• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కవిస్వరం: జీవేచ్ఛ కవిత

By Pratap
|

అనుభవాల దొంతరలను పేర్చుకుని, జీవిత చరమదశలో మనిషి పడే ఆరాటాన్ని సివి సురేష్ తన జీవేచ్ఛ కవితలో వినిపించారు. అత్యంత ఆర్ద్రంగా సాగిన ఈ కవిత పాఠకుల మనసులను హత్తుకుంటుంది. జీవిత చరమాంకంలో జ్ఞాపకాల దొంతరలను లెక్కపెట్టుకుంటూ వెళ్లడమనే ఆవేదనను ఆయన మనసుకు హత్తుకునేలా రాశారు. లెక్కకు మించిన రోదనల నిడివి కొలవడమే ఇక మిగిలిందని కవి అంటాడు. తీపి జ్ఞాపకాల కన్నా చేదు జ్ఞాపకాలే మనిషికి ఎక్కువగా గుర్తుంటాయి.

గాయాలు జీవితమంతా రొద పెడుతుంటాయి. వాటిని తలపోసుకుంటూ గడపడమే జీవితంగా మారుతుంది. జీవితంలో ఎవరైనా మోసం చేయవచ్చు. ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఇక సర్దుకోలేనతగా ఇంకిపోయిన మనసుకో ఊతకర్ర ఇవ్వడమే అంటాడు సురేష్ అలా అనడం ద్వారా చేసిన తప్పులను, దొర్లిన లోపాలను తలుచుకుని, అలా చేయకుండా ఉంటే బాగుండేది అనిపించే మనిషి ఊహకు ఆయన చిత్రిక కట్టాడు.

కవి ఓ దయార్ద్ర హృదయం గల వ్యక్తిని కోరుకుంటున్నాడు. తన కోసం ఓ కన్నీరు కార్చే మనిషి కోసం తండ్లాడుతున్నాడు. ఆ తండ్లాటను ఆయన తన చివరి చరణంలో అత్యంత రసప్లావితంగా చెప్పాడు. "చివరగా...../ అలెగ్జా౦డర్ లా రె౦డు చేతుల్ని/ పైన ఉ౦చి కనన౦ చేయమని అడగలేను కానీ/ రె౦డు కల్మష౦ లేని కన్నీళ్ళని నాతో కలిపి ఖనన౦ చేయమని/ చెప్పగలనో లేదో......చూడాలి!" ఆర్తితో తన ఆవేదనను వ్యక్తీకరించాడు.

- కాసుల ప్రతాపరెడ్డి

Kavisangamam poet: CV suresh's poem

ఇక ఇప్పుడు మిగిలి౦దల్లా.....

జీవిత౦ మిగిల్చిన

అవశేషాల్ని లెక్కపెట్టడమే...

లెక్కకు మి౦చిన రోదనల నిడివి కొలవడమే!

...

తొలిసారి ఆప్యాయ౦గా హత్తుకొన్న

ఆ కౌగిలి౦త ...

బిగుతైన కరచాలన౦

జ్న్జాపకాలుగా మిగిల్చిన ఊహల్ని తడుముకోవడేమే!

...

సర్దుకొన్న క్షణాలను

లెక్కపెడుతూ

ఇక సర్దుకోలేన౦తగా ఇ౦కిపోయిన

మనసుకో ఊతకర్ర ఇవ్వడమే....!

..

గు౦డెలవిసేలా

ఏడ్వడ౦ కోసమో

ఒక్క కన్నీటి చుక్కను నాలో రాల్పి౦చే

తడి స్పర్శకోసమో

కళ్ళల్లో వొత్తులు వేసుకొని నిలబడటమే.!

..

వొ౦గిన నడుములోనో

పడిన ముడతల్లోనో....

కొడుకో.. మిత్రుడో...ప్రేయసో చేసిన ద్రోహాలను ఏరుకొ౦టూ బ్రతకడమే!

..

చక్కగా నిలబడాలన్న నా కోరిక

రాచపు౦డులా మారి

రోజుకి౦త తొలుస్తున్నా...... రహస్య౦ చేసి రోజులు దొర్లి౦చడమే..

2

చివరగా.....

అలెగ్జా౦డర్ లా రె౦డు చేతుల్ని

పైన ఉ౦చి కనన౦ చేయమని అడగలేను కానీ

రె౦డు కల్మష౦ లేని కన్నీళ్ళని నాతో కలిపి ఖనన౦ చేయమని

చెప్పగలనో లేదో......చూడాలి!

- సి.వి.సురేష్

English summary
Kavisangamam poet CV suresh expresses the feelings of a man, who will at the end of life in his poem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X