• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొన్ని కొడవళ్లు

By హెచ్ఆర్ కె
|

HRK
దుఃఖ వీధి సహచరుడా,

నిజంగా నేన్నీకు తెలియడం లేదా

అబద్ధం రొమ్ము లిరుసుకుని ఎంచక్కా ఎదురు పడి వస్తుందా

బతుకు మరీ అంత సరళ రేఖలో నడుస్తుందా

నిన్న రిహార్సల్‍లో అందరం అనుకున్నట్టు జరక్కపోతే

వీధి నాటకంలో నువ్వు నిట్టనిలువుగా పడిపోయినప్పుడు

అడ్డంగా చాచాల్సిన చేతులు గంభీరంగా ఆ పక్కన ఉండిపోతే

పగిలిన తల చెప్పే రహస్యం వింటావా, వింటానికి నువ్వుంటావా

ఇందరిలో స్పార్టకస్ ఎవరంటే, ఎందరో లేచి

నేనే స్పార్టకస్ అంటూ శిలువలకేసి నడవడం సరే గాని

యముడు తరుముకు వస్తున్నాడని తెలిసి

అంత వరకు నిన్ను ఉబ్బేస్తూ నిలబడిన శకుని

అదిగో అతడే శకుని పట్టుకుపొమ్మని నిన్ను చూపించడంలో

అబద్ధాన్ని చూడ్డానికి మంత్ర దర్పణం కావాలంటావా

గదాఘాతాలు, కనిపించే అగాథాలు సరే గాని

మెత్తని పదాలతో మనిషిని మొత్తి చంపిన

హత్యాప్రదేశాలలో తచ్చాడే పత్తేదారుగా

నువ్వు కొంచెం సేపయినా ఉన్నావా

ఏడవడానికి సిగ్గేసి, వేళ్లకు అంటిన జిగట చెమ్మని

ప్యాంటు జేబులో చెయి పెట్టి, ఎప్పుడైనా,

రహస్య రుమాలుతో తుడుచేసుకున్నావా

వెన్నెలలా చల్లగా వెన్నలా మెత్తగా కూడా

విషం ఉంటుందని, దరహాసం కాటేస్తుందని

తెలుసుకోడానికి నువ్వెప్పుడైనా చచ్చిపోయావా

పేజీలకు పేజీల బాధ గాలికెగిరిపోగా

చేతిలో వంటరిగా మిగిలిపోయి

అనంత శ్లోకాలు భరిస్తూ అరవలేని ఒక పిట్ట పిల్ల

మృతదేహాన్ని రెప్పలు మూసి తెరిచి మూసి తీసిన

ఫోటోగ్రాఫును పర్సులో ప్రియంగా దాచుకోగలవా

పిచికలగూడు చెదరగొట్టిన వాడు

పచ్చదనం ప్రతినిధిగా పార్లమెంటుకు ఎన్నికైతే

రెట్రోస్పెక్టివ్‍గా నీ ఓటును తగలెట్టుకోగలవా

కాలి కింది నేల కూడా సరుకు రూపమెత్తి

వాడవాడ ఒక దంతెవాడ అవుతున్నప్పుడు

బక్క చేతుల పుల్లలతో గుండె డోలు మీద గీస్తూ

పొడవాటి కొరడాతో బాదుకుని బాదుకుని

ఓడ్చిన నెత్తురు చారికల లోంచి,

చేటలో గుక్క పట్టిన బిడ్డ ఏడుపు లోంచి

కృద్ధ నయన సుంకులమ్మ లేచి వస్తుందంటావా

నీ తల పగలకుండా చేతులు చాస్తుందంటావా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X