వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనంత్ కవిత ఇద్దరే

రెండు అద్దాలు
ఎదురు పడితే
కోటి నువ్వుల్లో
కోటి నేనుల్లు
కింద పడితే
బింబోత్సవం
ఇద్దరే
ఒకరు గాజు
మరొకరు అద్దం
ఒకరు చూపిస్తారు
మరొకరు చూపునిస్తారు
ఇద్దరు
ఒక్కే అద్దం
ఇంద్రియాలకు
అబద్ధాలు మాన్పించి
నిబద్ధాలు తర్ఫీదు చేశారు
ఇద్దరు
ఒకే గాజు
అతుకుకు భయపడి
పగలడం మానేశారు