వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాన కురిసిన పగలు
పోగొట్టుకున్న
పరిమళ స్పర్శను
తిరిగి పొందుతున్నానన్న
ఆనందం రోజంతా
చిరు జల్లులా
కురుస్తూనే వుంది
తేలిపోయే
లేత దిగులు మేఘమాలికలు
ఆశలాంటి నిరాశను
ఆకాశం వీధుల్లో
అస్పష్టంగా
పంచి పెడుతున్నాయి
చేతులు
కట్టుకొన్న విషాదం ఏ
చెట్టు కొమ్మ మీదనో నిలిచి
వాసన పసికట్టేందుకు
నాసిక సవరించుకుంటోంది
తటాలున - మాయమయే
మెరుపు తీగలు, కళ్లల్లో
ఆరిపోతున్న
మంచుదీపాలను, వెలి
గించ చూస్తున్నాయి
వాన వెలిసి పోయాకే
గాలి తగ్గిపోయాకే
దూరదేశపు కొంగలు
రంగు రంగుల పిట్టలు
ప్రశాంతంగా ఎ
ఎగిరిపోతాయి.