• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాహితి

By Staff
|

ఒక్కొక్కచినుకు

కుళ్ల బొడిచి కుళ్లబొడిచి

సూర్యుణ్ని చీకటి ముద్దను చేశాయి

తెగుతున్న వాగులు, వంకలు

నగరాల నడిబొడ్డుల్లోనేసముద్రాలవుతున్నాయి

గుండెలు ఓడరేవులవుతున్న చోట

అన్నీ చెక్కపడవలే.

పిల్లా తల్లీ తడిసి ముద్దయి,వెచ్చదనం కోసం

కూలిన గుడిసెల్లో మచ్చుల సందుల్లో

ఒదుగుతున్నారు

తాటి బోదెలన్నీ తలతీసిన సైన్యాల్లా

కొట్టుకుపోతున్న పిల్లాబిక్కిని ఆదుకోలేక

తమ ఓటమినంగీకరిస్తున్నాయి

తెగిపడిన వంతెనలు

కాంట్రాక్టర్ల జేబుల నిండి పొర్లినసంకేతాలు

కూలిన రైళ్లు

ఆకాశాన్నంటినబాధ్యతారాహిత్యపు ఆనవాళ్లు

సముద్రతీరం ఒక కన్నీటి మడుగు

ఉప్పునీళ్లకు తప్పు పట్టినముక్కుబేసరలు

వండుకోవడానికి కుండ లేదు గదా

చేయా చేయా రాసినా కాక రావడంలేదు

పచ్చని పొలాలన్నీ మునిగిపోతున్న పసిబాలల్లా

చేతులు పైకెత్తికొట్టుకలాడుతున్నాయి.

ఆసామి దూరంగా ఉండి చూసి

పవరు పోయిన పురుగుమందుడబ్బా వేపు కన్ను వేశాడు

ఆకాశం మీద పాలకులు

లెక్కల యంత్రాలనుమోసుకొస్తున్నారు.

తలకాయలెన్నో కూడగట్టి

కురుక్షేత్ర సంగ్రామంలో లాగా

సామూహిక దహనకాండకు ఏర్పాట్లుచేస్తున్నారు.

ఎంత కాలం నుండో తుప్పు పట్టినగేట్లన్నీ

వాటంతటవే పైకి లేస్తున్నాయి.

నదుల్ని కలవాలని సంద్రాలు,

సంద్రాల్ని కలవాలని నదులు

ఉవ్విళ్లూరుతున్నాయి.

సుడి తిరిగిన చోటల్లా పెద్ద రొద వినిపిస్తూనేఉంది.

ఎన్ని తుఫానులు వచ్చినా రాజ్యంనిద్రమత్తులో ఉంది.

సింధూనది ఒడ్డున నగరాలనునిర్మించిన

సంస్కృతిని కాలరాచింది

గొఱ్ఱలు, గేదెలు, కోళ్లు సర్వజీవులూమోరలెత్తాయి.

కొరకడానికి పరకలేక నీళ్లు తాగి తాగికడుపులు బోరలయ్యాయి

ప్రపంచ చరిత్ర అంతా నీటి కథే

వర్ధిల్లిన నాగరికతలవిధ్వంసమంతా కన్నీటి వ్యధే

మేడల్లో మిద్దెల్లో ఉండి మీరు

అద్దాల సందుల్లో నుంచి చూస్తున్నారు.

కాశ్మీరులో భూకంపం చూశారుగా

ధనిక పేద భేదం రాజ్యానికేసోదరా.

ప్రకృతి విలయతాండవం మందుఅందరూ సమానులే.

ఒడ్డులూ ఓడలే కాదు నగరాలూనిర్మించండి

నీటిని జయించినవాడే నాగరికుడు సుమా!

(29-10-2005రేపల్లె - సికింద్రాబాద్‌ డెల్టాపాసింజర్‌ వరదలో కొట్టుకుపోయినవార్తకు....)

-కత్తిపద్మారావు

 • చకోరాలు

 • మావూరు

 • అమృతం

 • అమెరికా- చమురు

 • రోడ్డు

 • లతీఫ్‌- సామేలులు

 • రూట్స్‌

 • మర్ఫా

 • పాషాణం

 • గుడ్లగూబ

 • మొగిలిచెర్ల

 • నాకలల పునాదులు

 • విజయంగొడ్డలిది కాదు చెట్టుదే

 • చేలోకిపురుగులొస్తున్నాయి

 • సహజీవనంవర్ధిల్లు గాక!

 • మొబైల్‌పక్షులు

 • చెలిమి

 • క్షీరదాలు

 • ఉభయచరాలు- అండజాతులు

 • డివైన్‌రోమాన్స్‌

 • కొత్తపుట్టుక

 • సంకల్పబలం

 • సముద్రజీవులు

 • ఎలానడుస్తావో

 • వానకిటికీ

 • విశ్వమానవత

 • చిలుక

 • మబ్బులు

 • ఆగంతకుని స్వప్నం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X