• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేల మీది చందమామలు

By Pratap
|

Kasula Linga Reddy
ఆశ్వయుజ మాస ఆమావాస్య
లోకం తెలి మబ్బుల చిరు చీకట్లని ఆలింగనం చేసుకుంటున్న వేళ
తెలంగాణ నేల మీద వెలిసిన లక్ష చందమామలు
ఆడబిడ్డల కండ్లల్ల మొలిచిన కోటి స్వప్నాలు

ఎంగిలిపూల అమాస
పునాస ఆనందాలతో నిండిన గరిసెలు
ఆరుగాలం శ్రమకు దొరికిన ఆటవిడుపు
అత్తవారింటి నుంచి తోలుకొచ్చి నడింట్ల అలంకరించిన
నిండు గౌరమ్మలు నా అక్కచెల్లెల్లు
బతుకమ్మ - ఒక సహజ అనుబంధాల ఊరేగింపు

శిశిర వసంతాలు చెట్టపట్టాలేసుకున్న
ప్రభాత లే ఎండల్లో
తలారబోసుకుంటున్న గునుగు పువ్వు
నిశి రాత్రి శశికాంతుల మత్తిల్లి
మంచుపూల దేహాన్ని విసురుకుంటున్న తంగేడు పువ్వు
నీలాకాశం నేల మీద తారాడుతున్నట్లు కట్లపువ్వు
చేతి స్పర్శ కోసం ఒళ్లంతా నరాల వేణువులు పొదుముకున్న రుద్రాక్షలు
కటాక్ష వీక్షణాల జలతారు తన్ను తాకదేమోనని
పెరటి పందిరెక్కి కిటికీలోకి తొంగిచూస్తున్న బీరపువ్వు
యవ్వనోద్రేకాల ఉన్మత్త అధరాలు సాచిన
ఇంతుల ముద్ద బంతులు -
బతుకమ్మ - తెలంగాణ నేల పూల కవాతు

అలికి ముగ్గులు పెట్టిన లోగిళ్లు
సింగారించుకున్న చెల్లెళ్ల చేతి నైపుణ్యం
వేలిసిన పూల పిరమిడ్ల ఇంద్ర ధనువులు
పీతాంబరాల ప్రేమైక పలకరింపులు
ఉల్లాసాల బాధల భావనల వాయినాలు
మత్తడి పడ్డ సంబురం ఆట - సామూహిక పాదాల ఉగ్విగ్న లయ
పాట - పోటెత్తి ప్రవహించిన చారిత్రక ధార
రాత్రి బీరిపోయి కదలడం మరిచిపోయింది -
చుక్కలు నేలకు దిగి తమ్ముళ్ల చేతి బర్మాలయినై-
సద్దుల బతుకమ్మ సంబరాల వేళ
ఆకాశంలో సగం కాదు - నా తోబుట్టువులు సంపూర్ణకాశాలు -
బతుకమ్మ - చెరువుల పులకరింపజేసిన ముద్దుగుమ్మ

మరణం అనివార్యం చెయబడ్డప్పుడు
బతుకు పోరాటాన్ని జయించిన బతుకమ్మ
రజాకారు రాకాసి మూకలు బరిబాతల ఆడించినప్పుడు
నిజాం నిరంకుశాన్ని సాయుధమై నిలువరించిన బతుకమ్మ
గడీల గోడలు కూల్చి
భూస్వామ్యాన్ని భూస్థాపితం చేసిన బతుకమ్మ
సమస్త సాంస్కృతిక ఆధిపత్యాల మీద
ఒక సరికొత్త ఆయుధం -
బతుకమ్మ - ఒక పోరాట వారసత్వం
ఒక అస్తిత్వ పోరాటం

- డాక్టర్ కాసుల లింగారెడ్డి

English summary
A Telugu poet Dr Kasula Linga Reddy appreciates Bathukamma festival and explains its specialty in his poem Nela Meedi Chandamamalu (Moons on the Earth).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X