• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆశ

By Staff
|

నిన్ననే

విరబూసిన

చిన్నారి నవ్వు

వాకిట్లో

తప్పటడుగులేస్తోంది

పడుతూ

లేస్తూ

నవ్వుతూ

స్థయిర్యాన్ని నిలబెడుతోంది !

చుట్టూచేరిన

పెద్దరికపు నేత్రాలు

జీవితపు ఒత్తిళ్లలో

ఆవిరైన నవ్వుని

పెదవులపై అద్దుకొనీ

ఆత్రంగా చూస్తున్నాయి !

బుడిబుడిఅడుగులేస్తూ -

ప్రపంచానికి నవ్వు పాశం వేసి

చిన్ని చిన్ని ఊహలకీ

సంకేతాలకీ

నవ్వుతనం నేర్పుతోంది -

భావాలకి

ని మించిన

భాష లేదన్న

భాష్య చెబుతూ !

తెలిసీతెలియని తనం

ఆ పసిడి కళ్ల లోగిళ్లలో

స్వచ్ఛతని ప్రసవిస్తే

ఆ చిన్నారి నవువ

పడుతోంది -

పడి లేస్తోంది -

నవ్వు సాయంతో !

కడలితరంగంలా -

ఆ నవ్వు

పడుతోంది

పడి లేస్తోంది

సడినా

లేచినా

నవ్వాలన్న

జీవిత సత్యం బోధిస్తూ !

-సాయి బ్రహ్మానందం గొర్తి

  • అమెరికా- చమురు

  • రోడ్డు

  • లతీఫ్‌- సామేలులు

  • రూట్స్‌

  • మర్ఫా

  • పాషాణం

  • గుడ్లగూబ

  • మొగిలిచెర్ల

  • నాకలల పునాదులు

  • విజయంగొడ్డలిది కాదు చెట్టుదే

  • చేలోకిపురుగులొస్తున్నాయి

  • సహజీవనంవర్ధిల్లు గాక!

  • మొబైల్‌పక్షులు

  • చెలిమి

  • క్షీరదాలు

  • ఉభయచరాలు- అండజాతులు

  • డివైన్‌రోమాన్స్‌

  • కొత్తపుట్టుక

  • సంకల్పబలం

  • సముద్రజీవులు

  • ఎలానడుస్తావో

  • వానకిటికీ

  • విశ్వమానవత

  • చిలుక

  • మబ్బులు

  • ఆగంతకుని స్వప్నం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X