వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువ సాహితీ సమ్మేళనంలో సినారె

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక పై అత్యంత వైభవంగా, ఆత్మీయ వాతావరణంలో ప్రాంరంభమైంది. తెలుగు నాట యువత నుండి అనూహ్యమైన వచ్చిన స్పందన కేంద్ర బిందువుగా తెలుగు సాహిత్య చరిత్రలో యువతరానికి మాత్రమే పరిమితమైన సాహిత్య వేదికకు తొలి సారిగా రూపకల్పన చేసిన ఈ సాహితీ సదస్సుకు 15-35 వయోపరిమితిలోని యువ సాహితీవేత్తలు, వారికి ఆశీస్సులు అందించి ప్రోత్సహించి, వారి సాహిత్య స్పందనను ఆస్వాదించడానికి వచ్చిన సర్వసాధారణలు, కేవలం సహృదయులూ అయిన తెలుగు భాషాభిమానులతో సభాప్రాంగణం క్రింద అంతస్తు పూర్తిగా నిండిపోయి, పై అంతస్తు కూడా సగం పైగా నిండిపోయింది.

ముందుగా యువ గాయని గీతాంజలి వ్యాఖ్యాతగా సుప్రసిద్ద్ధ లలిత సంగీత గాయకులు కె. రామాచారి (లిటిల్ మ్యుజీ షియెన్స్ ఎకాడెమీ) కుమారుడు సాకేత్ కొమాండూరి నిర్వహణలో యువగాయనీ గాయకులు మంచి లలిత సంగీత గేయాలని వీనులవిందుగా ఆలపించారు. ఆ తరువాత జరిగిన ప్రారంభ మహోత్సవంలో ‘జ్జానాపీఠ్' బహుమతి గ్రహీత డా. నారాయణ రెడ్డి గారు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎండ్లూరి శివారెడ్డి గారు, డా. కవిఅతా ప్రసాద్ గారు, డా. ద్వానా శాస్త్రి గారు, వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని ఈ సభ క్లుప్తంగా సభ ప్రధాన ఉద్దేశ్యాల గురించి సముచితంగా మాట్లాడారు.

Sri Tyagaraya Gana Sabha

తరువాత ప్రారంభమైన స్వీయ కవితా విభాగం, యువ కవి సమ్మేళనం, ప్రాచీన సాహిత్యాంలపై ప్రసంగాలలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన 20 మంది యువతీయువకులు తమ పాల్గొన్నారు. కృష్ణ మోహన్ :ఒకే ఒక వాక్యం', బత్తుల రామకృష్ణ, అవధానుల మణిబాబు మొదలైన వారి కవితలు, పానుగంటి శేషుకళ, లక్ష్మీ మానస, గంగిశెట్టి లక్ష్మీ నారాయణల ప్రసంగాలు బాగా ఆకట్టుకున్నాయి.

ఈ వేదికలన్నింటినీ సమర్ధవంతంగా, చక్కటి తెలుగులో, చతురోక్తులతో నిర్వహించిన గంగిశెట్టి లక్ష్మీ నారాయణ అందరి ప్రశంసలను అందుకొన్నారు. రేపటి నుండీ అక్టోబర్ 5 దాకా జరిగే ఈ మహా సభలకి ప్రతీ రోజూ సాయంత్రం 5 నుండి జరిగే ఈ యువ సాహితీ సభలకు అందరూ ఆహ్వానితులే.

English summary
Telugu youth literary meet has been launched at Sri Tyagaraya Gana Sabha in Hyderabad. Jnapeet awardee C Narayana Reddy has participated in inaugural session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X