితత్వాన్ని ప్రదర్శించింది. తెంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అందించిన స్ఫూర్తి కారణంగా ఆయన కృషి, మహత్వం తిరిగి మెగు ప్రసరింపజేస్తున్నాయి. తెంగాణ సమాజంలోని చీకట్లను తరిమేసి, తన వైతాళికును గుర్తు చేసుకునే సందర్భాన్ని ఆ ఉద్యమం కల్పించింది. దానికి రుణపడి ఉందాం.

- కాసు ప్రతాపరెడ్డి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Suravaram Pratap Reddy's Andhrula Saangika Charitra reflected modernity in all aspects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more