• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాహితి

By Staff
|

భూమిమనతో మాట్లాడుతున్నప్పుడల్లా

ఒక కుదుపు

ఎవరో పాలు పిదుకుతున్న సవ్వడి

మండుటెండలకుపగులుతున్నప్పుడు

మబ్బుకి తనకి

వియోగమొస్తున్నప్పుడల్లా

దానిదొక అలజడి

చినుకు పడినప్పుడు ఒక కదలిక

అంతలోనే కనుమరుగు

పులకరింత నామమాత్రమైనా

గుల్ల జారుతున్న ఒళ్లు

భూమి ఒక నిరంతర అనుకంపిత

సంభాషిత కూడా

దాని నిశ్శబ్దం అంతా భాషే

అది పొరలు పొరలుగా లేస్తున్నా

పగుళ్లు పగుళ్లుగా బీటలు వారుతున్నా

దాని గుండెల్లో దాగున్న

విత్తనానికి ఊపిరిపోయడం కోసమే !

దాని వేదన

ఆకు రాలుతున్నప్పుడల్లా

అది చకితమవుతూనే వుంది

దాని గుండెల్లో దాచుకున్నప్రేమధునిలో

ఫలించిన ఫలాలు

పంటి పంటిలో జీవరసాలనుపొంగిస్తున్నప్పుడు

అది హర్షధ్వానాలతో

నాట్యమాడ లేదంటారా!

మబ్బులు కొండ కొసనుతాకినప్పుడల్లా

చెట్లలో పట్టిన తేనెతుట్టెలు

వాటంతటవి దానిపై వర్షిస్తున్నప్పుడు

చెరకు తోటలోని వేరు కూడా

తియ్యగా వుందని

దాన్ని రుచి చూసినప్పుడు

నేల కూడా చెరకు గడలావుందన్న

శ్రామికుణ్ని ముద్దాడ లేదంటారా!

భూమి ఒక జీవన ద్యుతి

మృదంగ ధ్వని

ఎల్లలు లేని సహజీవనానికి

అది ఒక సంకేతం

భూమి పుత్రుడా!

అనంత సంవేదనల నుండి

జ్వలనంలో జనించు

ఉపరితలంలో కాదు

అంతరంగంలో

ఆత్మవిశ్సాం ఒక లోతు

అందుకే భూమి ఒక పాఠశాల

దానిది అనంత బోధ

సూర్యచంద్రులు దాని విద్యార్థులు

భూమి పుత్రుడా! మరొక సారి

నీవూ ఒక పాలపుంతవే

నశిస్తున్న వేపు చూడకు

జీవిస్తున్నదే ప్రపంచం

నింగికి నేలకు ధారగట్టిన

భావధారల నుండే

నీ పునరుజ్జీవనం

-కత్తి పద్మారావు

 • ఉభయచరాలు- అండజాతులు

 • డివైన్‌రోమాన్స్‌

 • కొత్తపుట్టుక

 • సంకల్పబలం

 • సముద్రజీవులు

 • ఎలానడుస్తావో

 • వానకిటికీ

 • విశ్వమానవత

 • చిలుక

 • మబ్బులు

 • ఆగంతకుని స్వప్నం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X